తుమ్మలకు అడుగడుగున నిరాజనం
== పాలేరు, మధిర నియోజకవర్గంలో పర్యటించిన మాజీ మంత్రి == పలు కుటుంబాలకు నివాళ్లు అర్పించిన తుమ్మల నాగేశ్వరరావు
తుమ్మలకు అడుగడుగున నిరాజనం
== పాలేరు, మధిర నియోజకవర్గంలో పర్యటించిన మాజీ మంత్రి
== పలు కుటుంబాలకు నివాళ్లు అర్పించిన తుమ్మల నాగేశ్వరరావు
(కూసుమంచి-విజయంన్యూస్)
మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గురువారం పాలేరు, మధిర నియోజవర్గంలో పర్యటించగా, పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు అడుగడుగున నిరాజనం పలికారు. ఆయనపై పూల వర్షం కురిపించారు. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలివచారు. ముందుగా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మధిర నియోజకవర్గం ముదిగొండ మండలం పెద్దమండవ గ్రామంలో టిఆర్ఎస్ నాయకులు సింగు రాజయ్యని పరామర్శించారు. ముదిగొండ మండలం వనంవారి కిష్టాపురం గ్రామంలో ముదిగొండ సహకార సంఘం అధ్యక్షుడు తుపాకుల యలగొండ స్వామి ఆధ్వర్యంలో వేలాదిమంది ప్రజలు డప్పులు,కోలాటాలు బాణసంచాలతో ఘనస్వాగతం పలికారు.అంనతరం తిరుమలాయపాలెం మండలం గోల్ తండా సర్పంచ్ రంగా కుటుంబాన్ని పరామర్శించారు.
తిరుమలాయపాలెం మండలం జల్లేపల్లి గ్రామంలో మట్ట వెంకటేశ్వరరావు తండ్రి మట్టా రంగయ్య దశదిన కర్మలో పాల్గొన్నారు. ఖమ్మం ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ రవిశంకర్ తండ్రి ఇజ్రాయిల్ ఇటీవలే గుండెపోటుతో మ్రుతి చెందగా, వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. అయితే ఎక్కడకి వెళ్లిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ఘన స్వాగతం లభించింది.
also read :- ఖమ్మంలో కాంగ్రెస్ విన్నూతన నిరసన
also read :- 25న భట్టి పాదయాత్ర
ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా టిఆర్ఎస్ నాయకులు రామసహాయం నరేష్ రెడ్డి, సాధు రమేష్ రెడ్డి, ముదిగొండ జడ్పిటిసి పసుపులేటి దుర్గ, తమ్మినేని కృష్ణయ్య,జొన్నలగడ్డరవికుమార్, మాదాసు ఉపేందర్, భారీ వీరభద్రం, బండి జగదీష్, నెల్లూరు కోటి, అంచ లక్ష్మణ్,పత్తి శ్రీనివాస్,పసుపులేటి వెంకట్, సుధాకర్ రెడ్డి,మాదాసు ఉపేందర్,బారి వీరభద్రం, కూరపాటి వేణు, కొండా మహిపాల్, అర్వపల్లి జనార్దన్, మధిర నియోజకవర్గ సీనియర్ టిఆర్ఎస్ నాయకులు మొండి తోక సుధాకర్, చెరుకూరి నాగార్జున, పాలేరు,మధిర నియోజకవర్గ టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.