Telugu News

డివిజన్లలో సమస్యలు లేకుండా చూడాలి

== ప్రజలు ఇబ్బందులు పడితే ఊరుకునేదే లేదు == అధికారులకు, ప్రజాప్రతినిధులకు సూచించిన ఖమ్మం నగర మేయర్ == పలు డివిజన్లలో క్షేత్రస్థాయిలో పర్యటించిన మేయర్ నీరజ

0

డివిజన్లలో సమస్యలు లేకుండా చూడాలి
== ప్రజలు ఇబ్బందులు పడితే ఊరుకునేదే లేదు
== అధికారులకు, ప్రజాప్రతినిధులకు సూచించిన ఖమ్మం నగర మేయర్
== పలు డివిజన్లలో క్షేత్రస్థాయిలో పర్యటించిన మేయర్ నీరజ
(ఖమ్మం కార్పోరేషన్-విజయంన్యూస్)
ఖమ్మం నగరంలోని ఆయా డివిజన్లలో ఎక్కడ సమస్యలు లేకుండా చూడాల్సిన బాధ్యత సంబంధిత అధికారులది, కార్పోరేటర్లదేనని, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చొరవ తీసుకుని పనులు చేయించాలని ఖమ్మం నగర మేయర్ పూనకొల్లు నీరజ ఆదేశించారు. మంగళవారం ఖమ్మం కార్పోరేషన్ పరిధిలోగల 56, 4 డివిజన్లలో నగర మేయర్ పునుకొల్లు.నీరజ పర్యటించారు. మంచి నీటి సరఫరా లికేజ, సమస్యలపై పారిశుధ్య సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 56 వ డివిజన్ ద్వారాక నగర్ లో పర్యటించారు. అక్కడ స్థానికులతో మాట్లాడారు. కాగా లీకేజీ సమస్యల ఎక్కువగా వున్నందున వెంటనే మరమత్తులు చేయాలని,కొన్ని ప్రాంతంలో పాత లైన్ ల నుండి నీటి సరఫరా స్థంభించి పోవటం వలన ఇళ్లకు నీటి సరఫరా నిలిచి పోయాయని పజలకు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు దీంతో ఆమె అధికారులకు ఆదేశించారు. ఈ డివిజన్లో కొత్త పైపు లైన్ వేయాలని, స్థానిక కార్పొరేటర్ ను కోరారు.

ALSO READ :-టీఆర్ఎస్ ఆధ్వర్యంలో కలెక్టర్‌ని కలిసిన బాధితులు

ALSO READ :-నిరు పేదలకు వరం సీఎం రిలీఫ్ ఫండ్…!

అనంతరం 4 వ డివిజన్ లోని విద్య నగర్ లో మురుగు నీరు బయటకు వెళ్లేందుకు దారి లేక మురుగు నీరు నిలిచిపోతున్నాయని, పలు సమస్యలను స్థానికులు మేయర్ దృష్టికి తీసుకువచ్చారు. తక్షణ మే మురుగునీరు ముంపు ప్రాంతాలకు కచ్చ కాలువు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జరిచేశారు. మిషన్ భగీరథ ద్వారా వచ్చే మంచినీటి సరఫరా ను కలెక్షన్లను త్వరలోనే ఇస్తామని అధికారులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సహాయ కమిషనర్ మల్లీశ్వరి, 56 వ డివిజన్ కార్పొరేటర్. పైడిపల్లి. రోహిణి సత్యనారాయణ,4 వ డివిజన్ కార్పొరేటర్ దండా జ్యోతి రెడ్డి, ఈఈ కృష్ణాలాల్, ఈఈ.రంజిత్, డిఈ రంగారావు, ఏ ఈ. కుమార్ లు, మిషన్ భగీరథ, సిబ్బంది పాల్గొన్నారు.