****జిల్లా, మండల స్థాయి సంస్థాగత నిర్మాణం : షర్మిళ
****(హైదరాబాద్-విజయంన్యూస్):-
తెలంగాణ పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా నేడు రాష్ట్రంలోని ఉమ్మడి పది జిల్లాల మండల స్థాయి, జిల్లా స్థాయి కో ఆర్డినేటర్లతో పార్టీ రాష్ట్ర కార్యాలయం లోటస్‌పాండ్ లో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా పలు కీలక సూచనలు, సలహాలు అందించారు.
also read :-రాజేంద్రనగర్ మానస హిల్స్ పై సమ్మక్క సారలమ్మ జాతర అంగరంగ వైభవంగా జరిగింది.
వైయస్ఆర్ సంక్షేమ పాలన తెలంగాణలో తిరిగి తీసుకురావడం కోసమే YSR తెలంగాణ పార్టీని స్థాపించాను. ఇదే YSR తెలంగాణ పార్టీ లక్ష్యం. కానీ ఇది నేను ఒక్కదాన్ని చేసే పని కాదు.. ఒక్క దాన్ని అనుకుంటే అయ్యే పని కాదు.. నాకు బలం కావాలి, బలగం కావాలి. మనందరం కలిసి చేయి చేయి కలిపి చిత్తశుద్ధితో, మంచి మనసుతో పని చేస్తే వైయస్ రాజశేఖర్‌రెడ్డి సుపరిపాలన రాష్ట్రంలో మళ్లీ తీసుకురావడం సాధ్యమవుతుందని నా నమ్మకం. మీరందరూ మా కుటుంబానికి ఎప్పటి నుంచో తెలిసిన వాళ్లు, మరి కొందరు గత సంవత్సర కాలంగా మాతో కలిసి ప్రయాణం చేసిన వారు. మీ అందరికీ నేను చెప్పేది ఒక్కటే. పార్టీ ఇప్పుడిప్పుడే ఎదుగుతోంది. ఇంకా ఎదగాలి. మన పార్టీ గ్రామగ్రామాన విస్తరించాలి అప్పుడే మనం అధికారంలోకి రాగలుగుతాం.
గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసుకోవాలి. వైయస్ఆర్ అభిమానులు, వైయస్ఆర్ పథకాల వల్ల లబ్ధి పొందిన ప్రతి ఒక్‌రి ఇంటి మీద YSR తెలంగాణ పార్టీ జెండా ఎగరాలి. ప్రతి పోలింగ్‌బూత్‌కు చిత్తశుద్ధితో పనిచేసే పదిహేను మంది కార్యకర్తలను తయారు చేసుకున్నప్పుడే మనం ఎన్నికలకు సిద్ధం అయినట్టు. ఇదే మన ముందున్న లక్ష్యం. వైయస్ఆర్ సంక్షేమ పాలన సాధించడంలో మీ అందరి సహాయసహకారాలు ఉంటాయని ఆశిస్తున్నాను.
also read :-బంగారు భారతదేశాన్ని కూడా తయారు చేసుకుందాం సీఎం కేసీఆర్
ఈ కార్యక్రమంలో పార్టీ జీహెచ్ఎంసీ కో ఆర్డినేటర్ శ్రీ వాడుక రాజగోపాల్ , పార్టీ నాయకులు గట్టు రాంచందర్ రావు , పిట్ట రాంరెడ్డి ఉమ్మడి ఖమ్మం జిల్లా కో ఆర్డినేటర్ శ్రీమతి గడిపల్లి కవిత , ఖమ్మం జిల్లా సోషల్ మీడియా నాయకులు నాగరాజు రెడ్డి నేలకొండపల్లి అధ్యక్షుడు పసుపులేటి సైదులు తిరుమలయపాలెం మండల అధ్యక్షుడు వాలూరి సత్యనారాయణ వైరా నియోజకవర్గ నాయకులు దరంసోత్ రాములు నాయక్. వైరా మండల అధ్యక్షుడు. లక్కిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైరా నియోజకవర్గ స్థాయి నాయకులు. మధిర నియోజకవర్గ నాయకులు,పినపాక నియోజకవర్గ నాయకులు అలెం కోటిసత్తుపల్లి, అశ్వారావుపేట, ఇల్లందు,కొత్తగూడెం భద్రాచలం,ఖమ్మం పట్టణం మరియుఉమ్మడి ఖమ్మం జిల్లా మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు