***కేసీఅర్ పుట్టినరోజు సందర్భంగా పట్టాల పంపిణి చేసిన మంత్రి పువ్వాడ
మేయర్ నేరజ తో కలిసి 353 మందికి పట్టాలు పంపిణి.
***కేసీఅర్ పుట్టినరోజు సందర్భంగా పట్టాల పంపిణి చేసిన మంత్రి పువ్వాడ
***మేయర్ నేరజ తో కలిసి 353 మందికి పట్టాలు పంపిణి.
***(ఖమ్మంవిజయం న్యూస్):-
ఏళ్ల నాటి సుదీర్ఘ పేదల కల నేడు తీరింది. 45 ఏళ్లగా గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్న పేదలు నేడు గుండెల మీద చెయ్యి వేసుకుని నిద్రపోవచ్చు..ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 27వ డివిజన్లో 353 మంది నివాసకులకు శాశ్వత ఇళ్ళ పట్టాలను మేయర్ పునుకోల్లు నీరజ గారితో కలిసి పంపిణి చేశారు.
also read :-***దేశం కోసం గర్జిస్తున్న రాజనీతిజ్ఞుడు కేసిఆర్
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పేదల సుదీర్ఘ కాల నేడు నెరవేరుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందన్నారు.ఇక్కడ నివాసం ఉంటున్నా వారందరికీ ముఖ్యమంత్రి కేసీఅర్ ఇచ్చిన హామీ మేరకు నేడు నా చేతుల మీదగా పట్టాలు ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు.ముఖ్యమంత్రి కేసీఅర్ ఇక్కడ పర్యటించిన సమయంలో వారు ఇచ్చిన హామీ మేరకు నేడు 353 మందికి పట్టాలు ఇవ్వగలుగుతున్నామని అన్నారు.కేసిఆర్ పుట్టినరోజు కంటే మంచి రోజూ ఉండదని భావించి నేడు ఇస్తున్నామన్నారు.
also read :-త్రిసభ్య కమిటీ భేటీ.. ఐదు అంశాలపై కుదరని ఏకాభిప్రాయం
ఆయా స్థలంలో G+1 ప్రాతిపదికన ఇళ్లు నిర్మించి ఇస్తామని నాడు అంటే, వొద్దని మా స్థలం మాకే కావాలని నాడు మీరు అన్నారన్న విషయం గుర్తు చేశారు.అదే విషయం ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వారిని ఒప్పించి మీ కోరిక మేరకే, మీరు నిర్మించుకున్న ఇంటి స్థలాన్ని మీకే నేడు ఇస్తున్నామన్నారు. అభివృద్ది పట్ల మకున్న చిత్తశుద్ది అది అని వివరించారు.ఇదే అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావించి అందుకు ప్రత్యేకంగా జీఓ ను సైతం తెచ్చామన్నరు. ఒకే సారి 353 మందికి ఇళ్ళ పట్టాలు ఇవ్వడం తెలంగాణ ప్రభుత్వం ద్వారానే సాధ్యమైందన్నారు.
ఒకప్పుడు త్రాగునీటి కోసం కిలోమీటర్ దూరం వెళ్లి త్రాగునీరు తెచ్చుకునే పరిస్థితి ఉండేదన్నారు.ఇక్కడ పర్యటించి మీ సమస్యలు అడిగి తెలుసుకుని, మీ అభ్యర్థన మేరకు ఇక్కడే నివాసం ఉంటున్న ప్రతిఒక్కరి ఇంటింటికి మిషన్ భగీరథ ద్వారా త్రాగునీరు ఇవ్వడం జరిగిందన్నారు.పేదలను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. త్వరలోనే శ్రీనివాస నగర్ కాలవకట్ట, ఖనాపురం లోని రాజీవ్ గుట్టలోని నిర్వాసితులకు పట్టాలు సిద్దం చేస్తున్నాం.
also read :-గుండాల మండలంలో పోడు రైతు ఆత్మహత్య
దీనితో పాటు జీఓ. నెం. 58, 59 క్రింద హక్కు పత్రం, అదే అడ్రస్ తో ఆధార్ కార్డు కూడా ఇప్పిస్తామన్నారు.అత్యంత విలువైన భూమిని మీకు తెరాస ప్రభుత్వం ఇవ్వడం జరిగిందని, మాస్టర్ ప్లాన్లో రోడ్డు వెడల్పులో పేదల ఇళ్లు పోతాయని ఇక్కడ ఓర్వలేని కొంత మంది స్థలాల విషయంలో దుష్ప్రచారం చేస్తున్నారని, ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు.
తాజాగా మాస్టర్ ప్లాన్ ను మార్పు చేశామని, పేదల ఇళ్లు పోయే పరిస్థితి లేదని, మీరు నిర్భయంగా ఉండవచ్చని హామీ ఇచ్చారు.ముఖ్యమంత్ర కేసిఆర్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాట చేసిన అన్నదానంను ప్రారంభించారు.కార్పొరేటర్ కమర్తపు మురళి,
నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, RJC కృష్ణ, చిన కొండయ్య, వడ్డెలి లెనిన్, మండదపు రామక్రిష్ణ, ధనాల శ్రీకాంత్, నీలం కృష్ణ, తహశీల్దార్ శైలజ తదితరులు ఉన్నారు.