Telugu News

గడీల వారసులు కావాలా?…. గరీబోళ్ల బిడ్డ కావాలా?: బండి సంజయ్

కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులకు వందల కోట్ల ఆస్తులున్నయ్...

0

*గడీల వారసులు కావాలా?…. గరీబోళ్ల బిడ్డ కావాలా?: బండి*

== కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులకు వందల కోట్ల ఆస్తులున్నయ్…*

== కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు కేసీఆర్ అనే నాణేనికి బొమ్మ, బొరుసులాంటి వాళ్లు..*

== నేను పక్కా లోకల్… వినోద్ నాన్ లోకల్… *

== కాంగ్రెస్ అభ్యర్ధి లోకలా? నాన్ లోకలా? ఆ పార్టీ కార్యకర్తలైనా చెప్పగలరా?*

== వందల కేసులున్న నాకు మీరే ఆస్తి*

== వాళ్లు గెలిస్తే వేల కోట్లు సంపాదిస్తరు… నన్ను గెలిపిస్తే మీ కోసం వేల కేసులు పెట్టినా భయపడను*

== కాంగ్రెస్ కార్యకర్తలారా… మీ అభ్యర్ధి ఎవరో మీకైనా తెలుసా?*

== భారీ మెజారిటీతో గెలిపించి ఆశీర్వదించండి*

== కరీంనగర్ ప్రజలను కోరిన బండి సంజయ్*

== కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులపై పంచ్ ల వర్షం కురిపించిన బండి సంజయ్*

== బండిని బంపర్ మెజారిటీతో గెలిపించి మోదీకి గిఫ్ట్ ఇవ్వాలని కోరిన కిషన్ రెడ్డి*

== రాష్ట్రమంతా ప్రచారం చేయాలని బండిని కోరిన కిషన్ రెడ్డి*

== బండి నామినేషన్ కు వేలాదిగా తరలివచ్చిన ప్రజలు

== భారీ బైక్ ర్యాలీతో కాషాయ సంద్రమైన కరీంనగర్

== మోదీ.. మోదీ..ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్ అంటూ మారుమోగిన నినాదాలు*

 

(కరీంనగర్ -విజయం న్యూస్)

‘‘కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్ధులు వందల కోట్ల రూపాయలు ఉన్నోళ్లు… వందల కోట్లు ఖర్చు చేయడానికి వచ్చినోళ్లు… వాళ్లు గెలిస్తే వేల కోట్లు సంపాదించుకుంటారు.. నాకు వాళ్లలాగా కోట్ల ఆస్తుల్లేవు.. కానీ మీ కోసం కొట్లాడి వందల కేసులున్నోడిని. వాళ్లకు ఆస్తి కోట్ల రూపాయలు… కానీ నా ఆస్తి మీరే… వాళ్లు గెలిస్తే వేల కోట్లు సంపాదిస్తరు.. నేను మీ కోసం కొట్లాడి వేల కేసులు పెట్టినా భయపడనోన్ని…గడీల వారసులు కావాల్నా? గరీబోళ్ల బిడ్డ బండి సంజయ్ కావాల్నా గుండెమీద చేయి వేసుకుని ఓటేయండి’’ అంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్ధులిద్దరూ కేసీఆర్ అనే నాణేనికి బొమ్మాబొరుసు లాంటి వారని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి:- కాంగ్రెస్, బీఆర్ఎస్ వైఫల్యాలనూ ఎండగడతాం: బండి సంజయ్ 

కరీంనగర్ బీజేపీ అభ్యర్ధిగా ఈరోజు ఉదయం బండి సంజయ్ నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా ఈ కార్యక్రమానికి గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర భాయ్ రజనీకాంత్ పటేల్, పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. తొలుత సీఎం, కిషన్ రెడ్డి కరీంనగర్ హెలిప్యాడ్ వద్దకు రాగానే బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, పార్టీ కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల అధ్యక్షులు గంగాడి క్రిష్ణరెడ్డి, ప్రతాపరామ క్రిష్ణలు ఘన స్వాగతం పలికారు. అనంతరం నేరుగా జిల్లా కలెక్టరేట్ వద్దకు వచ్చిన గుజరాత్ సీఎం, కిషన్ రెడ్డిలతో కలిసి బండి సంజయ్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలోకి వెళ్లారు. అక్కడ నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ముగ్గురూ కలిసి ఒకే కాన్వాయ్ లో ఎస్సారార్ డిగ్రీ కాలేజీ వద్దకు వెళ్లారు.. అక్కడికి వచ్చి వేలాది మంది కార్యకర్తలతో ఆ ప్రాంతమంతా జనసంద్రమైంది.

