Telugu News

అధైర్యపడొద్దు అండగా ఉంటా- మాజీ ఎంపీ పొంగులేటి

మణుగూరు-విజయంన్యూస్

0

అధైర్యపడొద్దు అండగా ఉంటా- మాజీ ఎంపీ పొంగులేటి
(మణుగూరు-విజయంన్యూస్);-
తెరాస రాష్ట్ర నాయకులు, ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోమవారం పినపాక నియోజకవర్గం లోని అశ్వాపురం మండలం మల్లెల మడుగు గ్రామంలో జరిగిన వేల్పుల పెద్ద సోమయ్య , రాగం ఎలమందయ్య దశదిన కర్మలలో పాల్గొని వారి చిత్రపటాలకు పూలమాలవేసి నివాళ్లర్పించారు. కుటుంబ సభ్యులకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. అదే విధంగా నియోజకవర్గంలోని పలు మండలాల్లో జరిగిన వివాహ వేడుకలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. కార్యక్రమంలో పినపాక మాజీ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు, డిసిసిబి డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య, ఎంపీపీ ముత్తినేని సుజాత , జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

also read :-సర్పంచుల గౌరవ వేతనం నేరుగా ఖాతాల్లోకి :వచ్చే నెల నుండి అమలు

స్వామి వారి కల్యాణ మహోత్సవంలో పాల్గొన్న పొంగులేటి
అశ్వాపురం: అశ్వాపురం మండలంలోని నెల్లిపాక బంజరు గ్రామంలో కొలువైన స్వయంభూ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ అభినవ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మఘోత్సవం లో తెరాస రాష్ట్ర నాయకులు, ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి సోమవారం పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు ఆలయ మర్యాదలతో పొంగులేటిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పినపాక మాజీ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు, డిసిసిబి డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య , అశ్వాపురం ఎంపీపీ ముత్తినేని సుజాత, జడ్పీటీసీ సూదిరెడ్డి సులక్షణ రెడ్డి , ఆలయ కమిటీ సభ్యులు, ఎంపీటీసీలు,సర్పంచ్ లు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.