Telugu News

దిగుడా..? దూకుడా..?

== జగనన్నా..? ఏం చేయను..?

0

దిగుడా..? దూకుడా..?
== జగనన్నా..? ఏం చేయను..?
== గురువును కలిసిన శిష్యుడు
== తాజా రాజకీయాలపై చర్చించినట్లు సమాచారం..?
== పాత పరిచయం మేరకే మర్యాదపూర్వకంగా కలిసినట్లు చెబుతున్న ఆ నేత
== రాష్ట్రంలో సంచలనంగా మారిన గురువుతో బేటి
(ఖమ్మం ప్రతినిధి-విజయంన్యూస్)
అధికార పార్టీలో సర్వం అవమానాలను ఎదుర్కోంటున్న పొంగులేటి రాజకీయ భవిష్యత్ కు పునాది వేసుకుంటున్నారా…? తన దారి చూసుకునే పనిలో నిమగ్నమైయ్యాడా…? ఆయన గురువుగా భావించే జగన్ ను అత్యవసరంగా బేటి వేనకాల అంతర్యమేంటి..? ఆయన పార్టీ మారే యోచనలో ఉన్నాడా..? లేదంటే కొద్ది రోజుల పాటు వేచి చూసే దోరణిలో ఉన్నారా..? ఆ విషయంపై సలహా తీసుకునేందుకు జగన్ ను కలిసి చర్చించాడా..? ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో సరికొత్త సంచలనం.. ఇప్పటి వరకు నిశబ్ధంగా ఉన్న ఆ నాయకుడు ఒక్కసారిగా సీన్ మొత్తం మార్చేశారు.. అనేక దఫాలుగా గోడదూకుడు తప్పదని విస్తతంగా ప్రచారం జరుగుతున్నప్పటికి నిశబ్ధంగా ఉంటూ నవ్వుతూ కార్యకర్తలకు సమాధానం చెప్పే ఆ నేత ఉన్నట్టుండి ఒక్కసారి సీన్ సితారు చేసే పరిస్థితి తీసుకొచ్చాడు.. ఆయన తాజా గురువుగా భావించే సీఎం జగన్ మోహన్ రెడ్డితో అత్యవసర బేటిఅయ్యారు..

also read ;-ఏపీ ఎక్స్‌ప్రెస్‌ రైల్ లో పొగలు

దీంతో ఒక్కసారిగా రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. ఇప్పటికిప్పుడు ఆయన గురువును కలవాల్సిన అవసరం ఏంటనే విషయంపై సర్వత్ర చర్చ జరుగుతోంది. ఇంతకు ఆయన దిగుతున్నాడా..? దూకుడు పెంచుతాడా..? అనే విషయంపై ఉత్కంఠ నేలకొంది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఉమ్మడి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే టీఆర్ఎస్ పార్టీకే గుండెకాయలాంటి వాడు. ఆయన అందరి వాడిగా ముద్రపడ్డారు. సామాన్యుడి నుంచి నాయకుడి వరకు ఆయన పేరు తలవని వారు లేరు. అలాంటి నాయకుడికి టీఆర్ఎస్ పార్టీలో సమస్థానం కరువైంది. ఆయనపై చిన్నచూపు ఎక్కువైంది.. ప్రతి ఎన్నికల్లో ఆయనపై అధికార పార్టీ నేతలే ఆరోపణలు చేస్తున్నారు. పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని విమ్మర్శులు చేస్తున్నారు. కాగా ఆయన చేసేది లేక అలాగే పార్టీలో కొనసాగుతున్నారు. కార్యకర్తలకు, నాయకులకు సర్థిచెబుతున్నారు. అధినేతపై నమ్మకముందని, కచ్చితంగా మన ప్రీయార్టీ మనకే ఉంటుందని చెబుతూ వస్తున్నారు.. కానీ రోజులు గడిచిపోతున్నాయే తప్ప పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి వచ్చిన ప్రీయార్టీ ఏమి లేదు. కనీసం వార్డు కౌన్సిలర్ ఎంపిక విషయంలో కూడా ఆయన అభిప్రాయాన్ని తీసుకోవడం లేదు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ఆయన పూర్తిగా నిశబ్ధమైయ్యారు. అధికార పార్టీపై ఎప్పుడు విమ్మర్శలు చేయకపోయినప్పటికి తనంతట తానై గ్రామాల్లో పర్యటిస్తున్నారు. తను నమ్మిన నాయకులు, కార్యకర్తలను కలిసి వారికి చేయాల్సిన సేవా కార్యక్రమాలను చేస్తున్నారు. దీంతో ప్రజల్లో మరింతగా దగ్గరవుతున్నారు.

also read :-శిథిలావస్థ భవనాలకు నోటీసులు జారీ చేయాలి
== 2014లో ఎంపీగా
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి 2012లో వైసీపీ పార్టీ ఆదినేత జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్ లో వైసీసీ పార్టీలో చేరారు. ఆ తరువాత 2014లో జరిగిన సాధాహరణ ఎన్నికల్లో వైసీపీ పార్టీ అభ్యర్థిగా ప్యాన్ గుర్తుపై ఖమ్మం ఎంపీగా విజయం సాధించిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఆయనతో పాటు మరో నలుగురు ఎమ్మెల్యేలను గెలిపించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర విభజన అనంతరం ఆ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా మారిన పొంగులేటి శ్రినివాస్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలు రాకపోయినప్పటికి ఆయన బాధ్యత తీసుకున్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం నాలుగు అసెంబ్లీ స్థానాలను గెలిపించుకుని రాష్ట్రంలోనే బలమైన నాయకుడిగా అవతారమేత్తాడు.

also read ;-ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి :-మొక్క శేఖర్ గౌడ్

దీంతో కాలక్రమేనా తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ బలంగా మారడంతో ఆయన తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. అనంతరం ముందస్తు ఎన్నికల్లో కొత్తగూడెం టిక్కెట్ ను ఆశించిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఎంపీ టిక్కెట్ వస్తుందని భావించినప్పటికి అసెంబ్లీ, పంచాయతీ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారని సీఎం కేసీఆర్ ఎంపీ అభ్యర్థిగా టీడీపీ పార్టీ నుంచి వచ్చిన నామా నాగేశ్వరరావుకు అవకాశం కల్పించారు. దీంతో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వర్గీయులు కొంత అసహానానికి గురైనప్పటికి సీఎం కేసీఆర్ హామితో ఆ పార్టీలో పనిచేస్తూ వచ్చారు. అయితే ఆతరువాత ఏ ఎన్నికలు జరిగిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పై ఆ పార్టీ నాయకులు ఆరోపణలు చేయడం, పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారని రాష్ట్ర పార్టీకి ఫిర్యాదు చేయడం జరుగుతూ వస్తోంది. గత కొద్ది రోజుల క్రితం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యతిరేకంగా పనిచేశారని, అందుకు గాను 146 ఓట్లు కాంగ్రెస్ కు క్రాస్ అయ్యాయని స్వయంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్సీ అభ్యర్థి తాతామధుసూధన్, ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, రాములు నాయక్ తదితరులు సీఎం కేసీఆర్ కు ఫిర్యాదు చేశారు. అయినప్పటికి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పార్టీపై కానీ, ఆరోపణలపై కానీ స్పందించలేదు. పార్టీ ఇబ్బందిపడే వ్యాఖ్యలు చేయలేదు. కానీ ఆయన వర్గీయులు మాత్రం చా సీరియస్ గా ఉన్నారు.
== జగన్ తో బేటి..
అంతా ప్రశాతంగా ఉంది అనుకుంటున్న సందర్భంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఒక్కసారిగా అందరి కండ్లు ఆయన వైపు తిప్పుకున్నాడు. ఆయన గురువుగా భావించే ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డితో అత్యవసరంగా బేటి అయ్యారు. ఆయన తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. అయితే ఇది తాత్కాలిక బేటి మాత్రమేనని, పాత పరిచయంలో భాగంగా మర్యాధ పూర్వకంగా కలిశారని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెబుతున్నారు. కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో పొంగులేటి అంశం హాట్ టాఫిక్ గా మారింది. ఆయన సీఎం జగన్ తో ఎందుకు బేటి అయ్యారు అనే అంశంపై అధికార పార్టీ తో పాటు ప్రతిపక్షపార్టీలు విశ్లేషణ చేసే పనిలో పడ్డాయి. ముఖ్యంగా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పొంగులేటి జగన్ బేటి వెనకాల అంతర్యమేంటనే విషయంపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయం రోజంతా హాట్ టాఫిక్ గా మారింది.
==దూకుడా..? దిగుడా..?
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన రాజకీయ భవిష్యత్ పై పునారాలోచనలో పడ్డారు. అధికార పార్టీలో తన స్థాయికి తగిన ప్రీయార్టీ లేదని భావిస్తున్న పొంగులేటి భవిష్యత్ రాజకీయాల్లో భాగంగా అడుగులు ఎటువైపు వేయ్యాలి..? కారు దిగిపోవాలా…? లేదంటే కారులో ఉండి దూకుడు పెంచాలా..? అనే విషయంపై పలువురు సలహాలను తీసుకుంటున్న్లు తెలుస్తోంది. అనే విషయంపై పలువురి సలహాలను తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.. అందులో భాగంగానే ఆయన గురువుగా భావించే ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని అత్యవసరంగా బేటి అయినట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే రాజకీయ పరిణామాలపై ఆయన జగన్ తో చర్చించినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన పార్టీ మారే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ లేదా బీజేపీ పార్టీ లోకి వెళ్లాల లేదంట తిరిగి వైసీపీ పార్టీలో చేరి తెలంగాణ లో ఆ పార్టీని బలోపేతం చేయాలా..? అనే విషయంపై చర్చించినట్లు తెలుస్తోంది.

అయితే కొద్ది రోజులు వేచి చూడాలని, సమయం సందర్భాన్ని భట్టి నిర్ణయం తీసుకుంటే మంచిదని జగన్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సూచించినట్లు తెలుస్తోంది. దేశంలో జరగబోతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల అనంతరం రాజకీయ పెనుమార్పులు జరిగే అవకాశం ఉందని, తద్వారా రాజకీయ మార్పులు, పొత్తులు కూడా మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోందని జగన్ మోహన్ రెడ్డి చెప్పినట్లు సమాచారం. కాగాకొంత సమయం వరకు వేచి చూసి నిర్ణయం తీసుకుంటే మంచిదని చెప్పినట్లు సమాచారం. దీంతో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడ అందుకు అంగీకరించినట్లు సమాచారం. ఎదైనప్పటికి వైస్ జగన్ తో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బేటి రెండు రాష్ట్రాల్లో సంచలనంగా మారిందనే చెప్పాలి. అయితే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అడుగులు ఎటువైపు పడతాయానే విషయంపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. కానీ ఆయన కొద్ది రోజుల పాటు వేచి చూసే దోరణి అవలంభించే అవకాశం లేకపోలేదు.