Telugu News

డిఎంఎస్, డిడిఎంఎస్ ల నిర్లక్ష్యమే..?

- ఆ నిర్లక్ష్యమే నిండు ప్రాణాలను బలిగొందా

0

డిఎంఎస్, డిడిఎంఎస్ ల నిర్లక్ష్యమే..?
– ఆ నిర్లక్ష్యమే నిండు ప్రాణాలను బలిగొందా
– గనుల్లో గాలికొదిలేసిన రక్షణ చర్యలు
– ఏరియాల వారిగా రక్షణ సమావేశాలు శూన్యమే
– నామమాత్రంగానే సేఫ్టీ కమిటీల పనితీరు

(మంచిర్యాల ప్రతినిధి-విజయం న్యూస్):

సింగరేణి బొగ్గు గనుల్లో రక్షణను గాలికొదిలేశారా..? కార్మికుల ప్రాణాల్ని ఏమాత్రం ఖాతరు చేయడం లేదా..? చేస్తే గీస్తే రక్షణ కమిటీలు ఎలా పని చేస్తున్నాయి..? ఎక్కడ పని చేస్తున్నాయి..? అసలు డిఎంఎస్, డిడిఎంఎస్ లు ఉన్నాయా..? వాటి పనితీరును ఎవరైనా పర్యవేక్షిస్తున్నారా..? అన్నీ నష్టాలే ప్రశ్నలే ఎస్ ఆర్ పి 3 గనిలో సంభవించిన గని ప్రమాదం అనంతరం అనేక సందేహాలు లేవనెత్తుతున్నారు. అటు కార్మికులు, ఇటు కార్మిక సంఘాల నాయకులు సింగరేణిలో కొరవడుతున్న రక్షణ అంశాలపై తీవ్రంగానే మండి పడుతున్నారు. శ్రీరాంపూర్ ప్రమాదం సైతం అధికారుల నిర్లక్ష్యం పూరితంగానే సంభవించిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సింగరేణి పై వెల్లువెత్తుతున్న విమర్శలు.. నాయకులు చెబుతున్న వైఖరి పై ‘విజయం’ ప్రత్యేక కథనం..

ఎస్ ఆర్ పి-3 గని ప్రమాదంతో మరోసారి రక్షణ అంశం సింగరేణి వ్యాప్తంగా చర్చకు వస్తోంది. సింగరేణి వ్యాప్తంగా ఉత్పత్తి.. ఉత్పాదకత కోసం అధికారులు వెంపర్లాడడం తప్పితే కార్మికుల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదన్న అభిప్రాయాలున్నాయి. యేటా ఉత్పత్తి లక్ష్యాల సాధన దిశగా అధికారులు తాపత్రయం కనిపిస్తోందని, అదే సమయంలో తమ సంక్షేమానికి ఎందుకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని కార్మికులు దుయ్యబడుతున్నారు. కార్మికుల రక్షణ కు సంబంధించి వేసిన టువంటి కమిటీలతో పాటు డిపార్ట్మెంట్లు సైతం నిర్లిప్తంగా ఉండడమే దీనికి అంతటికి కారణం అని అంటున్నారు.

– డిఎంఎస్, డిడిఎంఎస్ ల నిర్లక్ష్యమే..?

