Telugu News

కేసీఆర్ మాటలను నమ్మొద్దు : రేవంత్

మంచి చేసేది కాంగ్రెస్..మాటలు చెప్పేది బీఆర్ఎస్

0

కేసీఆర్ మాటలను నమ్మొద్దు : రేవంత్

== మంచి చేసేది కాంగ్రెస్..మాటలు చెప్పేది బీఆర్ఎస్

== తొమ్మిదేళ్ల నుంచి మాయమాటలు గారడినే

== పోడు భూములకు పట్టాలు ఇస్తా అన్నడు

== కుర్చి వేసుకుని కుర్చుంటా అన్నడు..

== అసెంబ్లీలో మాటిచ్చిండు..పంపిణి చేయలేక చేతులేత్తేసిండు

== రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే.. పోడు రైతులకు మేమే పట్టాలిస్తాం

==  2006లో పదివేల ఎకరాలకు పట్టాలిచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం

==  కెసిఆర్ ని చిత్తుగా ఓడిద్దాం.. కాంగ్రెస్కు గెలిపించుకుందాం

==  పథకాలను తలదన్నే పథకాలను ఏర్పాటు చేసుకుందాం

== సింగరేణి కార్మికుల సమస్యలకు కేసీఆరే కారణం.

– ఇల్లందులోని పబ్లిక్ మీటింగ్ లో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

(ఇల్లందు-విజయం న్యూస్)

ఎన్నికలు వస్తున్న తరుణంలో మాటల మాంత్రికుడు మాయమాటలతో జనం ముందుకు వస్తాడు.. ఇదిగో మీ చేతిలోకే వచ్చేస్తున్నట్లు మోసపూరిత మాటలు చెప్పి మళ్లి గెలిచేందుకు కుట్రలు పన్నేస్తాడు.. ఆయన మాయమాటలు వినివిని 9ఏళ్లు గడిచిపోయినయ్, ఇంకా వినుకుంటూ పోతే మన ఒంటిపై బట్టలను కూడా అమ్మెస్తడు.. అందుకే సీఎం కేసీఆర్ మాటలను ఎవరు నమ్మోద్దని, రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ టీమ్ ను తరిమికొట్టాల్సిన అవసరం ఎంతైన ఉందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ ఎలక్షన్ ముందు గారడి చేస్తున్నాడని పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు.

ఇది కూడా చదవండి: అసెంబ్లీలో భట్టి ప్రశ్నల వర్షం

పాదయాత్రలో భాగంగా ఇల్లందుకు చేరుకున్న రేవంత్ రెడ్డి  శనివారం రాత్రి జగదాంబ సెంటర్లో ఏర్పాటు చేసిన పబ్లిక్ మీటింగ్ లో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ ను నమ్మితే ప్రజలంతా తీవ్రంగా మోసపోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు. 2014 నుంచి ఇప్పటి వరకు వేలాధి సార్లు అబద్దాలు చెబుతూ పబ్బం గడుపుకున్నారని ఆరోపించారు. అబద్దాలతో తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం చేశారని, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి అర్థిక వ్యవస్థలో కుంగిపోయే విధంగా చేశారని పేర్కోన్నారు. ఒక్కోక్కరిపై సుమారు 2లక్షల అప్పు చేసిన ఘనుడు తెలంగాణ ముఖ్యమంత్రి అని, మరోసారి గెలిపిస్తే ఒక్కోక్క తలపై రూ.10లక్షల అప్పు చేసి చేతులేత్తేస్తాడని అన్నారు.

== పోడు భూమిలిస్తానన్న ముఖ్యమంత్రి ఎక్కడ..?

తెలంగాణ రాష్ట్రంలో రెండవ సారి అధికారంలోకి రాగానే సీఎం కేసీఆర్ అసెంబ్లీలో పోటు మగాడిలా  పోడు రైతులందరికి కుర్చోని పట్టాలిస్తామని హామినిచ్చారని, ఇప్పుడేక్కడికి పోయాడో అర్థం కావడం లేదని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. 2006లో 6000 మందికి పదివేల ఎకరాలు భూమికి  కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పేద రైతులకు పట్టాలిచ్చిందన్నారు. కేసీఆర్ 9 సంవత్సరాలైనా ఇప్పటివరకు పట్టాల  అంశమే లేదని పేర్కొన్నారు. ములుగు ఎమ్మెల్యే సీతక్క పలుమార్లు అసెంబ్లీలో డిమాండ్ చేసిన కేసిఆర్ పెడచెవిన పెట్టారని పేర్కొన్నారు. కెసిఆర్ కి అధికారం కోసమే ఉద్దేశంతోటే అనవసరమైన వాగ్దానాలు చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వెంటనే అర్హులైన ప్రతి ఒక్కరికి పోడు భూములకు పట్టాలు ఇస్తామని హామినిచ్చారు.

