Telugu News

నాయకన్ గూడెంలో యాదవులకు గొర్రెలు పంపిణి

పెండ్ర అంజయ్య, కూసుమంచి-విజయంన్యూస్

0

నాయకన్ గూడెంలో యాదవులకు గొర్రెలు పంపిణి

(పెండ్ర అంజయ్య, కూసుమంచి-విజయంన్యూస్)

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కురుమ యాదవులకు 75 శాతం సబ్సిడీతో అందిస్తున్న గొర్రెలు శుక్రవారం కూసుమంచి మండల పరిధిలోని నాయకన్ గూడెం గ్రామానికి 06 యూనిట్లు మంజూరు కాగా నాయకన్ గూడెం గ్రామంలోని యాదవులకు గ్రామ సర్పంచ్ కాసాని సైదులు, వైస్ ఎంపీపీ కంచర్ల పద్మ , మండల పశువైద్యులు డాక్టర్ ఆర్. నీలకాంత్ పంపిణి చేశారు. 6 మందికి 6 యూనిట్లు గొర్రెలను పంపిణి చేశారు.

also read :-శనిగకుంటలో ఘోర అగ్నిప్రమాదం

ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు వీరారెడ్డి, ఉప సర్పంచ్ కిన్నెర శ్రీకాంత్, తెరాస పార్టీ నాయకులు జహంగీర్ షరీఫ్, ప్రమోటర్ కంచాని గురవయ్య లబ్ధిదారులతో పాటు గ్రామ ప్రజలు మరియు పశువైద్య సిబ్బంది ఈశ్వరమాదారం ఎల్ఎస్ఏ బి రవి కృష్ణ , గట్టుసింగారం వోఎస్ సెచ్ మాధవ్ పాల్గొన్నారు.