Telugu News

బీజేపీ పై అసత్య ప్రచారాలు నమ్మొద్దు: రవి రాథోడ్

బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావును గెలిపించండి

0

బీజేపీ పై అసత్య ప్రచారాలు నమ్మొద్దు: రవి రాథోడ్

== బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావును గెలిపించండి

== విలేకర్ల సమావేశంలో గిరిజన మోర్చ జిల్లా అధ్యక్షుడు రవి రాథోడ్

(ఖమ్మం ప్రతినిధి -విజయం న్యూస్)

బిజెపి గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని,రిజర్వేషన్ తొలగిస్తారని తప్పుడు ప్రచారం చేసి గిరిజన సమాజం యొక్క ఓట్లను దండుకోవాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీ యొక్క మోసపూరిత మాటలను నమ్మి మోసపోవద్దని, బిజెపికే బంజారాలు మద్దతు పలికి ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి తాండ్ర వినోద్ రావుని భారీ మెజారిటీతో గెలిపించాలని ఖమ్మం జిల్లా బిజెపి ఎస్టీ మోర్చ అధ్యక్షుడు రవి రాథోడ్ పిలుపునిచ్చారు. ఖమ్మం ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో పాల్గొని ప్రజలను అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. గిరిజన మహిళను రాష్ట్రపతిని చేసిన ఘనత,రాష్ట్రంలో సమ్మక్క సారలమ్మ పేరుతో గిరిజన యూనివర్సిటీని మంజూరు చేసిన పార్టీ బిజెపికే అవకాశం ఇవ్వాలని మీడియా ద్వారా ప్రజలను కోరారు.తండాల్లో బిజెపి ప్రచారం జోరుగా సాగుతోందని బంజారా ప్రజలు బిజెపికి బ్రహ్మ రథం పడుతున్నారని తెలియచేసారు.ఈ కార్యక్రమంలో గిరిజన రాష్ట్ర నాయకులు కృష్ణ రాథోడ్,ఎస్టీ మోర్చ జిల్లా ప్రధాన కార్యదర్శి జాటోత్ మోహన్,మాజీ ఎంపీటీసీ వీరు నాయక్ పాల్గొన్నారు.