Telugu News

పాలేరు ఎమ్మెల్యే ఆఫీస్ ఎదుట దళితుల ధర్నా

0

పాలేరు ఎమ్మెల్యే ఆఫీస్ ఎదుట దళితుల ధర్నా

== అర్హులైన దళితులకు దళితబంధు ఇవ్వాలని డిమాండ్

== ఎమ్మెల్యే కందాళకు వినతి చేసిన దళిత సంఘం నాయకులు 

(కూసుమంచి-విజయం న్యూస్)

పాలేరు నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు దళిత బంధు మంజూరు చేయాలని స్థానిక ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డికి పాలేరు నియోజవర్గ దళితులు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందు నిరసన తెలియజేశారు. నియోజకవర్గంలో అర్హులైన అందరికి దళిత బంధు పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేయడం జరిగింది.

ఇది కూడా చదవండి:-;లోక్ సభ అభ్యర్థిగా  ‘షర్మిళ’..ఎక్కడ నుంచంటే..?

తెలంగాణలోని ఎంతో ఐక్యత ఉన్న పాలేరు నియోజవర్గంలో దళిత బంధు అమలు చేయడంలో స్థానిక ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి  విఫలం అయ్యారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి దళిత బందు కొన్ని నియోజకవర్గాలకు పరిమితం అయిపోయిందని, పాలేరు నియోజవర్గంలో కొన్ని గ్రామాలకే ఈ దళితుబంధు మంజూరు చేయబడ్డదని.. మిగతా గ్రామాలలో ఒక్క కుటుంబానికి కూడా దళిత బంధువుని అమలు చేయలేదన్నారు. ఇకనైనా స్థానిక ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని పాలేరు నియోజకవర్గం లోని అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి దళిత కుటుంబాలకు దళిత బంధు అమలు చేయాలని కోరుతున్నాం

ఇది కూడా చదవండి:- నేడు నేలకొండపల్లిలో నిరుద్యోగ దీక్ష