ఇది కూడా చదవండి:- ఆకలి చావులకు సర్కార్ దే బాధ్యత: రాణి రుద్రమదేవి 

వారందరికీ అభివాదం చేస్తూ ముగ్గురు నేతలు ఓపెన్ టాప్ వాహనం ఎక్కారు. వారిని చూడగానే కార్యకర్తలంతా మోదీ…మోదీ…మోదీ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.. ఈ సందర్భంగా బండి సంజయ్ చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు…

*బీజేపీ హైకమాండ్ నాకు టిక్కెట్ ఇవ్వగానే… మీ అందరి ఆశీస్సులతో కరీంనగర్ బిడ్డగా నామినేషన్ దాఖలు చేసిన. మోదీని మళ్లీ ప్రధానిగా చేసే అవకాశం కోసం కరీంనగర్ లోని ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నారు.. భారత్ ను నెంబర్ వన్ గా తీర్చిదిద్దేందుకు అహర్నిశలు క్రుషి చేస్తున్న మోదీకి మద్దతివ్వాలని కోరుతున్నా. మీరు నన్ను గెలిపిస్తే నేను మోదీకి ఓటేస్తా… కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిస్తే రాహుల్ గాంధీకి ఓటేస్తరు.. ఎవరు కావాలో తేల్చుకోండి..

నేను మీ బిడ్డను. పక్కా లోకల్. మీరు పెంచి పోషించిన బిడ్డను. మీకోసం నిరంతరం కొట్లాడుతున్న. మీ కోసం లాఠీదెబ్బలు తిన్న. వందల కేసులు పెట్టినా మీకు అండగా నిలిచిన. నిరుద్యోగుల కోసం, ఉద్యోగుల కోసం జైలుకు వెళ్లిన. 317 జీవోకు నిరసనగా ఎంపీ కార్యాలయంలో ధర్నా చేస్తే నా ఆఫీస్ బద్దలు కొట్టి కేసీఆర్ గుంజుకుపోయి జైళ్లో వేసినా భయపడలే… ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసం కొట్లాడింది నేను. అగ్రవర్ణాల పేదల కోసం పోరాడింది నేను..

కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు నాన్ లోకల్… కేసీఆర్ అనే ముఖానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు బొమ్మ, బొరుసు లాంటి వాళ్లు…ఏనాడూ రైతులు, విద్యార్థులు, యువకులు, నిరుద్యోగుల, మహిళలు కష్టాల్లో ఉన్నప్పుడు అండగా ఉండలేదు. పరామర్శించలేదు..

వాళ్లకు వందల కోట్ల రూపాయలు ఉన్నోళ్లు… వందల కోట్లు ఖర్చు చేయడానికి వచ్చినోళ్లు… వాళ్లు గెలిస్తే వేల కోట్లు సంపాదించుకుంటారు.. నాకు వాళ్లలాగా కోట్ల ఆస్తుల్లేవు.. కానీ మీ కోసం కొట్లాడి వందల కేసులున్నోడిని. వాళ్లకు ఆస్తి కోట్ల రూపాయలు… కానీ నా ఆస్తి మీరే… వాళ్లు గెలిస్తే వేల కోట్లు సంపాదిస్తరు.. నేను మీ కోసం కొట్లాడి వేల కేసులు పెట్టినా భయపడనోన్ని…వాళ్ల గడీల వారసులు… నేను గరీబోళ్ల బిడ్డను.. ఎవరు కావాలో తేల్చుకోండి…

ఇది కూడా చదవండి:- తడిసిన వడ్లన్నీ కొనాల్సిందే: బండి సంజయ్

నేనడుగుతున్న… బీఆర్ఎస్ అభ్యర్ధి ఏనాడైనా రైతులను ఆదుకున్నడా? పంట నష్టపోతే సాయం చేయించారా? ఏ రోజైనా రైతుల పక్షాన, నిరుద్యోగుల పక్షాన, ఉద్యోగుల కోసం సీఎంకు లేఖ రాశారా? అధికారంలో ఉంటూ సాయమందించారా?.. కరీంనగర్ స్మార్ట్ సిటీ నిధులు దారి మళ్లిస్తే.. ఆర్వోబీ నిధులు ఇవ్వకపోతే ఏనాడైనా లేఖ రాశారా?

