తుమ్మల చేరికు అప్పుడే..?
== అదే రోజు షర్మిళ చేరిక.. పార్టీ విలీనం
== ఎమ్మెల్యే రాజయ్యతో పాటు మరికొంత మంది కీలక నేతలు పార్టీలో చేరే అవకాశం
== త్వరలోనే హైదరాబాద్ కు సోనియా, రాహుల్
== సీడీబ్ల్యూసీ సమావేశం అనంతరం పార్టీలో చేరే అవకాశం
== భారీ జనసమీకరణతో రాజదానికి తుమ్మల..?
(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)
మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ముహుర్తం ఖారారైనట్లే కనిపిస్తోంది.. దాదాపుగా తేది ఖారారు చేసినట్లుగా విశ్వసనీయ సమాచారం.. అదే రోజున స్వర్గీయ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయురాలు వైఎస్ఆర్ టీపీ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిళ కూడా పార్టీలో చేరనున్నారు. ఈ మేరకు ఆమె స్థాపించిన వైఎస్ ఆర్ తెలంగాణ పార్టీ ని విలీనం చేసే అవకాశం ఉంది. అందుకు గాను ఆ ఇద్దరు నేతలకు సమాచారం వచ్చినట్లుగా తెలుస్తోంది.. అంతే కాకుండా అదే రోజున బీఆర్ఎస్ పార్టీ నుంచి టిక్కెట్ దక్కని ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది.. భారీ సంఖ్యలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ముఖ్యనాయకులు అదే రోజు పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది..ఈ విషయంపై తెలంగాణ పీసీసీ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎప్పుడు పార్టీలో చేరతారు.. ఎవరేవరు చేరతారనే విషయంపై ‘విజయం’ ప్రతినిధి అందించే ప్రత్యేక కథనంమీ కోసం..
(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)
రాష్ట్ర రాజకీయాలనే కదిలించే ప్రకటన ఇది.. ఎవరు ఊహించని విధంగా బీఆర్ఎస్ పార్టీ పార్టీ నుంచి బయటకు వచ్చిన ఆగ్రనాయకుడు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు.. ఆయనోక్కడే కాదు.. మాజీ ముఖ్యమంత్రి తనుయురాలు వైఎస్ షర్మిళ తో పాటు రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో టిక్కెట్ దక్కని ముఖ్యనాయకులు మాజీ మంత్రి రాజయ్యతో పాటు వేముల వీరేశం లాంటి ఎందరో నాయకులు ఒకే వేదిక పై చేరబోతున్నారు.. ఆ వేదిక కు రంగం సిద్దమైంది.. అందుకు గాను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జాతీయ నాయకత్వం ఏర్పాట్లు సిదం చేసే పనిలో నిమగ్నమైయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే
allso read- ఖమ్మంలో అభయ ‘హస్తం’ ఎవరికో..
తెలంగాణ రాష్ట్రంలో అతి కొద్ది నెలల్లోనే అసెంబ్లీ ఎన్నికలు జరగున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఒక అడుగు ముందుకు వేసి 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.. దీంతో ఆ పార్టీలో టిక్కెట్ దక్కని కొందరు నేతలు బీఆర్ఎస్ పై అసమ్మతి జ్వాలను రగిలిస్తున్నారు. అందులో నుంచి బయటకు వచ్చిన ఓ నిప్పు కణిక మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే జనబలం కల్గి, 40 సంవత్సరాల రాజకీయాల్లో అనేక పదవులను అనుభవించిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును బీఆర్ఎస్ పార్టీ వదులుకునేందుకు సిద్దమైంది. అందులో భాగంగానే ఆయన కోరుకున్న పాలేరు నియోజకవర్గ టిక్కెట్ ను సిట్టింగ్ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డికి అవకాశం కల్పించారు. దీంతో మాజీ మంత్రి తుమ్మల బీఆర్ఎస్ పై యుద్దాన్ని ప్రకటించారు. హైదరాబాద్ నుంచి ఖమ్మం వస్తూనే తన బలగంతో బలం చూపించారు. నాయకన్ గూడెం గ్రామంలోని జిల్లా సరిహద్దుకు వేలాధి వాహనాలు, వేలాధి మంది ప్రజలు, అభిమానులు, అనుచరులు భారీగా తరలిరావడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్రం ఒక్కసారిగా తుమ్మల ర్యాలీ వైపు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎవరు కనివిని ఎరగుని రీతిలో వాహనాలు రావడం, భారీ ర్యాలీ నిర్వహించడంతో గులాబీ దళానికి వణుకుపుట్టిన పరిస్థితి ఏర్పడింది. ఆ విధంగా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బల నిరూపణలో సక్సెస్ అయ్యారు. అయినప్పటికి సీఎం కేసీఆర్ నుంచి పిలువు రాకపోవడంతో నేరుగా విలేకర్ల సమావేశంలో పాలేరు నుంచి పోటీ చేస్తానని స్పష్టంగా తెల్చి పడేశారు.
