Telugu News

దేశంలో వజ్ర వైడుర్యాల కంటే విలువైన సంపద యువత

%% యువజన దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్

0

దేశంలో వజ్ర వైడుర్యాల కంటే విలువైన సంపద యువత
%% యువజన దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్
(ఖమ్మం ప్రతినిధి-విజయంన్యూస్)

ప్రపంచంలోనే అతి విలువైన పసిడి, వజ్ర, వైఢుర్యాల వనరుల కంటే విలువైన సంపద భారత దేశ యువత అనిజిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో బుధవారం సర్దార్ పటేల్ స్టేడియంలో నిర్వహించిన జాతీయ యువజన దినోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని, స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసారు. ఈ సదర్భంగా యువతనుద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ ప్రపంచదేశాలలో ఒక్కొక్క దేశం ఏదైనా వనరులకు ప్రత్యేకత కలిగి ఉంటుందని, అయితే మన భారత దేశం ప్రత్యేకత నేటి యువతేనని కలెక్టర్ అన్నారు

also read :-కరోనా మహమ్మారిపట్ల అప్రమత్తంగా ఉండాలి : మంత్రి పువ్వాడ ★

ఇతర దేశాలలోని జనాభాలో సగాని కంటే పైగా యాభై సంవత్సరాల పైబడిన వారుంటే, మన దేశ జనాభాలో యువత సంఖ్య అధికంగా ఉందన్నారు. యవ్వన దశలోనే మేధాశక్తి చురుకుగా ఉంటుందని, విద్యతో పాటు వివిధ క్రీడా రంగాలలో ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగపర్చుకొని అనుభవాన్ని, నైపుణ్యతను పెంపొందించుకొని భవిష్యత్తులో అన్ని రంగాలలో యువత ముందంజలో ఉండాలని కలెక్టర్ ఈ సందర్భంగా అన్నారు.
యువజన ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన వివిధ కార్యక్రమాలలో ఉత్తమ సేవలు అందించిన యువజన సంఘాలకు క్రీడాకారులకు జిల్లా కలెక్టర్ మెమోంటోలను అందిజేశారు. అదేవిధంగా రక్తదాన శిబిరాన్ని కలెక్టర్ ప్రారంభించారు.జిల్లా క్రీడాభివృద్ధి అధికారి పరందామరెడ్డి, బ్యాడ్మింటన్ అసోసియోషన్ సభ్యులు సిరిపురపు సుదర్శన్ రావు, ఒలంపిక్ అసోసియోషన్ సెక్రటరీ రఘునందన్, నేషనల్ యూత్ అవార్డు గ్రహీత బండారుపల్లి లక్ష్మయ్య, అథ్లెటిక్ అసోసియోషన్ సెక్రటరీ యం.డి.షఫీ, మహిళా క్రికెట్ అసోసియోషన్ సెక్రటరీ యం.డి. మతీన్, అథ్లెటిక్ కోచ్ యం.డి. గౌస్, వివిధ క్రీడల కోన్లు , క్రీడా, యువజన, మహిళా సంఘాలు, క్రీడాకారులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.