Telugu News

అక్రమ పద్దతిలో పిల్లలను దత్తత తీసుకోవద్దు:‌మంత్రి సీతక్క

ప్రభుత్వానికి లేఖ రాస్తే  పిల్లలను దత్తత ఇస్తారు

0

అక్రమ పద్దతిలో పిల్లలను దత్తత తీసుకోవద్దు:‌మంత్రి సీతక్క

== ప్రభుత్వానికి లేఖ రాస్తే  పిల్లలను దత్తత ఇస్తారు

(హైదరాబాద్ -విజయం న్యూస్)

(రిపోర్టర్ -పెండ్ర అంజయ్య)

అక్రమ పద్దతిలో చిన్న పిల్లలను దత్తత తీసుకోవద్దని, అలా దత్తత తీసుకుంటే చట్టపరంగా శిక్షకు అర్హులవుతారని పంచాయితీ రాజ్ శాఖ మంత్రి సీతక్క సూచించారు.
పిల్లల దత్తత కోసం అక్రమ పద్ధతులు అనుసరించవద్దు మంత్రి సీతక్క పిల్లల దత్తత కోసం అక్రమ పద్ధతులు అనుసరించవద్దని పిల్లలు లేని తల్లిదండ్రులకు మంత్రి సీతక్క సూచించారు. హైదరాబాద్ లోనియూసుఫ్‌గూడలోని శిశువిహార్‌ను మంత్రి సీతక్క ఇవాళ సందర్శించారు. అక్రమ రవాణా నుంచి విముక్తి పొందిన చిన్నారులను పరామర్శించారు. చిన్నారుల యోగక్షేమాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. పిల్లల దత్తత కోసం చట్టపరమైన ప్రక్రియ అనుసరిస్తే ఇబ్బందులు ఉండవని చెప్పారు.