కరెంట్ బిల్లుల పెంపు పై ఇల్లందులో ధర్నా
ఇల్లందు నియోజకవర్గ హెడ్క్వార్టర్ ఇల్లందు పట్టణంలోని కరెంట్ ఆఫీస్ సబ్స్టేషన్ ముందు ఇల్లందు పట్టణ మరియు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డానియల్ , సైదులు గారి అధ్యక్షతన రాష్ట్ర ప్రభుత్వం పెంచిన కరెంటు బిల్లులను నిరసిస్తూ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
కరెంట్ బిల్లుల పెంపు పై ఇల్లందులో ధర్నా
(ఇల్లందు/ఖమ్మం – విజయం న్యూస్)
ఇల్లందు నియోజకవర్గ హెడ్క్వార్టర్ ఇల్లందు పట్టణంలోని కరెంట్ ఆఫీస్ సబ్స్టేషన్ ముందు ఇల్లందు పట్టణ మరియు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డానియల్ , సైదులు గారి అధ్యక్షతన రాష్ట్ర ప్రభుత్వం పెంచిన కరెంటు బిల్లులను నిరసిస్తూ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జిల్లా కాంగ్రెస్ నాయకులు లక్కినేని సురేందర్ రావు, టీ పిసిసి మెంబర్ చీమల వెంకటేశ్వర్లు, ఇల్లందు నియోజక వర్గం కాంగ్రెస్ నాయకులు డాక్టర్. జి .రవి, దల్సింఘ్ నాయక్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం ఏప్రిల్ ఒకటో తారీకు నుండి కొత్తగా గృహ సముదాయాలకు యూనిట్ పై 50 పైసలు, పారిశ్రామిక సంస్థలకు కు యూనిట్ పై ఒక రూపాయి పెంచి ఈ రాష్ట్ర ప్రజలపై 5596 కోట్ల రూపాయల ఆర్థిక భారాన్ని మోపి పేద మరియు మధ్యతరగతి కుటుంబీకులను రోడ్డుమీద పడవేసే దుశ్చర్యకు పూనుకుందని వారు ఆరోపించారు.
రాష్ట్రంలో హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఎన్ పి డి సి ఎల్ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ పంపిణీ సంస్థలకు 10235 కోట్ల బకాయిలు ఉండగా కేవలం ప్రభుత్వ రంగ సంస్థలు చెల్లించాల్సిన బకాయిలు 7141 కోట్లు ఉన్నాయని అదేవిధంగా వరంగల్ కేంద్రంగా ఉన్న ఎస్ పి డి సి ఎల్ పరిధిలో 6966 కోట్లు బకాయిలు ఉండగా ప్రభుత్వ రంగ సంస్థలు చెల్లించాల్సిన బకాయిలు 5457 కోట్లు ఉన్నాయని అంటే మొత్తం గా ప్రభుత్వం చెల్లించవలసిన బకాయిలు 12500 కోట్లు డిస్కంలకు చెల్లిస్తే ప్రజలపై 5596 కోట్ల భారం పెంచవలసిన అవసరం ఉండక పోయేది అని, 2.35 లక్షల కోట్లతో ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్యుత్ సంస్థలకు చెల్లించడానికి పైసలు లేవ అని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
అదేవిధంగా గా ఈ. ఆర్ .సి చైర్మన్ వ్యవసాయ కనెక్షన్లకు మీటర్ బిగించాలని ఆదేశాలు ఇచ్చారని ఇది కేవలం వ్యవసాయ రంగానికి ఎంత విద్యుత్ వాడకం ఉందో తెలుసుకోవాలని బిగిస్తున్నామని మాయమాటలు చెబుతున్నారని, కొత్తగా కేంద్రంలోని మోడీ సర్కార్ తీసుకొచ్చిన నూతన విద్యుత్ చట్టాన్ని తెలంగాణలో అమలు పరచి భవిష్యత్తులో రైతుల వద్ద కూడా డబ్బులు వసూలు చేసే తెలంగాణ ప్రభుత్వం కుట్రలు పన్నుతున్నారని వారు ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు.
ALSO READ *డ్రగ్స్ పార్టీలో ప్రముఖుల పిల్లలు ఉన్నారా.?:-
ALSO READ :-మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చిత్రపటానికి ముస్లింలు క్షీరాభిషేకం
కేసీఆర్ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజల పైన విశ్వాసం ఉంటే త్వరితగతిన పెంచిన విద్యుత్ చార్జీ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బి బ్లాక్ ప్రెసిడెంట్ సామ్రాట్ ,టేకులపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు నరసింహారావు, పట్టణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుదర్శన్ కోరి ,మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హరికృష్ణ, పట్టణ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎండి జాఫర్ ,మండల కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కిరణ్, మాజీ పట్టణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జీవి. భద్రం ,మాజీ కౌన్సిలర్ ధరావత్ కృష్ణ ,జిల్లా మహిళా కాంగ్రెస్ కార్యదర్శి కమల, జిల్లా నాయకులు వెంకట్ నారాయణ ,లింగంపల్లి శ్రీనివాస్, రాజు , సీనియర్ కాంగ్రెస్ నాయకులు గోపాల్, ఈశ్వర్ గౌడ్ మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షులు వల్లాల రాజయ్య, బానోత్ రవి, మోకాళ్ళ పాపారావు , గోగ్గెల పాపారావు, దనసరి రాజు, ఎండి ఇబ్రహీం, కాయం రమేష్, రామ్మూర్తి, శ్రీను, వీరన్న, రమేష్ , తదితరులు పాల్గొన్నారు.