Telugu News

స్మార్ట్ కిడ్జ్ పాఠశాల లో ఘనంగా దీపావళి వేడుకలు.

స్థానిక ఖమ్మం పట్టణంలోని స్మార్ట్ కిడ్జ్ పాఠశాలలో విద్యార్థులు సంప్రదాయబద్ధమైన వస్త్రధారణతో దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

0

స్మార్ట్ కిడ్జ్ పాఠశాల లో ఘనంగా దీపావళి వేడుకలు.

 

స్థానిక ఖమ్మం పట్టణంలోని స్మార్ట్ కిడ్జ్ పాఠశాలలో విద్యార్థులు సంప్రదాయబద్ధమైన వస్త్రధారణతో దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
పాఠశాల ఆవరణలో విద్యార్థులు ఆనందోత్సాహాల మధ్య చిచ్చుబుడ్లు కాకర వత్తులు కాల్చి ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ చింత నిప్పు కృష్ణచైతన్య మాట్లాడుతూ చెడుపై మంచి సాధించిన విజయంగా దీపావళి పండుగ జరుపుకుంటున్నామని
పండగ సంస్కృతిని విద్యార్థులకు తెలిసి వచ్చేలా సంస్కృతి సంప్రదాయాలు నేర్పిస్తూ ఈరోజు పాఠశాల ఆవరణంలో విద్యార్థులు ఆనందోత్సాహాల మధ్య దీపావళి వేడుకలు జాగ్రత్తలు పాటిస్తూ ఘనంగా నిర్వహించామని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ చింత నిప్పు సుకన్య, పాఠశాల ఉపాధ్యాయులు మరియు సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.