సింగరేణి వ్యాప్తంగా రక్షణ చర్యలను ఎప్పటికప్పుడు పటిష్టం చేయడానికి ప్రత్యేకంగా రెండు శాఖలు ఉన్నాయి కేంద్రం ఆధీనంలో ఉండే ఈ శాఖ డిఎంఎస్, డిడిఎంఎస్ లు. వీటిలో ఒకటి డైరెక్టర్ మైన్స్ సేఫ్టీ తాగా మరోటి డిప్యూటీ డైరెక్టర్ మైన్స్ సేఫ్టీ… ఈ రెండు శాఖల సైతం ఘోరంగా పరంగా వైఫల్యం చెందాయి విమర్శిస్తున్నారు. హైదరాబాద్ కేంద్రంగా ఉండే ఈ శాఖల అధికారులు ఎప్పటికప్పుడు సింగరేణి వ్యాప్తంగా ఉన్న ఏరియాలలో పర్యటించాలి. ఏరియాల వారీగా ఉన్న భూగర్భ గనులు ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులని పరిశీలించాలి. రక్షణ చర్యలు ఏ విధంగా ఉన్నాయి..?అన్నది అంచనా వేయాలి. అవసరమైతే అప్పటికప్పుడు కొన్ని సలహాలు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఈ రెండు శాఖలు కేవలం ఉత్సవ విగ్రహంలా హైదరాబాద్ కే పరిమితం అవుతున్నాయని.. సింగరేణి వ్యాప్తంగా ఎక్కడా, ఏనాడూ పర్యటించడం లేదన్న అభిప్రాయాలున్నాయి.

all so read :- శ్రీరాంపూర్ లో ఘోర ప్రమాదం.. నలుగురు కార్మికులు మృతి

గనుల్లో సేఫ్టీ కమిటీలు నామమాత్రమే..
డిఎంఎస్, డిడిఎంఎస్ లు ఆచరణలో విఫలం అవుతుండగా మరోవైపు గనుల వారిగా నియమించే సేఫ్టీ కమిటీలు సైతం నామమాత్రంగానే పని చేస్తుందని కార్మికులు వాపోతున్నారు. వాస్తవానికి ప్రతి గనికి రక్షణ కమిటీ అనేది ఉంటుంది. ఈ కమిటీ సభ్యులు ప్రతి నెల గనికి సంబంధించి సమావేశం నిర్వహించాలి. పని స్థానాల్లో రక్షణ చర్యలు ఏ విధంగా ఉన్నాయని చర్చించాలి. తదనుగుణంగా రక్షణ చర్యలకు ఉపక్రమించాల్సి ఉంటుంది. అయినప్పటికీ కమిటీలోని నాయకులు కేవలం ఉచిత మస్టర్ లకు మొగ్గు చూపుతున్నారు తప్పితే.. రక్షణను పట్టించుకోవడం లేదని తోటి కార్మికులు వాపోతున్నారు.

ఉన్నతాధికారులు లేకుండా విధులు ఏలా..?
శ్రీరాంపూర్ ఎస్ ఆర్ పీ-3 గని ప్రమాదానికి ఉన్నత అధికారుల నిర్లక్ష్యమే కొట్టొచ్చినట్టు కనిపిస్తుందని అంటున్నారు. వాస్తవానికి దానిలోని 31వ సిమ్ హెడ్డింగ్ ప్రాంతమిది. నిన్న మొన్నటి వరకు అక్కడ అ పనులు కూడా బంద్ చేశారు. అయినప్పటికీ బుధవారం విధులు చేపట్టేందుకు అధికారులు హుకుం జారీ చేశారు. వీరిలో ఇద్దరు ఇప్పటికే పదవీ విరమణ చేసిన కార్మికులు కాగా, మరో ఇద్దరు కొత్త కార్మికులు. ఒకవేళ విధులు కేటాయించిన వారితో పాటు ఉ ఒక అండర్ మేనేజర్ స్థాయి అధికారి లేదంటే వుమెన్ ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది వీరి సమక్షంలో రక్షణ చర్యలు తీసుకున్నాకే విధులకు ఉపక్రమించాలి అయినప్పటికీ ఈ నిబంధనలు తుంగలో తొక్కి ఉన్నతాధికారులు లేకుండానే నలుగురిని అక్కడ స్థలానికి పంపడం ఈ దారుణానికి ఒడిగట్టేలా చేసిందని అంటున్నారు. ఉన్నత అధికారుల నిర్లక్ష్యం వల్లే నలుగురు ప్రాణాలు అని కార్మిక సంఘాల నాయకులతో పాటు తోటి కార్మికులు మండి పడుతున్నారు.

all so read :- గుండెపోటుతో ఆర్మీ జవాన్ మృతి