Telugu News

బెల్ట్ తీయరా..?

విచ్చల విడి బెల్ట్ షాపులు నియోజకవర్గం వ్యాప్తంగాదళిత గిరిజన కుటుంబాలలొ చిచ్చు రేపుతు,పల్లెలలొ శాంతిబద్రతలకు విఘాతం కల్పిస్తున్నాయని దళిత సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి తగరం రాంబాబు విమర్శించారు

0

బెల్ట్ తీయరా..?

(అశ్వారావుపేట -విజయం న్యూస్)

విచ్చల విడి బెల్ట్ షాపులు నియోజకవర్గం వ్యాప్తంగాదళిత గిరిజన కుటుంబాలలొ చిచ్చు రేపుతు,పల్లెలలొ శాంతిబద్రతలకు విఘాతం కల్పిస్తున్నాయని దళిత సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి తగరం రాంబాబు విమర్శించారు.ఈ రోజు విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలొ మామూళ్ల మత్తులో ఎక్సైజ్ శాఖ జోగుతుందని ఘాటుగా ఆరోపించారు.

గచఅశ్వారావుపేట నియోజకవర్గం పూర్తిగా ఏజెన్సీ ప్రాంతం నియోజకవర్గంలోని మండలాల్లో దళితులు గిరిజనులు నివసించే ప్రాంతం ఇటీవల కాలంలో ప్రభుత్వం షాపులకు టెండర్లు పిలిచి రిజర్వేషన్ ప్రకారం ఎస్సీ ఎస్టీ బీసీ కులాలకు షాపులు కేటాయించటం జరిగింది పేరుకే రిజర్వేషన్లు కానీ వెనుక బడాబాబులు భినామిలుగా ఉండి నడిపిస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారమంతా అధికారుల కనుసన్నలోనే జరుగుతుందన్నారు. ముఖ్యంగా మండలాల్లో ఉన్న షాపులకు అనుసంధానంగా గ్రామాల్లో 7 నుంచి10 వరకు బెల్ట్షాపులుదర్శనమిస్తున్నాయన్నారు లైసెన్స్ షాపులు నుండి నేరుగా బెల్ట్ షాపులకు క్వార్టర్ పై ఎమ్.అర్.పికి అదనంగా 20 రూ పెంచి మద్యాన్ని వాహనాల ద్వారా సరఫరా చేస్తున్నారని, బెల్ట్ షాపుల నిర్వాహకులు క్వార్టర్ పై 80రూ నుంచి 100రూ లాభం వేసుకొని అమ్మకాలు చేస్తున్నారు దీని వలన కోట్లాది రూపాయల ప్రభుత్వానికి రావలసిన ఆదాయం అక్రమార్కుల జేబుల్లోకి వెళ్ళిపోతుందని ఆరొపించారు.

also read ;- 108లో ప్రసవం… తల్లి బిడ్డ క్షేమం

అంతే కాకుండా బెల్ట్ షాపుల వల్ల మద్యం లూజు విక్రయాలు జరుగుతున్నాయని,ఇందులొ కల్తీ జరిగి,ఇది సేవించిన వారు అనారోగ్యం పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. ఈ తతంగమంతా సంబంధిత అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తు మామూళ్ల మత్తులో జోగుతున్నారని ఆరోపించారు ఏజెన్సీ గ్రామాల్లో బెల్ట్ షాపుల ను తొలగించాలని , అలాగే బినామీల ను తొలగించి ఎస్సీ ఎస్టీ ,బీసీ లకు రిజర్వేషన్ ప్రకారం వారికే కేటాయించాలని డిమాండ్ చేసారు . బెల్ట్ షాపులు ఏజెన్సీ గ్రామాల్లో తొలగించే వరకు దళిత సంక్షేమ సంఘం దశల వారీ ఉద్యమం చేస్తుందని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో దళిత సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గద్ధల అప్పారావు రాష్ట్ర కార్యదర్శి ఆవుల చిన్ని రాష్ట్ర ఉపాధ్యక్షుడు మామిడి కృష్ణ విద్యార్ధి సంఘ రాష్ట్ర కార్యదర్శి కొలికపోగు ధర్మరాజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు గొల్లమందల పెంటయ్య ఎస్సీ పరిరక్షణ సమితి bcm అధ్యక్షుడు గిద్ధ కొండయ్య జిల్లా సీనియర్ నాయకులు కోలికపోగు ప్రభు దేవా తదితరులు పాల్గొన్నారు.

also read ;- అభివృద్ధిలో టీకన్నపల్లి ఆదర్శం