Telugu News

విధినిర్వహణలో 377 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు:డీజీ

అమరవీరుల దినోత్సవం సందర్భంగా నివాళ్ళు అర్పించిన డీజీపీ

0

విధినిర్వహణలో 377 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు:డీజీపీ

(హైదరాబాద్-విజయంన్యూస్)

1959 భారత్, చైనా సరిహద్దుల్లో దేశ భద్రతకు ప్రాణాలు త్యాగం చేసిన పోలీసులకు నివాళులు అర్పిస్తూ అక్టోబర్ 21 తేదీన అమరవీరుల దినోత్సవం జరువుకుంటున్నామని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు.విధి నిర్వహణలో 377 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారన్నారు. వారందరికీ నివాళులర్పించామని తెలిపారు. టెర్రరిజం, నక్సలిజంను అరికట్టడంలో పోలుసులు ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నారన్నారు. టెక్నాలజీ ఉపయోగించి శాంతి భద్రతలను కాపాడుతున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల సీసీ కెమెరాలు అవసరం ఉందని డీజీపీ తెలిపారు. పోలీస్ సంక్షేమమే ప్రధాన అజెండాగా ముందుకు వెళుతున్నామన్నారు. కోవిడ్ సమయంలో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసులకు నివాళులు అర్పిస్తున్నట్టు డీజీపీ తెలిపారు.

ALSO READ :- ఎస్ఐ, కానిస్టెబుల్ ఉద్యోగాలకు ఉచితంగా శిక్షణ : సీఐ సతీష్