టెన్షన్ ఎందుకు దండగా…! పొంగులేటి అండ ఉండగా…!!
== బాధిత కుటుంబాలకు ఓదార్పు… ఆర్థికసాయం
== ఎల్లప్పుడూ అండగా ఉంటాననే హామీతో కొనసాగిన పర్యటన
== దుమ్ముగూడెంలో మాజీ ఎంపీ శ్రీనివాసరెడ్డి పర్యటన
(దుమ్ముగూడెం-విజయంన్యూస్):
ఏ అక్కా… అన్న… తమ్ముడు… చెల్లి బాధలు పడొద్దు…. పూట ఎలా గడుస్తుంది…? కష్టాలు ఎలా తొలగుతాయి..? అనే టెన్షన్ అసలే పెట్టుకోవదు… ఏ సమస్య వచ్చినా పరిష్కారించేందుకు ఓ అన్నగా… తమ్ముడిగా నేను అండగా ఉంటా..! ఏ క్షణమైనా బాధితులు వారి సమస్యను తన దృష్టికి తీసుకువస్తే చాలు క్షణాల్లో ఆ సమస్య పరిష్కారానికి చొరవ చూపుతానని తెరాస రాష్ట్ర నాయకులు, ఖమ్మం పార్లమెంటు మాజీ సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: ప్రమాద ఘంటికలు మోగిస్తున్న వెంగళ రావు సాగర్ ప్రాజెక్ట్
మంగళవారం భద్రాచలం నియోజకవర్గంలోని దుమ్ముగూడెం మండలంలో పర్యటించారు. పర్యటనలో భాగంగా మండలంలోని పర్ణశాల గోదావరి ముంపు ప్రాంతాలను పరిశీలించి బాధిత కుటుంబాలకు అండగా నిలిచారు. అదేవిధంగా సీతానాగారం, చిన్నబండిరేవు, పెద్దనల్లబెల్లి, చిన్ననల్లబెల్లి, సున్నంబట్టి, బైరాగులపాడు, దబ్బనూతల, కొత్తూరు, దుమ్ముగూడెం, లక్ష్మీనగరం, గంగోలు, నందులచలక, సీతారాంపురం, నర్సాపురం, పాతమారేడుబాక, తూరుబాక గ్రామాల్లో పర్యటించారు. బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఆర్థికసాయాలను అందజేశారు. ఎల్లప్పుడూ శీనన్న అండగా ఉంటాడనే భరోసాను బాధితులకు కల్పించారు. ఈ పర్యటనలో పొంగులేటి వెంట పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావు, డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య తదితరులు ఉన్నారు.
అవ్వ తాతలకు పొంగులేటి శ్రీనన్న ఆత్మీయ పలకరింపు
-వృద్ధాశ్రమాన్ని సందర్శించి వస్త్రాలు పండ్లు బ్రెడ్ పంపిణీ చేసిన పొంగులేటి శీనన్న
అశ్వాపురం : సీతారాంపురం గ్రామంలో మానవయ్య వృద్ధుల ఆశ్రమాన్ని మంగళవారం తెరాస రాష్ట్ర నాయకులు, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆశ్రమంలో ఉన్నటువంటి అవ్వ తాతలతో ముచ్చటించారు. వారి ఆరోగ్య స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వృద్ధులకు వస్త్రాలు, పండ్లు, బ్రెడ్ పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో పినపాక మాజీ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు, ఉమ్మడి ఖమ్మం జిల్లా డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య, అశ్వాపురం మండలం ఎంపీపీ శ్రీమతి ముత్తినేని సుజాత, జిల్లా కో ఆప్షన్ సభ్యులు ఎండీ షరీఫుద్దీన్, మండల కో-ఆప్షన్ ఫోరం జిల్లా అధ్యక్షుడు షేక్ ఖదీర్, ఎంపీటీసీ కమటం నరేష్, వేములపల్లి రమేష్, ఓరుగంటి రమేష్, ముత్తినేని వాసు, వీరమాచినేని రాజా, బికసాని సత్యనారాయణ, ఆశ్రమ నిర్వాహక అధ్యక్షులు వాసిరెడ్డి రమేష్ బాబు, ఉపాధ్యక్షులు రాజశేఖర్, జనరల్ సెక్రటరీ కమటం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి :- వల్లభిలో హత్య