***జిల్లా వ్యాప్తంగా యువజన కాంగ్రెస్ దీక్షలు
***దీక్షలను ప్రారంభించిన జిల్లా పార్టీ అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద
***జిల్లా వ్యాప్తంగా యువజన కాంగ్రెస్ దీక్షలు
***దీక్షలను ప్రారంభించిన జిల్లా పార్టీ అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద
***(ఖమ్మంవిజయం న్యూస్):-
నోటిఫికేషన్ లు విడుదల చేయాలి, నిరుద్యోగ భృతి అమలు చేయాలని యువజన కాంగ్రెస్ డిమాండ్ మేరకు జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఎడ్లపల్లి సంతోష్ ఆధ్వర్యంలో బుధవారం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా నిరసన దీక్షలను చేపట్టారు. ఖమ్మం నగరంలోని ధర్నా చౌక్ లో ఖమ్మం అసెంబ్లీ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరుద్యోగ నిరసన దీక్ష నిర్వహించారు. యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ఉపాధ్యక్షులు బానోత్ కోటేష్ నాయక్, అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి కొండూరి హృదయ్ కిరణ్ ఆధ్వర్యంలో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు దీక్ష కొనసాగించారు.
also read :-===మేడారం లో హెడ్ కానిస్టేబుల్ గుండెపోటు తో మృతి..
ఈ కార్యక్రమంలో జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు యడ్లపల్లి సంతోష్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ అమరుల త్యాగాలపై ఏర్పడ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యి 7 సంవత్సరాలు గడుస్తున్నా ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయడంలేదు. కానీ తన కుటుంబంలో కొడుక్కి, కూతురికి, అల్లుడికి, సంతోష్ రావు కి పదవు ఇచ్చి యస్.సి, యస్.టి,బడుగు బలహీన వర్గాల పిల్లల కొలువుల కోసం ఎదురు చూసి, చూసి ఆర్థిక ఇబ్బందులతో మానసిక ఒత్తిడితో చనిపోతున్నారని ఆరోపించారు. ఈ ఏడు సంవత్సరాలుగా ఒక్కటంటే ఒక్క డీఎస్సీ విడుదల చేయకపోవడం చాలా దారుణమైన విషయమని అన్నారు.
also read :-కన్న పేగును కడతేర్చిన కసాయి తల్లి
అలాగే 2018 ఎన్నకల హామీ నిరుద్యోగ భృతి పథకం రూ.3016 తక్షణమే అమలు చేయాలి అని డిమాండ్ చేశారు.ఈ హామీ ఇచ్చి నేటికి 3ఏళ్లు దాటిందన్నారు. అంటే ఒక్కో నిరుద్యోగ యువతకు లక్ష పద్నాలుగు వేల ఆరు వందల ఎనిమిది రూపాయలు (1.14.608/- సీఎం కేసీఆర్ బాకీ పడ్డారు అని తెలిపారు. అలాగే కేసీఆర్ కారణంగా నోటిఫికేషన్స్ రావడంలేదు అని చనిపోయిన నిరుద్యోగ అమరుల కుటుంబాలకు 25 లక్షలు ఎక్సెగ్రెషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పూవ్వాళ్ళ దుర్గాప్రసాద్,నగర కాంగ్రెస్ అధ్యక్షుడు యం.డి. జావిద్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య, కిసాన్ కేత్ జిల్లా అధ్యక్షులు మెక్క శేఖర్, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రామసహయం మాదవి రెడ్డి దీక్ష శిబిరాన్ని సందర్శించి సంఘీభావం ప్రకటించారు.