== 24గంటల ఉచిత కరెంటేక్కడ..?       ఇది కూడా చదవండి: స్వంత గూటికా..?సోదరి గూటికా..?  పొంగులేటి దారేటు..?

దేశంలో ఎక్కడ లేని విధంగా 24గంటల విద్యుత్ ను అందిస్తున్నామని గొప్పలు చెప్పిన మాటల మాంత్రీకుడు, ఇఫ్పుడేందుకు 24గంటల కరెంట్ ఇవ్వడం లేదో చెప్పాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కేసీఆర్ ను సూటిగా ప్రశ్నించారు. కరెంట్ సరైన టైమ్ లో రాకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. అంతే కాకుండా ఏసీడీ పేరుతో రైతులను నట్టెట ముంచేస్తున్నారని, జనం నోట్లో మన్నుకొడుతున్నారని, ఏ ఒక్కరు కూడా ఏసీడీ చార్జీలు చెల్లించోద్దని రేవంత్ రెడ్డి ప్రజలను కోరారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఏసీడీ చార్జీలను రద్దు చేస్తామని తెలిపారు. అలాగే రైతు రుణమాఫీ అంటూ గొప్పలు చెప్పిన సీఎం కేసీఆర్ ఇప్పటి వరకు రైతు రుణమాఫీ చేయలేదని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రూ.2లక్షలను అందరికి ఒకే సారి రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. మాయమాటలు చెప్పడం కాంగ్రెస్ వల్ల కాదని, చేసేదే చెబుతామని అన్నారు.

== బీఆర్ఎస్ కు వీఆర్ఎస్ ప్రకటించండి: రేవంత్ రెడ్డి

ప్రజలందరు సీఎం కేసీఆర్ మాయమాటలను నమ్మోద్దని, ప్రస్తుతం ఆయన ఇచ్చిన వందలాధి హామిల గురించి పట్టించుకుని కేసీఆర్ కొత్త హామిలతో ప్రజల వద్దకు ఎన్నికల కోసం వస్తాడని,  ఇప్పటికైనా ప్రజానీకం ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత కేవలం కల్వకుంట్ల కుటుంబం తప్ప ఎవరు బాగుపడనట్టు చూడలేదన్నారు. రాబోయే రోజుల్లో బిఆర్ఎస్ పార్టీని బొంద పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. యువత ఉద్యోగులు ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.

== కాంగ్రెస్ నుంచి వెళ్లిపోయిన ఎమ్మెల్యేలను వదలం

కాంగ్రెస్ నుంచి గెలిచి వెళ్లిపోయిన 12మంది ఎమ్మెల్యేలను వదిలేది లేదని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి ఇతర పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై అధికారంలోకి వస్తే విచారణ చేపడతామని పేర్కొన్నారు. ఇల్లందు ఒకప్పుడు 8,000 మంది కార్మికులతో కలకల్లాడిందని, నేడు కేవలం 600 మందితోనే విలవిల్లాడిపోతుందన్నారు. పురిటిగడ్డకు జన్మస్థలమైన ఇల్లందు కు అండర్ గ్రౌండ్ మైన్ లేకపోవడం బాధాకరమన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా పురిటిగడ్డకు పూర్వం వైభవం తీసుకొస్తానని హామినిచ్చారు. కేంద్రం ఓసిలన్ని ప్రైవేటి కరణ చేస్తుంటే ప్రభుత్వం ఏమి చేయలేక చేతులు కట్టుకొని ఉందని ఆరోపించారు. మేము అధికారంలోకి వస్తే మొత్తం సింగరేణి పూర్వం వైభవం తీసుకొస్తామని కార్మికులకు ప్రజలకు వాగ్దానం చేశారు. గిరిజన టీచర్లకు ప్రమిషన్లు లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోడు భూములపై సీతక్క మాట్లాడితే అసెంబ్లీలో కేసీఆర్ రంకెలేశారని, ఎక్కడికెళ్లినా ఆదివాసీ, గిరిజనులు పోడు భూమిపైనే అడుగుతున్నారని అన్నారు.

