పోలీస్ అమరుల కుటుంబాలకు పట్టాలు పంపిణీ
== బాధితులకు అందించిన మంత్రులు మైమూద్ అలీ, పువ్వాడ.
== చిరకాల స్వప్నం నెరవేర్చిన మంత్రి పువ్వాడ.*
== కేసీఅర్, పువ్వాడ చిత్ర పటానికి క్షీరభి షేకం చేసి కృతజ్ఞతలు తెలిపిన అమరుల కుటుంబ సభ్యులు.*
(ఖమ్మం ప్రతినిధి -విజయం న్యూస్)
ఖమ్మం జిల్లాలో విధి నిర్వహణలో భాగంగా వివిధ ఎన్కౌంటర్లు, బాంబ్ బ్లాస్టింగ్ దుర్ఘటనలో అసువులు బాసిన 20 మంది పోలీస్ కుటుంబాలకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారి ప్రత్యేక కృషి మేరకు మంజూరైన ఇళ్ళ పట్టాలను ఆయా 20 మంది కుటుంబ సభ్యులకు రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చేతుల మీదగా పట్టాలను పంపిణీ చేశారు.
ఇది కూడా చదవండి:- రాష్ట్రంలో సుపరిపాలన అందించాలనేదే ప్రభుత్వ లక్ష్యం: హోంమంత్రి
గత 19ఏళ్ళుగా సుదీర్ఘ పోరాటం చేస్తున్న పోలీస్ అమరుల కుటుంబాల గోస ను అనేక మార్లు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు.
స్పందించి మంత్రి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆయా కుటుంబాలకు పట్టాల ద్వారా శాశ్వత పరిష్కారం చూపించారు.
తమ చిరకాల స్వప్నం నెరవేర్చిన ముఖ్యమంత్రి కేసీఅర్, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చిత్రపటానికి అమరుల కుటుంబ సభ్యులు క్షీరాభిషేకం నిర్వహించి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఇది కూడా చదవండి:- ఖమ్మంలో హోం మంత్రి మైమూద్ అలీ కి ఘన స్వాగతం
పంపిణీ చేసిన వారిలో ఎమ్మెల్సీ తాతా మధు గారు, ఎంపి వద్దిరాజు రవిచంద్ర గారు, మేయర్ పునుకొల్లు నీరజ గారు, సుడా చైర్మన్ విజయ్ గారు, జిల్లా కలెక్టర్ VP గౌతమ్ గారు, పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్.వారియర్ గారు, అదనపు DCP సుభాష్ చంద్ర బోస్ గారు తదితరులు ఉన్నారు.