Telugu News

అర్హులను తొలగించి.. అనర్హులకు ఆసరా?

తప్పుడు పత్రాలతో పింఛన్ల మాయ

0

వారికి అట్టా..! వీరికి ఇట్టా..!!

== అర్హులను తొలగించి.. అనర్హులకు ఆసరా?

== మాకు కావాలి.. మాకే కావాలి అంటూ కీచులాట.

== ఆక్రమణదారులపై చర్యలు తప్పవు.

రెవిన్యూ గ్రామం నూగురు సర్వే నంబర్ 1 లో ఉన్న ప్రభుత్వ స్థలంలో హెలికాప్టర్ కొరకు కేటాయించిన రెండు ఎకరాల స్థలాన్ని మినహాయించి గిరిజన సంఘాల ఆధ్వర్యంలో 2020 సంవత్సరమున కొందరు ఆదివాసులు గుడిసెలను వేయటం జరిగింది. అప్పుడు సంబంధిత అధికారులు ఎల్ ప్యాడ్ సాకుతో గుడిసెలను తొలగించి సిమెంట్ స్తంభాలను, రేకులను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంవత్సరం సుమారు ఐదు నెలల క్రితం వాడగూడెం రెవిన్యూ గ్రామం సర్వేనెంబర్ 44పి లోని ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించిన వారిని తొలగించడంలో కాలయాపన ఎందుకు జరుగుతుంది. ఏజెన్సీలోపూర్తి హక్కు కలిగిన వారికి అట్టా.. అధికారాన్ని చూపి, చట్టాన్ని ఉల్లంఘించి గుడిసెలు నిర్మించుకున్న వీరికి ఇట్టా.. వ్యవహరించడం మండల వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

నూగురు వెంకటాపురం, నవంబర్ 7 (విజయం న్యూస్):-                                        ఇది కూడా చదవండి: డిసెంబర్ 15 నాటికి  ‘రైతుబంధు’: సీఎం కేసీఆర్
షెడ్యూల్డ్ ప్రాంతంలో పూర్తిగా సర్వాధికారాలు కలిగిన వారు ఎవరైనా ఉన్నారంటే అది ఆదివాసీలే. అది గుర్తించిన ప్రభుత్వాలు సైతం ప్రత్యేకమైన చట్టాలను కల్పించాయి. ఈ ప్రాంతంలో ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకునే హక్కు పూర్తిగా గిరిజనులకే చెందుతుంది. కానీ వారి హక్కులు పాలకుల చేతిలో దుర్వినియోగం అవుతున్నాయి. దానికి నిదర్శనమే 2020 సంవత్సరంలో ఆదివాసుల తొలగింపు. పాలకులు ఆర్దిక, రాజకీయ బలాన్ని ఉపయోగించి అధికారులను తప్పు ద్రోవ పట్టించి తొలగించినట్లుగా కొందరు గిరిజన నాయకులు ఆరోపిస్తున్నారు.

== అర్హులను తొలగించి.. అనర్హులకు ఆసరా? :

షెడ్యూల్డ్ ప్రాంతంలో గిరిజనేతరులు ప్రభుత్వ భూములను ఆక్రమించి స్థిరాస్తులను కూడబెట్టుకోవడం రాజ్యాంగ విరుద్ధం. అయినప్పటికీ ఇరువురు కూడా జీవనం కలిసే కొనసాగిస్తున్నారు. కానీ గిరిజనేతరులు వారి హక్కులను పూర్తిస్థాయిలో అనుభవిస్తూనే గిరిజన ఫలాలను లబ్ధి పొందాలని దురాశతో చట్టాన్ని అతిక్రమిస్తున్నారని కొందరి గిరిజన నాయకుల ఆవేదన. గిరిజనులు ఎప్పుడు ఇతరుల హక్కులను కాలరాసేందుకు ప్రయత్నించ లేదనేది వారి వాదన. అలాంటిది అమాయకులైన గిరిజనుల హక్కులను హరించాలనే నెపంతో కొందరు రాజకీయ, ఆర్థిక అండతో అధికారాన్ని ప్రదర్శిస్తూ అనర్హులైన వారికి ఆసరాగా ఉంటూ అర్హులను తొలగించేందుకు కుట్రలు చేయడం సరికాదని గిరిజన నాయకుల వాదిస్తున్నారు.

== మాకు కావాలి.. మాకే కావాలంటూ కీచులాట :                                ఇది కూడా చదవండి:   పంచాయితీ ట్రాక్టర్‌ను అమ్మకానికి పెట్టిన సర్పంచ్

వాడగూడెం (జి) రెవిన్యూ గ్రామంలోని సర్వే నంబర్ 44పి ప్రభుత్వ స్థలంలో గుడిసెలు వేసిన వారిలో వారే కీచులాడుకుంటున్నారు. దౌర్జన్యంగా ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించిందే కాకుండా మాకు కావాలి..లేదు..మాకే కావాలి అంటూ వాదన.. ప్రతి వాదనకు దిగుతున్నారు. హంగు, ఆర్భాటం వారికే ఉందంటూ కొందరు, సకల సౌకర్యాలు వారికే ఉన్నాయంటూ మరికొందరు పలుకుతున్నారు. ఇదంతటికీ సంబంధిత అధికారుల నిర్లక్ష్యం కారణంగానే అర్హత లేని వారందరూ గుమికూడి భూమిని ఆక్రమించి వారిలో వారే గొడవలు పెట్టుకుంటూ అది కాస్త ఉధృత రూపం దాల్చిందని మండల వ్యాప్తంగా చర్చించుకుంటున్నారు.

== గ్రామపంచాయతీ అధికారికి వాటా ఉందా?

ప్రభుత్వ స్థలంలో గ్రామపంచాయతీ అధికారికి రెండు వాటాలు ఉన్నాయంటూ ఆరోపణలు వచ్చాయి. ఆరోపణలు విషయమై గ్రామ పంచాయతీ కార్యదర్శి ని వివరణ కోరగా ఆ స్థలంలో వేసిన గుడిసెలకు తనకు ఎటువంటి సంబంధం లేదంటున్నాడు. కావాలనే కొందరు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, ఇష్టానుసారంగా ఎవరైనా ఆరోపిస్తే వారిపై చట్ట చట్టపరమైన చర్యలు తీసుకుంటానని చరవాణిలో తెలిపాడు.

== ఆక్రమణదారులపై చర్యలు తప్పవు: తహశీల్దార్ అంటి నాగరాజు

ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించినది ఎంతటి వారైనా చట్టం తన పని తాను చేసుకుపోతుందని తెలిపారు. ఆ స్థలాన్ని ఆక్రమించిన 18 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. త్వరలోనే వారికి శిక్షపడేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఆ స్థలాన్ని ఆదివాసి కమ్యూనిటీ హాల్ కు కేటాయించినట్లు, జిల్లా కలెక్టర్ కు నివేదిక పంపినట్లు విజయం దినపత్రికకు తెలిపారు.

ఇది కూడా చదవండి: మోదీజీ చర్చకు సిద్దమా..? : సీఎం కేసీఆర్