Telugu News

పట్టణంలో ప్రభుత్వ స్థలాల అక్రమణలపై సమగ్ర నివేదిక కావాలి==

మధిరలో పర్యటించిన జిల్లాకలెక్టర్ ==

0

పట్టణంలో ప్రభుత్వ స్థలాల అక్రమణలపై సమగ్ర నివేదిక కావాలి==

మధిరలో పర్యటించిన జిల్లాకలెక్టర్ ==

పలు ప్రాంతాలను పరిశీలించి అధికారులకు సూచనలు, సలహాలు

(మధిర,ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

పట్టణంలో ప్రధాన కార్యాలయాల ఆవరణలో ఉన్న ప్రభుత్వ స్థలాలుఆక్రమణలపై సమగ్ర నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అధికారులనుఆదేశించారు. శుక్రవారం మధిర మండలంలో పర్యటించి పట్టణంలో ఏర్పాటు చేయనున్న సమీకృతమార్కెట్ సముదాయ నిర్మాణానికి సంబంధించి స్థలాలను కలెక్టర్ పరిశీలించారు.పట్టణంలోని బంజారా కాలనీ వాటర్ ట్యాంక్ ప్రాంతంలో ఉన్న స్థలంతో పాటు, ప్రస్తుతం రైతు బజార్కొనసాగుతున్న ప్రాంతాన్ని, వ్యవసాయమార్కెట్ కమిటీ ప్రాంగణంలో స్థలాలను పరిశీలించి వీటికి సంబంధించి వేరు వేరునివేదికలను తయారుచేసి అందించాలని పంచాయతీ రాజ్ ఇ. ఇని ఆదేశించారు.

also read :-ఖమ్మం జిల్లాలో ‘జ్వర’ సర్వే షూరు

రైతు బజార్ప్రాంతంలో కొత్తగా ఏర్పాటు చేసిన బడ్డీ కొట్లను గమనించిన కలెక్టర్ తక్షణమే వీటినితొలగించాలని మున్సిపల్ కమీషనర్‌ను ఆదేశించారు. రహదారులు ఆక్రమణ లేకుండా చూడాలని, మండల పరిషత్ కార్యాలయంకుఆనుకొని ఉన్న ప్రభుత్వ స్థలం విషయమై నెలకొన్న ఫిర్యాదుల మేరకు వీటిపై పూర్తిస్థాయిసమగ్ర నివేదికను వెంటనే సమర్పించాలని ఆదేశించారు. అంతకుముందు కృష్ణాపురం గ్రామసమీపంలో నూతనంగా కొనసాగుతున్న వెంచర్ పరిశీలించిన కలెక్టర్ నిబంధనలకు అనుగుణంగాప్రభుత్వానికి స్థలం కేటాయింపులు చేశారా లేదా అన్న విషయమై వివరాలు వెల్లడించాలనితాసిల్దార్‌కు సూచించారు.పట్టణంలోని మురికి నీటి కాలువలుచెరువులోకి వదులుతున్నారని దీనివల్ల నష్టం జరుగుతుందని దీని నిలువరించాలని కోరుతూస్విమ్మర్స్ క్లబ్ అధ్యక్షులు జంగా నరసింహ రెడ్డి కలెక్టరు వినతి పత్రం అందజేశారు.

also read;-తెలంగాణలో ఐపీఎస్ లకు పదోన్నతులు

దీనిపై స్పందించిన ఆయన తక్షణమే ఈ పనులను నిలిపివేయాలని మున్సిపల్ కమిషనర్‌నుఆదేశించారు మధిర వ్యవసాయ మార్కెట్ యార్డులో మిర్చి రైతులకు సంబంధించి జెండా పాటనిర్వహించకపోవడం పై స్థానిక అధికారులను అడిగిన ఆయన జెండా పాటలు కొనసాగించాలనిరైతుల వద్ద ఉన్న మిర్చి కొనుగోలు చేసే చర్యలు చేపట్టాలని చైర్మన్ చిత్తారినాగేశ్వరావుకు సూచించారు. మధిర పట్టణంలో ప్రభుత్వ నిధులతో నిర్మాణం చేపట్టినిరుపయోగంగా ఉన్న భవనాలను గుర్తించి వినియోగంలోకి తీసుకువచ్చే విధంగా చర్యలుచేపట్టాలని ఎంపీడీవోను కలెక్టర్ ఆదేశించారు. పట్టణంలో పారిశుధ్య పనులను ముమ్మరంచేయాలని, నిర్లక్ష్యంవహించే సిబ్బందిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ఈకార్యక్రమంలో తహసీల్దార్  రాజేష్, ఎంపీడీవో విజయభాస్కర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ అంబటిరమాదేవి, టౌన్ప్లానింగ్ అధికారి ఇటికాల భాస్కర్ ఎం. ఈ.ఓ వై ప్రభాకర్, ప్రభుత్వ వైద్యాధికారి కనక పూడిఅనిల్ కుమార్, పంచాయతీరాజ్, మున్సిపల్, రెవిన్యూ సిబ్బంది తదితరులుపాల్గొన్నారు.