Telugu News

సంభానిని కలిసిన జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ళ 

దుర్గాప్రసాద్ ని అభినందించిన మాజీ మంత్రి సంభాని

0

సంభానిని కలిసిన జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ళ 

== దుర్గాప్రసాద్ ని అభినందించిన మాజీ మంత్రి సంభాని

(కల్లూరు/ఖమ్మం-విజయం న్యూస్)

పిసిసి సూచన మేరకు ఏఐసిసి ద్వారా జిల్లా కాంగ్రెస్ కమిటి అధ్యక్షునిగా వరుసగా రెండవసారి నియమితులైన సందర్భంగా పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ కల్లూరు మండలంలోని రామకృష్ణాపురంలో  ఉన్న మాజీమంత్రి, టిపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు సంభాని చంద్రశేఖర్ ని వారి క్యాంప్ కార్యాలయం నందు మర్యాదపూర్వకంగా కలిసి ఆశీస్సులు పొందడం జరిగింది.

 ఇది కూడా చదవండి:- డీసీసీ అధ్యక్షుడు దుర్గాప్రసాద్ ని సన్మానించినా జావిద్

ఈ కలయికలో సంభాని, పిసిసి సభ్యులు బైరెడ్డి మనోహర్ రెడ్డి, శుభాకాంక్షలు తెలుపారు. శాలువాలు కప్పి బుకేలతో ఘనంగా సన్మానించారు. మాజీమంత్రి సంభాని మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసి, రానున్న ఎన్నికల్లో గెలిచేందుకు నాయకులు, కార్యకర్తలను సన్నద్ధం చేయడానికి కృషిచేయాలని తెలిపారు.

మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పెద్దబోయిన దుర్గాప్రసాద్, స్టేట్ ఎస్సీ సెల్  కన్వీనర్ కొండూరు కిరణ్ శాలువాతో సన్మానించారు‌

ఇది కూడా చదవండి:- అధర్మంపై సత్యమే గెలిచింది: సంభాని

ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు యడవల్లి సంతోష్, జిల్లా మైనారిటి అధ్యక్షులు సయ్యద్ ముజాహిద్ హుస్సేన్, బచ్చలకురి నాగరాజు, మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కీసర శ్రీనివాసరెడ్డి, మందల బీసీ అధ్యక్షుడు గుండ్ల పుల్లారావు, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు లింగపోగు కృష్ణ, తోట జనార్ధన్, పోతురాజు నరేంద్ర, బొడ్డు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.