అదైర్య పడొద్దు… అండగా ఉన్నామంటున్న అమ్మ ఫౌండేషన్
అగ్ని బాధిత కుటుంబాలకు అమ్మ ఫౌండేషన్ అధ్యక్షులు కృష్ణ బాబు ఆర్థిక చేయూత
అదైర్య పడొద్దు… అండగా ఉన్నామంటున్న అమ్మ ఫౌండేషన్
అగ్ని బాధిత కుటుంబాలకు అమ్మ ఫౌండేషన్ అధ్యక్షులు కృష్ణ బాబు ఆర్థిక చేయూత
(నూగూరు వెంకటాపురం-విజయం న్యూస్);-
శనిగా కుంట గ్రామంలో బారీ అగ్ని ప్రమాదానికి ఆదివాసీ కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ములుగు ఎమ్మెల్యే సీతక్క తక్షణ సహాయం పిలుపు మేరకు స్వచ్చంద సేవాసంస్థలు మనోదైర్యాన్ని చాటుకుంటున్నాయి.ఈ అగ్ని ప్రమాదంలో బారినష్టం వాటిల్లింది.అగ్ని బాధితులకు మేమున్నాం అండగా అంటూ అమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపకులు పీర్ల కృష్ణ బాబు,ఆదివాసీ టీచర్స్ పెడరేషన్ సంఘాలు ఆర్థిక చేయూతతో పాటు ,50 వేలు పలు నిత్యవసర సరుకులు ఎమ్మెల్యే సీతక్క చేతుల మీదుగా అందించారు.పీర్ల కృష్ణ బాబు శనిగా కుంట గ్రామ అగ్ని బాధిత కుటుంబాలకు మానసిక దైర్యాన్ని నింపారు.ప్రతి గూడెం,పల్లెకు ఏ చిన్న సమస్య వచ్చిన మేమున్నాం అంటూ అమ్మ స్వచ్చంద సేవ సంస్థ మీ ముందుంటుందన్నారు.
also read :-గ్రామ గ్రామాన ఎర్రజెండా రెపరెపలు,
ఆదివాసీ టీచర్స్ పెడరేషన్ నాయకులు సంతోష్,లక్ష్మయ్య,రమేష్ మాట్లాడుతూ ఆదివాసీ ప్రజలకు బారి నష్టం వాటిల్లిందని వాపోయారు.శనిగా కుంట గ్రామం అగ్నికి ఆహుతి అయిన ఇండ్లను పరిశీలించారు ఆదివాసీ నవనిర్మాణ సేన వ్యవస్థాపక అధ్యక్షులు కోర్సా నర్సింహ మూర్తి.ప్రతి కుటుంబానికి నష్ట పరిహారంతో పాటు, పక్క ఇండ్లు నిర్మించాలన్నారు.మానవతా పిలుపు మేరకు స్పందించి సహాయం అందించిన అమ్మ స్వచ్చంద సేవ సంస్థ వ్యవస్థాప కులు పీర్ల కృష్ణబాబు కు ధన్యవాదాలు తెలియచేసారు.కరోనా మొదలుకొని నేటివరకు అమ్మ స్వచ్చంద సేవ సంస్థ ప్రతి ఒక్కరికి అండగా ఉంటుందని కొనియాడారు.ఈ కార్యక్రమంలో ఆదివాసీ నవనిర్మాణ సేన వ్యవస్థపకులు కోర్సా నర్సింహ మూర్తి,వాసం నాగరాజు,ఆదివాసీ టీచర్స్ పెడరేషన్ నాయకులూ సంతోష్,లక్ష్మయ్య,రమేష్,రోజా తదితరులు పాల్గొన్నారు.