Telugu News

దేశానికి శ‌క్తిగా ఉండే యువ‌త ఉద్యోగ స‌మ‌స్య‌ను ప‌ట్టించుకోరా?

== వాయిదా తీర్మానం ఇస్తే చ‌ర్చకు కూడా అనుమ‌తించ‌క‌పోవ‌డం ఏంటీ? == టీఆర్ఎస్ లోక్‌స‌భ ప‌క్ష నేత నామ నాగేశ్వ‌రరావు నిరుద్యోగ స‌మ‌స్య‌పై లోక్‌స‌భ నుంచి టీఆర్ఎస్ వాకౌట్‌

0

దేశానికి శ‌క్తిగా ఉండే యువ‌త ఉద్యోగ స‌మ‌స్య‌ను ప‌ట్టించుకోరా?

== వాయిదా తీర్మానం ఇస్తే చ‌ర్చకు కూడా అనుమ‌తించ‌క‌పోవ‌డం ఏంటీ?

== టీఆర్ఎస్ లోక్‌స‌భ ప‌క్ష నేత నామ నాగేశ్వ‌రరావు

నిరుద్యోగ స‌మ‌స్య‌పై లోక్‌స‌భ నుంచి టీఆర్ఎస్ వాకౌట్‌

(న్యూఢిల్లీ – విజయం న్యూస్) :-

దేశానికి కీల‌క మాన‌వ వ‌న‌రుగా, ప్ర‌త్యేక శ‌క్తిగా ఉండే యువ‌త ఉద్యోగ స‌మ‌స్య‌ను కేంద్ర ప్రభుత్వం ప‌ట్టించుకోదా? అని టీఆర్ఎస్ లోక్‌స‌భ ప‌క్ష నేత నామ నాగేశ్వ‌రరావు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఉద్యోగాలు రాక‌పోవ‌డంతో దేశ‌వ్యాప్తంగా యువ‌త ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటున్నార‌ని… ఈ అంశంపై చ‌ర్చించాల‌ని తాము స‌భ‌లో స్పీక‌ర్ వాయిదా తీర్మానం ఇస్తే క‌నీసం చ‌ర్చ‌కు అనుమ‌తించ‌క‌పోవ‌డం దారుణం అని వ్యాఖ్యానించారు.

నిరుద్యోగ స‌మ‌స్య‌పై చ‌ర్చించ‌ని నేప‌థ్యంలో తాము లోక్‌స‌భ నుంచి గురువారం వాకౌట్ చేసిన‌ట్టు ఖ‌మ్మం ఎంపీ నామ నాగేశ్వ‌రరావు మాట్లాడారు. అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. భారతదేశంలో రోజురోజుకు నిరుద్యోగం పెరిగిపోతుందని ఆయ‌న‌ పేర్కొన్నారు. 2014లో 5.6% నిరుద్యోగం ఉంటే ప్రస్తుతం 8.1%కు పెరిగిందని గుర్తు చేశారు. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ఎ కానమీ(ఇండిపెండెంట్ ఏజెన్సీ) దేశ ఆర్థిక వ్యవస్థ, నిరుద్యోగల గురించి ఇచ్చిన నివేదిక పరిశీలిస్తే గత ఎనిమిది సంవత్సరాల్లో ఆర్థిక వ్యవస్థ ప‌త‌న‌మైంద‌ని వివ‌రించారు.

also read :-టీఆర్ఎస్ ఎంపీల ఆందోళనతో ద‌ద్ద‌రిల్లిన లోక్‌స‌భ‌

దీంతో ఎంతోమంది ఉద్యోగాలు కోల్పోతున్నారని చెప్పారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వ‌ర్గాల‌కు చెందిన వారు ఇబ్బందులుపడుతున్నారని వెల్ల‌డించారు. కేంద్రంలోని వివిధ మంత్రిత్వశాఖలు, విభాగాల పరిధిలో దాదాపు 16 లక్షల పైగా ఉద్యోగాలు ఖాళీగా వున్నప్పటికీ వాటిని భర్తీ చేయకుండా కేంద్ర ప్ర‌భుత్వ పెద్ద‌లు తాత్సారం చేస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ విషయంలో ఉభయ సభల్లో ఎన్నోసార్లు నోటీసులు ఇచ్చార‌ని గుర్తు చేశారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఉద్యోగాల భర్తీ కోసం చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. కానీ కేంద్రంలో ఖాళీగా ఉన్నా ఉద్యోగాల భర్తీకి కేంద్రానికి చిత్తశుద్ధి లేద‌న్నారు. గడిచిన 8 ఏళ్లలో 23 పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్ విభాగాలు మూసివేశార‌ని అన్నారు. దేశంలో నిరుద్యోగ శాతం పెరగడంతో ఆత్మహత్యలు అధికం అవుతున్నాయ‌ని వివ‌రించారు.

ఈ విష‌యంపై ఇప్ప‌టికీ కేంద్రం స్పందించకపోవడం శోచనీయమన్నారు. దేశవ్యాప్తంగా మూడు సంవత్సరాల్లో 25 వేల మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు. అయిన కేంద్రం నిరుద్యోగుల విషయంలో ఖాళీలు భర్తీకి దయ చూపడం లేదు కనికరించడం లేదన్నారు. బీజేపీ ప్రభుత్వం తమ మేనిఫెస్టోలో దేశంలో నిరుద్యోగ యువతకి ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్నారని హామీ ఇచ్చిన నాటి నుండి ఎప్పటి వరకు ప్రతి ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు అంటే ఎప్పటికి 16 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉండేద‌న్నారు. యువతను మోసం చేసేందుకు, యువత ఓట్ల కోసమే నాడు 2 కోట్ల ఉద్యోగాలు అని ప్రకటన చేశార‌ని ఎంపీ నామ నాగేశ్వ‌ర రావు తెలిపారు.

also read :-ఉపాధి హామీ కూలీలకు కొత్త షరతులు.

తప్పడు వాగ్దానాలతో కేంద్రం యువతను మోసం చేస్త ఇబ్బంది పెడుతుంద‌ని మండిప‌డ్డారు. ఈ విషయమై యువత ఆలోచించుకోవాలని సూచించారు. యువ‌త‌ప‌క్షాన టీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్లో పోరాటం చేస్తుందన్నారని వెల్ల‌డించారు. పార్లమెంట్ సాక్షిగా తాము నినదించినా, విజ్ఞ‌ప్తి చేసినా… కనికరం లేకుండా వ్యవహరించడంతో పార్లమెంట్ నుండి వాకౌట్ చేయాల్సి వ‌చ్చింద‌ని వివ‌రించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి ఖాళీగా వున్నా పోస్టు భ‌ర్తీ చేయాల‌ని వివ‌రించారు.