Telugu News

ప్రధాని అంటే సీఎం కు లెక్కలేదా..?: బండి సంజయ్

మీడియాతో బండి సంజయ్‌ ఆగ్రహం

0

ప్రధాని అంటే సీఎం కు లెక్కలేదా..?: బండి సంజయ్

== ప్రధాని కార్యక్రమాలకు కెసిఆర్‌ ఎందుకు రాలే

== తెలంగాణ అభివృద్దిపై కెసిఆర్‌కు శద్ద లేదు

== వస్తే సన్మానిద్దామనుకుని శాలువా కూడా తెచ్చా

== మీడియాతో బండి సంజయ్‌ ఆగ్రహం

(హైదరాబాద్‌-విజయంన్యూస్):

దేశ ప్రధానమంత్రి అంటే లెక్కలేదు.. దేశ రాష్ట్రపతి అంటే లెక్కలేదు.. రాష్ట్ర గవర్నర్ అంటే లెక్కలేదు.. రాజ్యంగం అంటే లెక్కలేదు.. వేటి మీద మీకు లెక్క ఉంటుంది సీఎం కేసీఆర్ సార్ అంటూ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ సభకు సీఎం కేసీఆర్‌ ఎందుకు రాలేదో చెప్పాలని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రశ్నించారు. కేసీఆర్‌ ఇవాళ్టి  షెడ్యూల్‌ బయటపెట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు.  సీఎం కేసీఆర్‌ కోసం తాను చాలా ఎదురుచూశానన్న సంజయ్‌…

ఇది కూడా చదవండి: విమానశ్రయంలో ప్రధానికి ఘన స్వాగతం

కేసీఆర్‌కు సన్మానం చేసేందుకు శాలువ కూడా తీసుకువచ్చానని అన్నారు.  దేశ ప్రధాని రాష్ట్ర అభివృద్ధి కోసం హైదరాబాద్‌కు  వస్తే కేసీఆర్‌ ఎందుకు రారన్నారు.  కేంద్రం అభివృద్ధికి సహకరించడం లేదని నిత్యం ఆరోపించే కేసీఆర్‌ ఇప్పుడు తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాలని సంజయ్‌ డిమాండ్‌ చేశారు.  రాష్ట్ర అభివృద్ధిని కేసీఆర్‌ కోరుకోవడం లేదని, కుటుంబ, నియంత, అవినీతి పాలన అంతం కావాలని చెప్పారు.రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని.. కానీ  రాష్ట్ర సర్కార్‌ సహకరించడం లేదని ఆరోపించారు. అటు పలు  అభివృద్ధి పనులు ప్రారంభించటానికి హైదరాబాద్‌ వచ్చిన ప్రధానమంత్రి మోడీ.. పరేడ్‌ గ్రౌండ్స్‌ వేదికగా తెలంగాణ రాష్ట్రంలో పాలన తీరును ఎండగట్టారు. సీఎం కేసీఆర్‌ పేరు ఎత్తకుండానే చురకలు అంటించారు.  రాష్ట్రంలో కుటుంబం, అవినీతి పాలన నడస్తుందని.. ప్రతి ప్రాజెక్టులో అవినీతి వల్ల ఆలస్యం అవుతుందన్నా రాయన. తెలంగాణ కొందరి గుప్పిట్లో అధికారం మగ్గుతోందని మండిపడ్డారు. కుటుంబ పాలనకు విముక్తి కలగాలని చెప్పారు. కుటుంబం పాలన, అవినీతి వేర్వేరు కాదంటూనే.. ఇలాంటి వారిపై పోరాడాలా వద్దా అని ప్రజలను ప్రశ్నించారు. హైదరాబాద్‌ పర్యటన అనంతరం మోడీ చెన్నైకి వెళ్లిపోయారు.

ఇది కూడా చదవండి: నరేంద్ర మోడీనే దేశానికి రక్ష