Telugu News

అదైర్యపడకండి..నేనున్నా: పొంగులేటి 

రాబోయే అధికారం మనదే.. అందరి ఆటలను కట్టిపడేస్తాం

0

అదైర్యపడకండి..నేనున్నా: పొంగులేటి 

== రాబోయే అధికారం మనదే.. అందరి ఆటలను కట్టిపడేస్తాం

== ఇందిరమ్మ రాజ్యం కావాలా..? ఇంటి రాజ్యం కావాలా…?

== దోపిడి,దొరల  పాలన కావాలా..? పేదల పాలన కావాలా..?

== ప్రజలకు ఏ ప్రభుత్వం కావాలో ఆలోచించుకొండి

==  ప్రజలను కోరిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

== జీళ్ళచెరువు గ్రామంలో భారీ ర్యాలీ..పూలవర్షం

(కూసుమంచి-విజయంన్యూస్)

కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఎవరు భయాందోళన చెందోద్దు.. బెదిరింపులు, భయపెట్టడం అన్ని ఇంకో  రెండు నెలలే.. ఆ తరువాత అధికారం మనదే.. అందరి ఆటలను కట్టిపడేస్తాం.. గేట్లు కూడా ముట్టనిచ్చేది లేదు.. ఎవరు ఆదైర్యపడోద్దు.. అందరికి అండగా ఉంటానని మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భరోసానిచ్చారు.

ఇది కూడా చదవండి:- కేటీఆర్  నోరు జాగ్రత్త: సీఎల్పీ నేత భట్టి

కూసుమంచి మండలంలోని జీళ్ళచెరువు గ్రామంలో కాంగ్రెస్ ఇంటింట ఓదార్పు యాత్ర చేపట్టారు. జీళ్ళచెరువు గ్రామానికి  వచ్చిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు అపూర్వ స్వాగతం పలికారు. పూలవర్షం కురిపించారు. మోటర్ సైకిళ్లతో ర్యాలీ చేపట్టారు. అనంతరం గ్రామంలో ఇటీవలే కొంతమంది అనేక కారణాల ద్వారా చనిపోగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు.  పలు కుటుంబాలను పరామర్శించి అర్థిక చేయూతనందించారు. సీనియర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త  సురబీ అయోద్యను పరామర్శించారు. ఆయన యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు.

ఇది కూడా చదవండి:- కాంగ్రెస్ తుంగ పూస లాంటిది: పువ్వాళ్ల

అనంతరం కార్యకర్తలతో మాట్లాడారు. గ్రామంలో జరుగుతున్న పరిస్థితులను ఆయనకు వివరించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీళ్ళచెరువు గ్రామంలో ఉన్న కార్యకర్తలందరు, నాయకులకు ఒక్కటే చెబుతున్న ఎప్పుడు అధికారం ఒక్కరికే ఉండదు.. అధికారం ఎవరాబ్బా సొత్తుకాదు..ఎప్పుడు చికటీ ఉండదు..కచ్చితంగా తెల్లవారాల్సిందే.. అది ఎన్నో రోజులు ఉండదు.. మనకు రెండు నెలల్లో మన కంట్లో వెలుగులు రావడం ఖాయం. ఇందిరమ్మ రాజ్యం రావడం ఖాయం.. అప్పుడు చూస్తాం మనసంగతేంటో..? అప్పటి వరకు బెదిరించిన, అదిరించిన ఒపిక పట్టండి.. సమన్వయం పాటించడండి అంటూ సూచించారు. ప్రజలు కూడా కొన్ని ఆలోచించాల్సిన అవసరం ఎంతైన ఉందన్నారు. పేదప్రజలకు బతుకు చూపించిన, పేదలకు అద్భుతమైన పథకాలను అందించిన ఇందిరమ్మ రాజ్యం కావాలా..? రాష్ట్ర సంపదను ఒక కుటుంబానికే పరిమితం చేసి దోచుకోవడం, దాచుకోవడం చేసే ఇంటిరాజ్యం కావాలా..? ఆలోచించుకోవాలని సూచించారు. దోపిడి చేస్తున్న దొరల పాలన కావాలా..? పేదల కోసం, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన ఇందిరమ్మ పాలన కావాలో ప్రజలు ఆలోచించుకుని నిర్ణయం తీసుకోవాలన్నారు.

