Telugu News

అన్నదాతల సమస్యలు పట్టించుకోరా?

కేంద్ర ప్రభుత్వ ఉద్దేశ్యపూరిత అలసత్వంపై టీఆర్ఎస్ లోక్ సభ పక్ష నేత నామ నాగేశ్వరరావు ఫైర్.

0

అన్నదాతల సమస్యలు పట్టించుకోరా?

కేంద్ర ప్రభుత్వ ఉద్దేశ్యపూరిత అలసత్వంపై టీఆర్ఎస్ లోక్ సభ పక్ష నేత నామ నాగేశ్వరరావు ఫైర్.

👉 నామ నేతృత్వంలో లోక్ సభలో రైతు సమస్యలపై చర్చకు పట్టుబట్టిన టిఆర్ఎస్ ఎంపీలు.

(విజయం న్యూస్) :-

👉 కేంద్ర ప్ర‌భుత్వ వైఖ‌రిని ఖండిస్తూ లోక్ సభలో ఆందోళన

👉 తెలంగాణ రైతుల వరి ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్.

👉 స్పీక‌ర్ పోడియం ఎదుట‌ … టీఆర్ఎస్ ఎంపీల నిర‌స‌న‌.. లోక్‌స‌భ వాయిదా.

👉 ధాన్యానికి కనీస మద్దతు ధర చట్టం చేయాలని … వ‌రిధాన్యం సేక‌ర‌ణ‌పై జాతీయ విధానం ప్ర‌క‌టించాల‌ని నిలదీత

👉 వరి కొనుగోళ్ల కోసం నిర్దిష్టమైన విధానాన్ని ప్రకటించాలని… ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేసిన ఎంపీలు

👉 సాగు చట్టాల రద్దుకు జరిగిన పోరాటంలో అమరులైన అన్నదాతలకు రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని నిలదీత.

👉 ఆకుప‌చ్చ కండువాలు ధ‌రించిన టీ.ఆర్.యెస్ ఎంపీలు.. వ‌రిధాన్యం సేక‌ర‌ణ‌పై జాతీయ విధానం ప్ర‌క‌టించాల‌ని డిమాండ్ చేశారు.

👉 ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యంలో వెల్‌లోకి దూసుకువెళ్లిన టీ.ఆర్.యెస్ స‌భ్యులు నినాదాల‌తో హోరెత్తించారు.

👉 దీంతో స్పీక‌ర్ ఓం బిర్లా స‌భ‌ను మ‌ధ్యాహ్నం 2 గంట‌ల వ‌ర‌కు వాయిదా వేశారు.

👉 ఇవాళ ఉద‌యం టీ.ఆర్.యెస్ పార్టీ ధాన్యం సేక‌ర‌ణ‌పై వాయిదా తీర్మానం ఇచ్చిన విష‌యం తెలిసిందే.

also read :- తిరుగుబాటు మొదలైంది… – మోడీ, కేసీఆర్ల పతనం ప్రారంభమైంది.