also read :-ఖమ్మంరూరల్ మారేమ్మగుడిలో టీఆర్ఎస్ యువజన విభాగం పూజలు
అలాగే ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేటర్లు పల్లె బోయిన భారతి చంద్రం, లకావత్ సైదులు, మల్లిదు వెంకటేశ్వర్లు, ఖమ్మం రూరల్ మండలం అధ్యక్షులు కళ్లెం వెంకట్ రెడ్డి, కురసం సీతారాముల, మద్ది వీరారెడ్డి, పెండ్ర అంజయ్య, భూక్యా బాలాజీ, వాంకుడోత్ దీపక్ నాయక్, వడ్డే నారాయణ రావు, నాగండ్ల శ్రీనివాస్, బాణాల లక్ష్మణ్, వైరా మండల కాంగ్రెస్ కన్వీనర్ శీలం వెంకట్ నర్సిరెడ్డి, ఎంపిటిసి కృష్ణారావు, కారేపల్లి మండల సభ్యత్వ నమోదు కన్వీనర్ షేక్ అఫ్సర్ హాజరై సంఘిబావం ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శులు బెల్లంకొండ శరత్ ,బానోత్ సైదేశ్వరావు, బిచ్చాల అన్వేష్, జెర్రిపోతుల అంజనీ, పాలేరు అసెంబ్లీ నాయకులు బొల్లం మహేష్ యాదవ్, వైరా అసెంబ్లీ అధ్యక్షులు పమ్మి అశోక్, బేతంపూడి మదు, యడవల్లి నాగరాజు, కుక్కల నరేష్,భుక్యా కిరణ్ కుమార్,బెల్లి శ్రీశైలం,రాజా రెడ్డి,రావులపాటి నిఖిల్, రమణ, భూక్యా బిక్షం, తదితరులు పాల్గొన్నారు.
ఖమ్మం రూరల్ మండలంలో నిరుద్యోగ నిరసన దీక్ష భగ్నం చేసిన పోలీసులు
పాలేరు నియోజకవర్గ యువజన కాంగ్రెస్ నాయకులు బొల్లం మహేష్ యాదవ్, బానోత్ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో ఖమ్మం రూరల్ మండలం పెద్ద తండ వద్ద చేపట్టిన నిరుద్యోగ నిరసన దీక్ష ను పోలీసులు భగ్నం చేశారు. ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ నాయకులను పోలిసులు ఈడ్చుకుంటూ పోయి అత్యుత్సాహం ప్రదర్శించారని నాయకులు ఆరోపించారు. ఈ సందర్భంగా పాలేరు యువజన కాంగ్రెస్ నాయకులు బొల్లం మహేష్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మా హక్కుల కోసం నిరసన తెలిపే స్వతంత్రం, హక్కు మాకు లేదా అని పోలిస్ వారిని ప్రశ్నించారు,
అలాగే ఈ కేసీఆర్ గద్దెను ఎక్కి నిరుద్యోగ యువత మరణానికి కారణం అవుతున్నాడు, నోటిఫికేషన్ కోసం లేక నిరుద్యోగ యువకులు ఆర్థిక ఇబ్బందులు తాళలేక మనోధైర్యం కోల్పోయిన ఉద్యోగ వయసు దాటి బలవన్మరణం చెందుతునారు. అలాగే నిరుద్యోగ భృతి పథకం హామీ ఇచ్చి 38 నెలలు అవుతోంది నేటికి ఈ పధకం ఊసు లేదని ఆరోపించారు. నిరుద్యోగులకు చేస్తున్న మోసాలకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 17 తేదీని నిరుద్యోగ దినోత్సవంగా జరుపుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెర్రిపోతంల అంజయ్య,బొల్లం మహేష్ యాదవ్,బానోత్ కిరణ్ కుమార్, బేతంపూడి మదు,కొటి రమణ,రాజా రెడ్డి, వెంకట్ తదితరులు ఉన్నారు. అరెస్ట్ అయిన నాయకులకు మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు రామసహయం మాదవి రెడ్డి, సర్పంచ్ శివా రెడ్డి,పెండ్ర అంజయ్య పోలిస్ స్టేషన్ కు వెళ్లి మద్దతు తెలిపారు.