Telugu News

కస్తూరిబా బాలికలకు పరీక్ష సామాగ్రి అందజేత.

ఏనుకూరు విజయం న్యూస్

0

కస్తూరిబా బాలికలకు పరీక్ష సామాగ్రి అందజేత.

(ఏనుకూరు విజయం న్యూస్):-

ఏన్కూరు లోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం లో చదువుతున్న పదవ తరగతి విద్యార్థినిలకు స్థానిక సొసైటీ అధ్యక్షులు శెట్టిపల్లి వెంకటేశ్వరావు ఆధ్వర్యంలో శుక్రవారం 70 మంది విద్యార్థినిలకు 20 వేల రూపాయల వ్యయంతో పరీక్ష సామాగ్రిని అందజేశారు. ఏఎంసీ మాజీ చైర్మన్ భూక్య లాలు నాయక్ వీటిని విద్యార్థినిలకు పంపిణీ చేశారు.

also read :-గంగమ్మతల్లి జాతరలో పొంగులేటి

విద్యార్థినిలు పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించి పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల స్పెషల్ ఆఫీసర్ ఉషారాణి ,ఉప సర్పంచ్ మజీద్ ఖాన్,ఆనందరావు,కూరాకుల రమేష్ ,జయరామ్, ఉపాధ్యాయినీలు, సిబ్బంది పాల్గొన్నారు.