Telugu News

షేబాస్ రవి.. ఖమ్మంలో ఆటో డ్రైవర్ నిజాయితీ..2లక్షల విలువగల బంగారం అందజేత

ఖమ్మం ప్రతినిధి-విజయంన్యూస్

0

షేబాస్ రవి.. ఖమ్మంలో ఆటో డ్రైవర్ నిజాయితీ..2లక్షల విలువగల బంగారం అందజేత
(ఖమ్మం ప్రతినిధి-విజయంన్యూస్)
కొంత మందిలో నిజాయితీ ఉంది కాబట్టే నేటికి ఈ మానవ జీవన మనుగడ అద్భుతంగా ఉంది. ఇది నిజం.. పదిరూపాయలు దొరికితే జేబులో వేసుకుని ఆటు ఇటు చూసే నేటి విపత్కర రోజుల్లో ఏకంగా రెండు లక్షల రూపాయల విలువ చేసే బంగారం దొరికితే దిరిగి ఇచ్చిన ఆ వ్యక్తిని మనమేమనాలి..? అతన్ను ఎలా పొగడాలి. వాస్తవమే.. ఎంత పొగిడిన అయిన నిజాయితీకిందా దిగుదుడుపే. ఖమ్మంలోని ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న సాధాహరణ వ్యక్తి నేడు ఆ రెండు లక్షలను పోలీసుల ద్వారా బాధితులకు అందించి షేబాస్ అనిపించుకున్నాడు. అతన్ని పోలీసులు అభినందనలతో ముంచేత్తారు. పూర్తి వివరాల్లోకి వెళ్లే గురువారం ఖమ్మం నగరంలోని రైల్వే స్టేషన్ సమీపంలోని ఆనంద్ భవన్ ఆటోస్టాండ్ వద్ద ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్న కాంపెల్లి రవి గురువారం ఆటో నడుపుతుండగా, ఆటోలో ఓ ప్రయాణికులు ప్రయాణించి దిగి వెళ్లిపోయారు.

ఆటోలో ఒక బ్యాగ్ ఉండటంతో రవి ఆ బ్యాగ్ ను చూసి వారికి ఇచ్చేందుకు పరుగుతు తీసిన ఫలితం లేకపోయింది. దీంతో చేసిది లేక బ్యాగ్ లో ఏమైనా అడ్రస్ దొరుకుతుందేమోనని పరిశీలించగా అందులో రూ.2లక్షల విలువ చేసే బంగారు అబరణాలు ఉన్నాయి. తక్షణమే ఆ బ్యాగ్ ను ఖమ్మం వన్ టౌన్ ఎస్ పి.వెంకన్నకు అందజేశారు. వెంటనే ఎస్ఐ బాధితులను పిలిపించి ఆ బ్యాగ్, నగదును అందజేశారు. కాగా బాధితులు ఆటో డ్రైవర్ కు ధన్యవాదాలు తెలిపారు. ఆటో డ్రైవర్ రవి నిజాయతీని తెలుసుకున్న వన్ టౌన్ సీఐ చిటిటబాబు, ఎస్ఐ వెంకన్న, టీఆర్ఎస్ కెవి టీఏటీయు జిల్లా అధ్యక్షులు పాల్వంచ క్రిష్ణ అభినందించి, సన్మానించారు. ఆటో డ్రైవర్ రవి నేటి తరం యువతకు ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ప్రయాణికులు ఆటోలు, బస్సులు, రైళ్లు ఎక్కి దిగే సమయంలో అన్ని వస్తువులు ఉన్నాయా..? లేవా జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు.

also read :-ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్ కే పట్టంకట్టారు : మాజీ ఎంపీ పొంగులేటి