ఇది కూడా చదవండి:- పాలేరు కు పొంగులేటి

గడిచిన 10ఏళ్లలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసిందో..? కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో గుర్తు చేసుకోవాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి పథకాలను అమలు చేస్తుందన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామిలకంటే..ఉత్తుత్తి హామిలే అమలుకు నోచుకుంటాయని, ప్రకటించిన పథకాలకు పావలాకే పరిమితమవుతాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీ పథకాలను ప్రకటించిందని, ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లో ఈ ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేస్తామని హామినిచ్చారు. కార్యకర్తలు, నాయకులు కూడా ప్రజలకు ఇదే చెప్పాలని, ప్రజలకు అవగాహణ కల్పించాలని సూచించారు.

ఇది కూడా చదవండి:- ఓట్ల కోసం కేసీఆర్ ది దొంగ కపట నాటకం: భట్టి విక్రమార్క

కార్యకర్తలందరికి అండగా ఉంటానని, ప్రజలందరికి భరోసాగా ఉంటానని హామినిచ్చారు. ఈ కార్యక్రమంలో ఈ పర్యటనలో పొంగులేటి వెంట మండల పార్టీ అధ్యక్షుడు మట్టె గురవయ్యబీరోలు సోసైటీ చైర్మన్ రామసహాయం నరేష్ రెడ్డిరాష్ట్ర నాయకురాలు మద్దినేని బేబి స్వర్ణకుమారిమాజీ ఎంపీపీలు జూకూరి గోపాల్ రావు, రామసహాయం వెంకట్ రెడ్డి, యడవల్లి ముత్తయ్య, మండల నాయకులు ఎండీ.హాఫీజుద్దీన్, పెండ్ర అంజయ్య, బజ్జూరి వెంకట్ రెడ్డి, సర్పంచ్ సూర్యనారాయణరెడ్డి, సుధాకర్ రెడ్డి, యడవల్లి ముత్తయ్య, బెల్లంకొండ కిరణ్ కుమార్, అంజిరెడ్డి, తుపాకుల వెంకన్న, భారీ వీరభద్రం, మీరా, 

ఇది కూడా చదవండి:- జమిలి ఎన్నికలు లేనట్లే..?

జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు బానోతు వినోద, గ్రామశాఖ అధ్యక్షుడు కత్తిశ్యామ్, మద్దెల ఉపేందర్, యువజన నాయకుడు ఐతగాని ప్రభాకర్, ఐతగాని రాంగోపాల్, నాగేశ్వరరావు,రంగయ్య, కాసాని వెంకన్న, దంతాల శ్రీనివాస్, పెండ్ర ప్రసాద్, నరేష్, వీరబాబు, నాగేశ్వరరావు, వార్డు సభ్యులు అయితగాని రంగయ్య, గోపిరజని,లక్ష్మణ్, వీరభద్రం, రామనాదం, ఐ.పుల్లయ్య, మొక్కరాము, ఐ.సైదులు, కత్తి సత్యం, బేజవాడ శ్రీకాంత్, సురబీ వెంకటేశ్వర్లు, కిషోర్, గురువులు, పెండ్ర ఉపేందర్, పెండ్ర వెంకన్న,రిక్కి, అంబాల శ్రీనివాస్, అంబాల ఉపేందర్,ఐ.రామస్వామి, అంబాల వీరబాబు, కత్తి సత్యం, ఆయా మండలాల నాయకులుకార్యకర్తలుఅభిమానులు తదితరులు ఉన్నారు.