ఇది కూడా చదవండి: రా..రామన్ని.రారా..రమ్మని

2024, జనవరి 1 న కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, అర్హులైన అందరికీ పోడు భూములకు పట్టాలు ఇస్తామని భరోసా ఇస్తున్నానని హామినిచ్చారు. పోడు భూములపై కేసీఆర్ లో గుబులు పుట్టిందని, గిరిజనులు, ఆదివాసులు కాంగ్రెస్ కు అండగా ఉంటున్నారని…. పోడు భూములకు పట్టాలిస్తామని ప్రకటించారు. మంచిర్యాల ప్రాంతంలో పోడు భూముల గురించి చంటి పిల్లలపై దాడులు చేయిస్తే సీతక్క అండగా నిలిచిందన్నారు. తాడ్వాయి అడవుల్లో అడబిడ్డలను చెట్లకు కట్టేసి కొడితే మేం వెళ్లి అండగా నిలిచామని అన్నారు. తొమ్మిదేళ్లుగా పోడు భూములకు ఎందుకు పట్టాలివ్వలేదని ప్రశ్నించారు. అసెంబ్లీని అడ్డుపెట్టుకుని కేసీఆర్ ప్రజల్ని మోసం చేయాలని చూస్తున్నారని, కాంగ్రెస్ సభకు వెళితే పోడు భూములకు పట్టాలు రావని చెబుతున్నారటా అని అన్నారు. బిడ్డా పోడు భూములకు పట్టాలు ఎలా రావో చూస్తామని హెచ్చరించారు. పట్టాలు ఇవ్వకుంటే అడవుల్లోకి ఓట్లు అడగడానికి వస్తే.. మీపై తిరగబడటం ఖాయమని, ప్రజలందరు తిరగబడాల్సిన అసవరం ఎంతైన ఉందన్నారు. కేసీఆర్.. మా గిరిజనులు నీ వెయ్యి ఎకరాలలో గుంట భూమి ఆడిగారా? , నీ బ్యాంకులో ఉన్న కోట్లలో చిల్లిగవ్వ ఆడిగారా? తొమ్మిదేళ్లుగా పోడు భూములకు ఎందుకు పట్టాలివ్వలేదు? అన్ని ప్రశ్నించారు. అర్హులైనవారికి 11 లక్షల ఎకరాల పోడు భూములకు పట్టాలిచే వరకు కాంగ్రెస్ మీకు అండగా ఉంటుందన్నారు. వాల్మీకి బోయలని ఎస్టీ లలో చేరుస్తా అన్న కేసీఆర్ ఇప్పటివరకు హామీని నిలబెట్టుకోలేదున్నారు. పిట్టను గురి పెట్టి కొట్టినట్లు బోయలు కేసీఆర్ ను గురి పెట్టి ఓడించడం ఖాయమన్నారు. జీవో నెంబర్ 3 ప్రకారం గిరిజన టీచర్లకు ప్రమోషన్లు ఇవ్వాలని, ఇసుక , ఇటుక దందాల్లో.. సీతారామ ప్రాజెక్టు ఆగినా.. ఏదయినా హరికి తెలుసు అంటున్నారట, 30 శాతం కమీషన్ ఇచ్చినంకనే లెక్క అంటున్నాడట..రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి ఉందని దుయ్యబట్టారు. బయ్యారం ఉక్కు కర్మాగారం నిర్మించడం కేసీఆర్ తో కాదని, అది కాంగ్రెస్ ప్రభుత్వంలొనే  సాకారం అవుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం లో ఇళ్లు లేని పేదలకు ఇల్లు కట్టుకునేందుకు రూ.5 లక్షల సాయం అందిస్తామని, రూ.5వేల కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలను కాంగ్రెస్ ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు.

ఇది కూడా చదవండి: కె.విశ్వనాథ్‌ మృతి పట్ల మంత్రి పువ్వాడ అశ్రు నివాళి..

రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసి రైతును ఆదుకుంటామని, ప్రతీ పంటను ప్రభుత్వమే కొని దళారి వ్యవస్థను పాతర వేసే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుందన్నారు. ఖాళీగా ఉన్న 2లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుందన్నారు. పేదలకు కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుందని, పేదలకు, కష్టాల్లో ఉన్న వారికి అభయం ఇచ్చే హస్తం కాంగ్రెస్ అని అన్నారు. అభయ హస్తం మిమ్మల్ని కాపాడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గప్రసాద్, మాజీ కేంద్రమంత్రి బలరాంనాయక్, డాక్టర్ రవి, చీమల వెంకటేశ్వర్లు ఇతర నాయకులు పాల్గొన్నారు.