Telugu News

***గిరిజనుల ఆరాధ్య దైవం శ్రీశ్రీశ్రీ సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ – మంత్రి పువ్వాడ.

గిరిజనుల ఆరాధ్య దైవం శ్రీశ్రీశ్రీ సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్

0

***గిరిజనుల ఆరాధ్య దైవం శ్రీశ్రీశ్రీ సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ – మంత్రి పువ్వాడ.

***నేడు సేవాలాల్ మహారాజ్ 283వ జయంతి సందర్భంగా గిరిజనులందరికీ శుభాకాంక్షలు.

***గిరిజనుల ఆరాధ్య దైవం శ్రీశ్రీశ్రీ సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ 283వ జయంతి సందర్భంగా

***గిరిజనులందరికీరాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు.
***(విజయం న్యూస్):-
ఈ సందర్భంగా వారు మాట్లడుతూ.. సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా నిర్వహించడం కోసం దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఏటా కోటి రూపాయలను కేటాయిస్తున్నందుకు ముఖ్యమంత్రి కేసిఆర్ గారికి గిరిజనులందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు అన్నారు.

సేవాలాల్ మహరాజ్ జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించడం గొప్ప విషయమన్నారు.

గిరిజనులను అన్ని పార్టీలు, ప్రభుత్వాలు ఓటు బ్యాంకుగా చూస్తే ముఖ్యమంత్రి కేసిఆర్ ఒక్కరే వారి సమస్యలు పరిష్కరించి, డిమాండ్లు నెరవేర్చి, వారి ఆత్మగౌరవాన్ని కాపాడుతున్నారన్నారు.

also read :-నరసింహుల గూడెం ఎత్తిపోతల పథకం 2 నుండి నీటి విడుదల .

గిరిజనుల ఆత్మగౌరవాన్ని గొప్పగా చాటే విధంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న బంజారాహిల్స్ లో బంజారా భవన్ నిర్మాణం పూర్తి అయిందన్నారు. దీనికి ముఖ్యమంత్రి కేసీఆర్  50 కోట్ల రూపాయల విలువైన భూమి ఇచ్చి, 20 కోట్ల రూపాయలు నిధులతో భవన్ నిర్మాణం చేయించారన్నారు.

త్వరలోనే ముఖ్యమంత్రి కేసిఆర్  చేతుల మీదుగా ఈ భవనాన్ని ప్రారంభించుకుంటామని పేర్కొన్నారు.

గతంలో ఎప్పుడూ లేనివిధంగా రాష్ట్ర వ్యాప్తంగా బంజారా భవన్లు గొప్పగా నిర్మించుకుంటున్నామన్నారు.

గత ప్రభుత్వాలు కమ్యూనిటీ హాళ్ళ కోసం 5 లక్షలు, 10 లక్షలు ఇస్తే తెలంగాణ ప్రభుత్వంలో నేడు 31 బంజారా భవన్లు, ఒక్కొక్కటి కోటి 20 లక్షలతో నిర్మించుకుంటున్నామన్నారు.

also read :-*మాకు న్యాయం చేయండి : మంత్రి హారీష్ రావును కలిసిన పాలేరు నియోజకవర్గ రైతులు

తెలంగాణ ప్రభుత్వంలో, పార్టీలో కూడా గిరిజనులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసిఆర్  అన్నారు.

గిరిజనులకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు అనేది ఆయన చేపట్టే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు గిరిజన బిడ్డలకు దక్కుతున్న రాజకీయ, ప్రభుత్వ అవకాశాలే నిదర్శనమన్నారు.

అవకాశం ఇస్తే గిరిజన బిడ్డలు ఎవరికి తీసిపోరని అనేక రంగాల్లో వారు నిరూపించుకుంటున్నారని, సిఎం కేసిఆర్ నమ్మకాన్ని నిలబెడుతున్నారన్నారు.

గిరిజనుల కోసం దేశంలో ఎక్కడా లేనివిధంగా గురుకులాలు పెట్టి నాణ్యమైన విద్య ఇవ్వడంతో పాటు, పోషకాహారాన్ని అందిస్తున్నారన్నారు. అంతే కాకుండా ఈ సంవత్సరం గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం కూడా అమలు చేయాలని నిర్ణయించడంతో గిరిజనులు మరింత గొప్పగా అభివృద్ధి చెందేందుకు బాటలు వేశారన్నారు.

గిరిజనుల సుదీర్ఘ డిమాండ్ తండాలను పంచాయతీలు చేయాలన్న దానిని ఆచరణలో అమలు చేసి, గిరిజనుల గ్రామ పంచాయతీలను వారే స్వయంగా పాలించుకునే గొప్ప అవకాశం కల్పించిన నేత సిఎం కేసిఆర్  అన్నారు.