ప్రసవానికి పోవాలంటే వాగు దాటాల్సిందేనా..?
== టైర్ పైన గర్భిణిని వాగుదాటించిన స్థానికులు
== ములుగు జిల్లా ఎలిశెట్టిపల్లికి దొరకని రవాణా సౌకర్యం
== పట్టించుకునే పాలకులు.. ఇబ్బందులు పడుతున్న అదివాసులు
(ములుగు-విజయం న్యూస్)
నిండు గర్భిణీకి నొప్పులు వచ్చాయి అర్జెంటుగా ఆసుపత్రికి తరలించాలి నిమిషాల వ్యవధిలో ఆసుపత్రికి తరలించకపోతే పరిస్థితి ఇబ్బందిగా ఉండే అవకాశం ఉందని స్థానిక ఆర్ఎంపి తెలిపారు ఆ గర్భిణీ ని తీసుకెళ్లి ఎందుకు కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు ఎందుకో తెలుసా ఆ ఊరికి సరైన రహదారి సౌకర్యం లేదు..
ఇది కూడా చదవండి:- నేడు తుమ్మల జాయినింగ్
రవాణా సౌకర్యం కావాలంటే జంపన్న వాగు దాటాల్సిందే మనసులు మునిగే లోతు నీరు ప్రవహిస్తున్నప్పటికీ ఆ వాగు దాటితేనే రహదారి సౌకర్యం కలుగుతుంది ఎలా తీసుకెళ్లాలని ఆలోచిస్తున్నా సందర్భంలో స్థానిక యువకులు ట్రాక్టర్ టైర్ ఆధారంగా చేసుకొని నిండు గర్భిణిని వాగు దాటించి ఆసుపత్రికి తరలించిన సంఘటన ఏటూర్ నాగారం ములుగు జిల్లా ఎటు నగరం మండలం, ఎలిశెట్టిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. ఆ గ్రామానికి చెందిన దుబ్బగట్ల సునీతకు పురిటినొప్పులు వచ్చాయి. ఆమె ను ఆసుపత్రి కి తరలించేందుకు స్థానికలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ఇది కూడా చదవండి:- తుమ్మల ఇంటికి ఠాక్రే
ఒకవైపు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని, దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉందని, తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తుందని ప్రభుత్వం గొప్పలు చెబుతుంది.. మరోవైపు గిరిజన ప్రజలు వైద్యానికి వెళ్లడానికి కూడా రహదారి సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న దుస్థితి తెలంగాణ రాష్ట్రంలోనే ఉంది.
ఇది కూడా చదవండి:- కేసీఆర్ మాటలను నమ్మొద్దు : రేవంత్
స్వతంత్ర వచ్చి 76సంవత్సరాలు ఆవుతున్నా ఎటువంటి రోడ్డు రవాణా సౌకర్యాలు లేనటువంటి ఏజెన్సీ ప్రాంతం ఎలిశెట్టిపల్లి.. కేవలం మండల కేంద్రామైన ఏటూర్ నాగారం I.T.D.A. ప్రాంతానికి 10కిలోమీటర్ల దూరంలో ఉండి కూడా ఎటువంటి అభివృద్ధి చెందనటువంటి ఏజెన్సీ గ్రామం ఎలిశెట్టిపల్లి.. ఎంతో మంది రాజకీయ నాయకులు ఓట్ల కోసం వస్తారు,పోతారు.. కానీ గ్రామ అభివృద్ధికి మాత్రం ఎటువంటి సహకారం అందించడం లేదు. డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ చెప్పినట్లు మన గ్రామాలలో విద్య, వైద్యం, రవాణా సౌకర్యాలు ఉన్నపుడు మన ఏజెన్సీ గ్రామాలు అభివృద్ధి చెందుతాయి అన్నారు.
కానీ మాఎలిశెట్టిపల్లి గ్రామం ఎప్పుడూ అభివృద్ధి చెందుతుందొ మా గ్రామంలో ప్రజలు పడుతున్న కష్టాలు, ఎదుర్కొంటున్న ఇబ్బందులు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని ఎలిశెట్టిపల్లి గ్రామ ప్రజలు వేడుకుంటున్నారు. మరీ ఇప్పటికైనా ప్రభుత్వం ఎలిశెట్టిపల్లికి రహదారి సౌకర్యం కల్పిస్తుందా..? వేచి చూడాల్సి ఉంది.