Telugu News

జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ప్రెస్ మీట్ పాయీ0ట్స్

ఖమ్మం నగరంలోని జిల్లా

0

జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ప్రెస్ మీట్ పాయీ0ట్స్

ఖమ్మం నగరంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ గారు, నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహ్మద్ జావేద్ మాజీ వారి అధ్వర్యంలో మంగళవారం మీడియా, విలేకరుల సమావేశం నిర్వహించటం జరిగింది.అనంతరం వారు దుర్గాప్రసాద్ గారు మరియు మాజీ శాసన మండలి సభ్యులు పోట్ల నాగేశ్వేరారావు గార్లు మాట్లాడుతూ …కాంగ్రెస్ ప్రభుత్వంలో 2006 ప్రతిష్ఠత్మకంగ నిర్మించిన రాజీవ్ స్వగృహలలో డబుల్, త్రిబుల్ బెడ్రూం ఇండ్లను సామాన్యులకు,మధ్య తరగతి వారికి అందచేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది .2008 లో సామాన్యులు,మధ్య తరగతి వారు దరకాస్తులు చేసుకోవాలి అని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయగా 572 ఇండ్ల ప్లాట్లకు సామాన్యులు దరకాస్తు చేసుకున్నారు.

also read :-★ కార్పొరేట్ శక్తుల కోసమే కేంద్రబడ్జెట్

కానీ కొన్ని కారణాల చేత పనులు పూర్తి కాక రాజీవ్ స్వగృహలు మధ్యలో ఆగిపోయింది. 2012 నుంచి ప్రభుత్వాలు పట్టించుకోకపోవటమే కాకుండా ఆగిపోయిన పనులు పూర్తి చెయ్యలేదు. ఇప్పటి తెరాస ప్రభుత్వం కేవలం లాభాలు చూసుకొని వేలం ద్వారా గృహాలను ఇవ్వటం సమంజసం కాదని,అప్పటి దరకాస్తు దారులకే రాజీవ్ స్వగృహ లను కేటాయించాలని కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేశారు .2008 లో 572 ప్లాట్లకు గానూ దరకాస్తులు పెట్టుకున్న వారికే ఇప్పుడు రాజీవ్ స్వగృహ లను కేటాయించాలని,ఎవరైతే దరకస్తుదారులు ఉన్నారో వారు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో అన్నెం గోపాలరావు గారికి సంప్రదిస్తే వారి ఫోన్ నెంబర్ (9133140013 )వారికి మేము అండగా ఉండి హైకోర్టు కు వరకు వెళ్లైన మీకు స్వగృహా లను వచ్చే విధంగా చేస్తాం అని కాంగ్రెస్ పార్టీ నేతలు హామీ ఇచ్చారు . ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహ్మద్ జావేద్ గారు,స్థానిక శాసన మండలి సభ్యులు గా పోటీచేసిన రాయల నాగేశ్వరారావు గారు, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య గారు, జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు మొక్కా శేఖర్ గౌడ్ గారు,జిల్లా SC సెల్ అధ్యక్షులు బొడ్డు బొందయ్య గారు, ఖమ్మం రూరల్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు కళ్లెం వెంకటరెడ్డి గారు,కార్పొరేటర్లు దుడ్డుకూరి వెంకటేశ్వర్లు గారు,మహ్మద్ రఫీదా బేగం గారు, పల్లెబోయిన చంద్రం గారు తదితరులు పాల్గొన్నారు .