allso read- తుమ్మలకు కురుక్షేత్ర యుద్దమే
అయినప్పటికి సీఎం కేసీఆర్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో పాటు కార్యకర్తలు, అనుచరులు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లాలని డిమాండ్ చేస్తుండటం, రోజురోజుకు మద్దతు మరింత పెరుగుతుండటంతో తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్దమైయ్యారు. కాగా తక్షణమే స్పందించిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎన్నికల కమిటీ చైర్మన్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తుమ్మల నాగేశ్వరరావును పార్టీలోకి ఆహ్వానించేందుకు పరుగులు తీశారు. ఆయన్ను కలిసి పార్టీలోకి రావాలని కోరారు. కాగా స్పందించిన తుమ్మల నాగేశ్వరరావు పార్టీలోకి వచ్చే విషయంపై మౌనంగా ఉంటూనే కార్యకర్తల అభిష్టం మేరకు నడుచుకుంటానని తెల్చి చెప్పారు. కాగా తుమ్మల నాగేశ్వరరావు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాందీ పోన్లో మాట్లాడి ఈనెల 6న ఢిల్లీకి రావాలని పిలిచినట్లు విశ్వసనీయ సమాచారం. అయితే ఈనెల 6న ఢిల్లీ వెళ్లాల్సి ఉండగా, సోనియా, రాహుల్ గాంధీ అతి త్వరలోనే తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ పర్యటన ఊహించని విధంగా రద్దు అయ్యిందనే చెప్పాలి.
== చేరికకు ముహుర్తం ఖరారు
మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలో చేరికకు ముహుర్తం ఖరారైంది.. ఈనెల 16 లేదా 17న బహిరంగ సభ సాక్షిగా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ముహుర్తం పిక్స్ అయినట్లు విశ్వసనీయ సమాచారం. ఏఐసీసీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ఖర్గేలతో పాటు డీకే శివకుమార లాంటి దిగ్గజ నేతలు సమక్షంలో తుమ్మల నాగేశ్వరరావు పార్టీలో చేరేందుకు ముహుర్తాన్ని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. తుమ్మల నాగేశ్వరరావుతో పాటు వైఎస్ షర్మిళ, మాజీ మంత్రి రాజయ్య, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, కోదాడ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు కూడా అదే రోజు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది. అంతే కాకుండా బీఆర్ఎస్ పార్టీలో టిక్కెట్ రాకా అసమ్మతిగా ఉన్న కొందరు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యులు, బీజేపీ పార్టీ కీలక నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వారితో పీసీసీ అధ్యక్షుడు, సీఎల్పీ నేత తో పాటు జాయినింగ్ కమిటీ కూడా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది..
== భారీ వాహనాలు ర్యాలీ.. జన సమీకరణతో హైదరాబాద్ కు..?
తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ లో చేరేందుకు హైదరాబాద్ వెళ్లాల్సి వస్తుంది. అందుకు గాను ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి వేలాధి వాహనాలను, లక్షలాధి మంది జనసమీకరణతో భారీ ర్యాలీగా హైదరాబాద్ కు వెళ్లాలని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అనుకుంటున్నట్లు తెలుస్తోంది.. ఆ ర్యాలీ, ఆ జన సమీకరణతో తెలంగాణ లో కచ్చితంగా రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని చెప్పే విధంగా బహిరంగ సభను, జాయింనింగ్స్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది.
== త్వరలో సోనియా, రాహుల్ తెలంగాణ కు రాకా
అతి త్వరలో తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సీడబ్ల్యూసీ సమావేశాన్ని తెలంగాణలో నిర్వహించాలని ఏఐసీసీ అగ్రనేత రాహుల్, సోనియా గాంధీలు నిర్ణయించారు. సౌత్ ఇండియాకు మేజర్ సిటిగా హైదరాబాద్ ఉండటం, ఇక్కడ సౌకర్యాలు మెరుగ్గా ఉండటం, వాతావరణం బాగుండటంతో హైదరాబాద్ కేంద్రం గా సీడబ్ల్యూసీ సమావేశాన్ని నిర్వహించాలని ఆగ్రనేతలు భావించారు. ఈ మేరకు ఈనెల 16, 17న రెండు రోజుల పాటు హైదరాబాద్ లో సీడబ్ల్యూసీ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఏఐసీసీ కీలక నేతలందరు, సీడబ్ల్యూసీ సభ్యులు అందరు ఈ సమావేశానికి హాజరవుతారు. ఈనెల 16న సీడబ్ల్యూసీ సమావేశం జరుగుతుంది.
allso read- అసెంబ్లీకి ముహుర్తం ‘డిసెంబర్ 6’..?
ఆ తరువాత 17న భారీ బహిరంగ సభను హైదరాబాద్ లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు 5లక్షల మంది ఈ సభకు వచ్చే విధంగా ఏర్పాట్లు చేసే అవకాశం ఉంది. అయితే అదే సభ రోజున మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వైఎస్ షర్మిళ, మాజీ మంత్రి రాజయ్య, వేముల వీరేశం, మైనంపల్లి తో పాటు మరికొంత మందిని సోనియాగాంధీ, రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీలో చేర్చుకునే అవకాశం ఉంది. అందుకు గాను ఈ విషయంపై పార్టీలో చేరే వారికి సమాచారం అందినట్లు తెలుస్తోంది. చూద్దాం. రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి మార్పులు జరగబోతాయో..?