Telugu News

ఇంట్లోకి చొరబడి… చేతులు కాళ్ళు కట్టేసి… బంగారం, నగదు అపహరణ.

రంగవారిగూడెంలో రాత్రి 8 గంటల సమయంలో ఇంట్లో చోరీ.

0
ఇంట్లోకి చొరబడి… చేతులు కాళ్ళు కట్టేసి… బంగారం, నగదు అపహరణ.
-12 కాసుల బంగారం,70 వేలు ఎత్తుకెళ్లిన దుండగులు.
-రంగవారిగూడెంలో రాత్రి 8 గంటల సమయంలో ఇంట్లో చోరీ.
(రిపోర్టర్ : శివకుమార్)
 దమ్మపేట /అశ్వారావుపేట సెప్టెంబరు 12( విజయం న్యూస్)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో బందిపోటు దొంగల బీభత్సం సృష్టించారు. ఓ రైతు కుటుంబాన్ని కత్తులతో చంపేస్తామని బంధించి భయభ్రాంతులకు గురిచేసి నగదు బంగారం దోచుకుపోయారు. ఈ ఘటనతో దమ్మపేట పరిసర ప్రాంతాలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాయి. బాధితులు తెలిపిన వివరాలు ప్రకారం దమ్మపేట మండలం రంగువారిగూడెం గ్రామానికి చెందిన గొట్టుపుళ్ళ ప్రభాకర్ రావు తన భార్య తో నివాసం ఉంటున్న ఇంట్లోకి రాత్రి 8:00 గంటల సమయంలో నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు చొరబడ్డారు.
వచ్చి రావడంతోనే దంపతుల కాళ్లు చేతులు కట్టేసి మీ బంగారాలు డబ్బులు ఎక్కడున్నాయో మాకు ఇచ్చేస్తే మీ ప్రాణాలు పోవు లేదంటే చంపేస్తామని కత్తులతో బెదిరించారు. భర్త ప్రభాకర్ రావు బిగ్గరగా కేకలు వేయడంతో దొంగలు అతనిపై దాడి చేసి కట్టేసి సోపాలో కూర్చోబెట్టారు. బంగారు నగదు ఎక్కడుందో చెప్పకపోతే భర్త ప్రభాకర్ పీకను కత్తితో కోస్తామని భయపెట్టి.. భార్య ఒంటి పై ఉన్న నానుతాడు, గాజులు  తీసుకోవడంతో పాటు బీరువాలో దాచిన 70,000/- నగదును తీసుకున్నారు. సుమారు రెండు గంటలపాటు దుండగులు ఇంట్లోనే ఉండి బాధితులను బెదిరించారు. బయట కాపలాగా వున్న మరో దొంగ ఎవరో వస్తున్నారు మీరు తొందరగా పని కానివ్వండి అంటూ లోపల దొంగలను హెచ్చరించాడు. దీంతో అప్పటివరకు దొంగిలించిన బంగారం డబ్బులు తీసుకుని నలుగురు దొంగలు పరారయ్యారు. పోలీసులకు చెబితే మిమ్మల్ని చంపుతామంటూ దొంగలు బెదిరించి వెళ్లడంతో.. తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో చెప్పాలా వద్దా ఆలోచించుకుని  గ్రామస్తులు సహకారంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు రంగవారిగూడెం బాధిత కుటుంబ సభ్యుల దగ్గర చేరుకొని భయాందోళనలో ఉన్న కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. దీంతో పోలీసులు వచ్చిన అనంతరం బాధిత కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. కొద్దిసేపటి తర్వాత తేరుకున్న బాధిత కుటుంబ సభ్యులు జరిగిన విషయాన్ని వచ్చిన పోలీసులకు తెలిపారు. అనంతరం అశ్వరావుపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ ఘటన స్థలాన్ని పరిశీలించారు, క్లూస్  టీం ఆధారాలు సేకరిస్తున్నారు. ప్రశాంతంగా ఉండే రంగువారిగూడెం గ్రామం జరిగిన సంఘటన తెలియడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది