బీఆర్ఎస్ లో విందు రాజకీయం..
== బల నిరూపనలో తుమ్మల, పొంగులేటి
== ఆత్మీయసమ్మెళనం నిర్వహించిన ఆ ఇద్దరు నేతలు
== వాడవాడకు పువ్వాడ అంటూ ఎన్నికల ప్రచారంకు తెరలేపిన మంత్రి
== భారీగా తరలివచ్చిన జనం
== జనసందోహంలో ఖమ్మం నగరం
(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)
బీఆర్ఎస్ పార్టీలో వర్గవిబేదాలకు నిలయంగా మారింది నూతన సంవత్సరం వేడుకలు. విందు రాజకీయంతో అధికార పార్టీ అధినేతకు సవాల్ చేస్తున్నారు. ఆత్మీయ సమ్మెళనంతో ప్రజల ముందుకు వెళ్తున్నప్పటికి అధినేతకు, అధికార పార్టీకి సవాల్ గానే ఆ నేతల వర్గీయులు భావించారు. దీంతో ఖమ్మంలో విందు రాజకీయం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాఫిక్ గా మారిపోయింది. ఎవరు ఏం ప్రకటిస్తారా..? ఎవరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారా..? పార్టీ మారతారా..? ప్రభుత్వానికి సపోర్టుగా ఉంటారా..? బీజేపీలో చేరతారా.. కాంగ్రెస్ లో చేరతారా.? అంటూ ఆ ఇద్దరు నేతలు ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తారేమోనని ఒక వైపు రాజకీయ నాయకులు, మరో వైపు ఆ ఇద్దరు నేతల వర్గీయులు అసక్తిగా ఎదురు చూశారు. మరీ ముఖ్యంగా అధికార, ప్రతిపక్షాలు ఖమ్మం వైపు చూసే పరిస్థితి కనిపించింది.
== జిల్లాలో వింధు రాజకీయం ఇది కూడా చదవండి: ఆ పని చేయడమే నా లక్ష్యమని అంటున్న తుమ్మల
ఖమ్మంలో విందు రాజకీయం.. సత్తా చాటేందుకు సిద్ధమైన తుమ్మల, పొంగులేటి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో క్రియాశీలకంగా వ్యవహరించే మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజకీయ భవితవ్యంపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో కొత్త సంవత్సరం ఆరంభంలోనే ఇద్దరు నేతలు తమ సత్తా చాటేందుకు విందు రాజకీయాలకు శ్రీకారం చుట్టారు. అంతే కాకుండా విందు రాజకీయంపై ప్రభుత్వ పెద్దలు నిఘా పెట్టిన పరిస్థితి ఏర్పడింది. నూతన సంవత్సర వేడుకలు ఖమ్మం జిల్లాలో రాజకీయ వేడి పుట్టించాయి. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ముఖ్య నాయకులంతా విందు రాజకీయాలకు తెర లేపారు. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తన సొంత నియోజకవర్గం ఖమ్మంలోని 17వ డివిజన్ నుంచి వాడ వాడకు పువ్వాడ పేరుతో పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ప్రతి డివిజన్‌లో స్థానిక నాయకులు, ప్రజలను కలుస్తూ వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరారవు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి న్యూ ఇయర్ సందర్భంగా విందు రాజకీయాలకు తెర లేపారు.
== పోటీకి సై అంటున్న తుమ్మల
పాలేరు నియోజకవర్గంలో ఓటమి చూసిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరోసారి పాలేరు నియోజకవర్గంలో పోటీ చేసేందుకు సై అంటున్నారు. అందులో భాగంగానే ఆయన స్థానికంగా ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉండాలని నిర్ణయించారు. ఈ మేరకు పాలేరు నియోజకవర్గం పరిధిలోని ఖమ్మం గ్రామీణ మండలంలో నూతన గృహ ప్రవేశ కార్యక్రమం ఏర్పాటు చేశారు. పాలేరు నియోజకవర్గానికి చెందిన తుమ్మల అభిమానులు, నాయకుల ఆత్మీయ కలయిక పేరుతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు పాలేరు నియోజకవర్గం నుంచి తుమ్మల అభిమానులు భారీగా తరలివచ్చి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో తామంతా తుమ్మల వెంటే ఉంటామని నాయకులు స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: ఇది ఎలక్షన్ ఇయర్.. ఇక ప్రచారం షూరు
ఖమ్మం జిల్లా అభివృద్ధికి తుమ్మల చేసిన కృషిపై దాదాపు 10వేల పుస్తకాలు ముద్రించి పంపిణీ చేస్తున్నారు. తుమ్మల మళ్లీ పాలేరు నుంచే పోటీ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే, ప్రస్తుతం పాలేరు నియోజకవర్గంలో భారాస ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి ఉన్నారు. భారాస తరఫున కచ్చితంగా తానే పోటీ చేస్తానని ఆయన చెబుతున్నారు. ఈ నేపథ్యంలో భారాస శ్రేణులు గందరగోళానికి గురవుతున్నారు.
== బీఆర్ఎస్ పై యుద్దం ప్రకటించిన పొంగులేటి
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి నూతన సంవత్సర వేడుకల సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ పై యుద్దం ప్రకటించారు. కార్యకర్తలు, అభిమానుల కోసం తన నివాసంలో ఆత్మీయ విందు ఏర్పాటు చేయగా, ఆ విందు కార్యక్రమం సందర్భంగా పొంగులేటి సంచలన వ్యాఖ్యలు చేశారు. పొంగులేటి కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘‘భారత రాష్ట్ర సమితిలో గత నాలుగేళ్లుగా మనకు ఎలాంటి గౌరవం దక్కిందో మీ అందరికీ తెలుసు. భవిష్యత్తులో ఎలాంటి గౌరవం దక్కాలని మీరు భావిస్తున్నారో కూడా నాకు తెలుసు. మీ అందరి మనసులో ఏముందో తెలుసు.. కానీ, ఇంకా ఓపిక పట్టాల్సిన అవసరం ఉంది’’ అని పార్టీ శ్రేణులకు ఒక సంకేతమిచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో తాను పోటీ చేస్తానని స్పష్టం చేశారు. భద్రాచలం, మధిర మినహా మిగిలిన అన్ని నియోజకవర్గాల్లోనూ భారాస ఎమ్మెల్యేలే ఉన్నారు. ఖమ్మం జిల్లాలో ఆయనతో పాటు తన అనుచరులు కూడా అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తారని పొంగులేటి చెప్పడం భారాసతో పాటు ఖమ్మం జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. 2019 ఎన్నికల సందర్భంగా అప్పటి సిట్టింగ్ ఎంపీ పొంగులేటిని కాదని భారాస తరఫున నామా నాగేశ్వరారవుకు టికెట్ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో నామా విజయం సాధించారు. అయితే, అప్పటి నుంచి పొంగులేటికి పార్టీలో సరైన ప్రాధాన్యం దక్కలేదని ఆయన అబిమానులు భావిస్తున్నారు. పొంగులేటి పార్టీ మారుతారని ఇటీవల జోరుగా ప్రచారం జరిగింది. కానీ, దీనిపై ఆయన ఎలాంటి ప్రకటన చేయలేదు. తాజాగా పొంగులేటి తన మనసులో మాటను బయటపెట్టారు. మొత్తం మీద ఎన్నికల ఏడాదిలో ఖమ్మం జిల్లాలో రాజకీయాలు హాట్ టాపిక్‌గా మారాయి.