Telugu News

ఈనెల 28 నుంచి రైతుబంధు పంపిణీ.

** దళిత సమాజం ఆత్మగౌరవంతో తలెత్తుకునేలా చేయడమే ’దళితబంధు పథకం‘లక్ష్యం

0

ఈనెల 28 నుంచి రైతుబంధు పంపిణీ
** దళిత సమాజం ఆత్మగౌరవంతో తలెత్తుకునేలా చేయడమే ’దళితబంధు పథకం‘లక్ష్యం
** త్వరలోనే నిధులు విడుదల చేస్తాం
** ఒమిక్రాన్ వైరస్ రాష్ట్రంలో అదుపులోనే ఉంది
** కలెక్టర్లతో సమీక్ష సమావేశంలో సీఎం కేసీఆర్
(హైదరాబాద్ –విజయంన్యూస్)
హైదరాబాద్‌: పెట్టుబడి సాయంగా ఎకరాకు సీజన్‌కు రూ.5 వేల చొప్పున అందించే రైతుబంధు పథకం నిధులను ఈనెల 28 నుంచి పంపిణీ చేస్తామని సీఎం కేసీఆర్‌ వెల్లడించారు. గతంలో మాదిరి ఎకరం నుంచి మొదలుకొని అందరి రైతుల ఖాతాల్లో రైతబంధు జమ అవుతుందని తెలిపారు. ఈనెల 28 నుంచి 10 రోజుల్లో రైతుబంధు పంపిణీ పూర్తవుతుందని సీఎం కేసీఆర్ చెప్పారు. హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో కలెక్టర్లతో జరిగిన సమీక్ష సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. తరతరాలుగా వివక్షకు గురవుతున్న దళిత సమాజం ఆత్మగౌరవంతో తలెత్తుకునేలా ఆర్థికంగా అభివృద్ది చేయడమే ‘దళిత బంధు పథకం ‘ లక్ష్యమని ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్ రావు పునరుద్ఘాటించారు.

దళిత బంధు పథకం ద్వారా నూరుశాతం సబ్సిడీ కింద అందించే పది లక్షల రూపాయలు, దళిత కుటుంబాలను ఆర్థికంగా పరిపుష్టం చేయడమే కాకుండా.. సామాజిక పెట్టుబడి గా మారి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మరింత వేగవంతం గా పటిష్టం చేయడం లో దోహద పడుతుందని సీఎం కేసిఆర్ స్పష్టం చేశారు.

దళిత బంధును ఇప్పటికే ప్రకటించిన పద్దతిలో ప్రభుత్వం అమలు చేస్తుందని,. అందుకు సంబంధించిన నిధులను త్వరలోనే విడుదల చేస్తామని సీఎం స్పష్టం చేశారు.

హుజూరాబాద్ నియోజకవర్గం, ఇప్పటికే ప్రకటించిన నాలుగు మండలాల పరిధిలో దళిత బంధు ను ముందుగా ప్రకటించిన విధంగా అమలు చేస్తామన్నారు.

తాము ఎప్పుడు మోసగించబడుతామనే దుఃఖం దళిత వాడల్లో వుందని, వారి ఆర్తిని అర్థం చేసుకొని పని చేయాల్సిన అవసరం వుందని, ” మీకు ఆకాశమే హద్దు. మీరు ఇప్పటి వరకు చేసిన ఏ పని లో లేని తృప్తి దళిత బంధు పథకం అమలు లో పాల్గొనడంలో దొరుకుతుందని కలెక్టర్లకు సీఎం కెసీఆర్ స్పష్టం చేశారు.

దళిత కుటుంబాల ఆర్థిక స్థితి ని మెరుగుపరిచేందుకు వున్న అన్ని అవకాశాలను వ్యాపార ఉపాధి మార్గాలను శోధించాలని, అందుకు దళిత మేధావులు, రిటైర్డ్ ఉద్యోగులు, తదితర దళిత సామాజిక అభివృద్ది కాముకుల సలహాలు సూచనలు తీసుకోవాలని సీఎం కేసిఆర్ కలెక్టర్లకు సూచించారు.

ఒమిక్రాన్; రాష్ట్రం లో కరోనా పరిస్థితి, వాక్సినేషన్ పురోగతి పై కలెక్టర్లు, వైద్యారోగ్య అధికారులనుంచి వివరాలు సేకరిస్తున్న సీఎం కెసీఆర్. ఒమిక్రాన్’ వ్యాప్తి వార్తల నేపథ్యంలో చేపట్టవలసిన ముందస్తు చర్యలపై సీఎం సమీక్ష. పరిస్థితి అదుపులోనే వుందని వివరించిన అధికారులు.

also read :- మద్యం దుకాణం లో బీరు తాగి వ్యక్తికి అస్వస్థత.