సుకుమార్‌తో ధనుష్ సినిమా..?
== పుష్ప సినిమా తరువాత క్యూ కడుతున్న అన్ని బాషల హీరోలు
తెలుగు సినిమాల దర్శకుడు సుకుమార్ కు జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. ఒకే ఒక్క సినిమా ఆయన స్థాయినే మార్చేసింది. అల్లు అర్జున్ నటించిన ‘ఫుష్ప’ సినిమా బిగెస్ట్ హిట్ సాధించడంతో ఆ సినిమా దర్శకుడిగా పనిచేసిన సుకుమార్ పేరు జాతీయ స్థాయిలో మారుమోగుతోంది. సక్సెస్ తథ్యం అనుకున్న సందర్భంలో ఎవరూ ఊహించని బిగెస్ట్ హిట్ తన ఖాతాలో పడింది. దీంతో బాలీవుడ్లో రెగ్యులర్ చిత్రాల్ని సైతం ’పుష్ప’ అసాధారణ రీతిలో పక్కకు నెట్టి సెన్సేషనల్ హిట్ కైవసం చేసుకుంది. ఈ సినిమా భారీ విజయంతో సుకుమార్ తో సినిమాలు చేయడానికి అన్ని భాషల హీరోలూ ఉత్సాహం చూపిస్తున్నారు.
also read;-సమంతకు బంపర్ ఆఫర్!
ఓ బాలీవుడ్ హీరో తన దర్శకత్వంలో సినిమా చేయాలనుకుంటున్నాడని ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో సుకుమార్ రివీల్ చేశాడు. ఇంతలో ఓ తమిళ స్టార్ హీరోతో సుకుమార్ ఓ సినిమా చేయబోతున్నాడనే వార్త సోషల్ విూడియాలో గుప్పుమంటోంది. ఆ హీరో మరెవరో కాదు ధనుష్.
ఈ వార్తలో నిజానిజాలేంటో తెలియదు కానీ.. సుకుమార్ కథకు ధనుష్ బాగా ఇంప్రెస్ అయ్యాడని త్వరలోనే ఈ సినిమా అనౌన్స్ మెంట్ రాబోతోందని సమాచారం. ఆల్రెడీ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ ఓ సినిమాకి కమిట్ అవగా.. ఇటీవల వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్ హీరోగా ’సార్’ అనే మూవీ షూటింగ్ కూడా మొదలయింది.
also read :-దూసుకపోతున్న ‘గని’ టీజర్..
తమిళంలో ఈ సినిమా ’వాత్తి’గా విడుదలకానుంది. ’పుష్ప’ లో బన్నీ మాస్ అప్పీల్ కు, పెర్ఫార్మెన్స్ కు ఫిదా అయిపోయిన ధనుష్ తాను కూడా సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడట. అందుకే ఈ ప్రాజెక్ట్ సెట్ అయిందని టాక్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ధనుష్ కు కోలీవుడ్ లో బోలెడన్ని కమిట్ మెంట్స్ ఉన్నాయి. సుకుమార్ సైతం పుష్ప2 తో బీజీ కాబోతున్నాడు. ఈ నేపథ్యంలో వీరి కాంబో మూవీ ఇప్పట్లో సెట్స్ పైకి వెళ్ళే అవకాశాలు లేవు.