వినోద్ కుమార్ నాన్ లోకల్… మరి కాంగ్రెస్ అభ్యర్ధి ఎవరు? లోకలా? నాన్ లోకలా?… చివరకు కాంగ్రెస్ క్యాడరే ఏం చెప్పాలో అర్ధం కాక కన్ ఫ్యూజన్ లో ఉంది. ఎవరిని చూసి, ఏం చెప్పి ఓట్లు అడగాలో కూడా తెలియని గందరగోళంలో ఉన్నరు. వందల కోట్లు ఖర్చు పెట్టి టిక్కెట్ తెచ్చుకున్న కాంగ్రెస్ అభ్యర్ధి ఏనాడైనా పార్టీ జెండాలు పట్టుకుని మీ పక్షాన పోరాడారా? జనం కోసం ఒక్క ఉద్యమమైనా చేశారా?…
బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలారా… మీరు కష్టాల్లో ఉంటే మీ అభ్యర్థులు ఎన్నడైనా అండగా నిలిచి సాయం చేశారా?… కష్టాల్లో ఉండి మీరు వస్తే నేను నాకు తోచినంత సాయం చేశానా? లేదా? … ఆత్మపరిశీలన చేసుకోండి…

ఇండియన్ పొలిటికల్ లీగ్ (ఐపీఎల్) టీంలో బీజేపీకి మోదీ కెప్టెన్. ఆ టీంలో మేమంతా సభ్యులుగా వస్తున్నాం… మరి కాంగ్రెస్ టీంకు ఎవరు కెప్టెన్ ఎవరు? కెప్టెన్ లేకుండా బరిలో దిగుతున్న టీంను పట్టించుకునేదెవరు? ఇక్కడున్న మంత్రి ఏం మాట్లాడతారో ఎవరికీ అర్ధం కాదు.. మాట్లాడితే తన్నుడు..గుద్దుడు… వెధవ అంటూ తిట్టడం తప్ప సాధించేదేమీ లేదు…

ఈ దేశానికి మోదీ చేసిన అభివ్రుద్ధి, సంక్షేమ పథకాలను గుర్తుకు తెచ్చుకోండి. మోదీని బలపర్చేందుకు నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చేతులెత్తిన నమస్కరిస్తున్న…

*జి.కిషన్ రెడ్డి చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు…*

బండి సంజయ్ ను భారీ మెజారిటీతో గెలిపించండి.. కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులను చూసిన తరువాత సంజయ్ ఇక ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు.. మీ ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి.. రాష్ట్రమంతా తిరిగి ఎన్నికల ప్రచారం చేయాలని కోరుతున్నా…

400 సీట్లతో మోదీ ప్రధాని కాబోతున్నరు. అసలు కాంగ్రెస్ కు ఎందుకు ఓటేయాలి? 6 గ్యారంటీలను అమలు చేశారా? ఇచ్చిన మాట తప్పిన మీకెందుకు ఓటేయాలి?

కేసీఆర్.. ఏ ముఖం పెట్టుకుని ఓట్లడుగుతున్నవ్? ఏం చేసినవని ఓటేయాలి? నీ పార్టీ నుండి గెలిచిన ఎమ్మెల్యేలను సిగ్గులేకుండా కాంగ్రెస్ లోకి పంపి రాజకీయం చేస్తున్నవ్?

కాంగ్రెస్, బీఆర్ఎస్ దొందూ దొందే.. నాణేనికి బొమ్మ బొరుసులాంటివి. తెలంగాణలో 17కు 17 సీట్లు గెలవబోతున్నం…

తెలంగాణ ప్రజల కోసం పోరాడి జైలుకు వెళ్లిన వ్యక్తి బండి సంజయ్. మీ కోసం జైలుకు వెళ్లిన నాయకుడు.

కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థుల్లో ఎవరు బెటరో ఆలోచించండి. ఆ రెండు పార్టీలు ఎన్నడైనా పోరాటం చేశారా? బీఆర్ఎస్ అభ్యర్ధి దోచుకోవడం తప్ప చేసిందేమిటి?

బండి సంజయ్ ను భారీ మెజారిటీతో గెలిపించి మోదీకి బహుమతిగా అందించండి.