Telugu News

అమ్మల ఆశీస్సులు అందుకున్న వద్దిరాజు కుటుంబం

మేడారం,విజయం న్యూస్

0

***అమ్మల ఆశీస్సులు అందుకున్న వద్దిరాజు కుటుంబం

***(మేడారం,విజయం న్యూస్)***
వన దేవతలు సమ్మక్క – సారలమ్మలను టీఆర్ఎస్ నేత వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి) కుటుంబ సభ్యులు శుక్రవారం దర్శించుకున్నారు. అన్నదమ్ములంతా సతీ సమేతంగా అమ్మవార్లకు ఎత్తు బంగారం సమర్పించుకుని, మొక్కులు చెల్లించుకున్నారు. తల్లుల గద్దెలు దర్శించుకుని ఆశీస్సులు పొందారు.

also read :-****పిలిస్తే పలుకుతా..! తోచిన సాయం చేస్తా..: పొంగులేటి

తమతో పాటు తెలంగాణ ప్రజలందరినీ చల్లగా చూడాలని తల్లులను వేడుకున్నారు. రాష్ట్రంలో సుభిక్ష పాలన సాగేలా ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆశీస్సులు అందజేయాలని వేడుకున్నారు. అనంతరం మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలిసి వద్దిరాజు కుటుంబ సభ్యులు ఆలయ పరిసరాలను తిలకించారు. వనదేవతలను దర్శించుకున్న వారిలో వద్దిరాజు సోదరులు కిషన్, వెంకన్న, దేవేందర్, కుమారులు నిఖిల్, నాగరాజు లు తదితరులు ఉన్నారు.