Telugu News

విత్తనాల విషయంలో గందరగోళం సృష్టిస్తే ఉపేక్షించం: తుమ్మల

రాష్ట్రంలో పత్తి విత్తనాలకు కొరతే లేదూ

0

విత్తనాల విషయంలో గందరగోళం సృష్టిస్తే ఉపేక్షించం: తుమ్మల

== రాష్ట్రంలో పత్తి విత్తనాలకు కొరతే లేదు

== సాగుకు సరిపడా విత్తనాలు సిద్దంగా ఉన్నాయి

== విపక్షాలవి అసత్య ఆరోపణలు*

== రైతులపై లాఠీచార్జి కూడా అవాస్తవం*

== ఈసారి 1.24 కోట్ల పత్తివిత్తన ప్యాకెట్లు*

== ఇప్పటికే 51 లక్షల ప్యాకెట్లు అందుబాటులో*

== 10 లక్షల విత్తన ప్యాకెట్లను రైతులు కొన్నారు*

== గందరగోళం సృష్టిస్తే ఉపేక్షించం: తుమ్మల

== రైతులకు విత్తనాలు అందేలా చూడండి కలెక్టర్లకు వ్యవసాయ శాఖ డైరెక్టర్ లేఖ…

(వ్యవసాయం- విజయం న్యూస్)

(రిపోర్టర్ -పెండ్ర అంజయ్య)

రాష్ట్రంలో పత్తి విత్తనాల కొరతలేదని, పత్తి విత్తనాల విషయంలో కావాలనే కొందరు అసత్య ప్రచారాలు చేస్తున్నారు .. అలాంటివి చాలా తప్పు.. విత్తనాల విషయంలో గందరగోళం సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. విత్తనాలపై రాష్ట్ర స్థాయి అధికారులతో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులపై మండిపడ్డారు. అంతే కాకుండా ప్రతి పక్షాలు పై విరుచుకుపడ్డారు..

ఇది కూడా చదవండి:- తెలంగాణ లోగో సిద్దం

సాగు విస్తీర్ణానికి సరిపడా విత్తన ప్యాకెట్లు అందుబాటులో ఉన్నాయని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. విత్తన కంపెనీలతో గత ఫిబ్రవరి, మార్చి నెలల్లో సమావేశాలు నిర్వహించినట్లు వెల్లడించారు. 2023-24 సంవత్సరంలో 44.92 లక్షల ఎకరాల పత్తిపంటసాగు కాగా, ఈ వానాకాలానికి 55 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగవతుందని అంచనావేసి 124 కోట్ల పత్తి విత్తన పాకెట్లను రైతులకు అందుబాటులో ఉంచడానికి ప్రణాళిక వేశామని ఇప్పటిదాకా 51,40,405 పత్తి పాకెట్లు వివిధ జిల్లాల్లో రైతులకు అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. 10,39,040 ప్యాకెట్లను విత్తనాలు రైతులు కొనుగోలు చేసినట్లు తెలిపారు. పత్తి విత్తనాల కొ రత ఉన్నట్లు కొందరు విపక్ష నేతలు ఆరోపణలు చేస్తున్నారని, అది అవాస్తవమని పేర్కొన్నారు. కొన్ని జిల్లాల్లో రైతులు ఒకే కంపెనీకి చెందిన ఒకే వెరైటీ విత్తనాలు అడగటంతో రైతులను ‘క్యూ’ లో నిల్చోబెట్టి ఒక్కో రైతుకు రెండు పాకెట్ల చొప్పున పంపిణీ చేశారని, అంతేతప్ప మార్కెట్లో గానీ, జిల్లాల్లోగాని విత్తనాల కొరతలేదని తెలిపారు. రైతులు ఒకే కంపెనీ విత్తనాల కోసం పోటీపడకుండా వ్యవసాయ యూనివర్సిటి శాస్త్రవేత్తలు సూచించిన పలురకాల హైబ్రీడ్ విత్తనాలు తీసుకోవాలని, యాజమాన్య పద్దతులు పాటిస్తే దిగుబడులొస్తాయని తుమ్మల తెలిపారు.

ఇది కూడా చదవండి:- తలపై నీళ్లు పోసుకున్న రాహుల్ గాంధీ

నకిలీ విత్తన విక్రేతలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్నదని, ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే 1966 విత్తన చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికి రూ.2.40 కోట్ల విలువైన 188.29 క్వింటాళ్ల నకిలీ విత్తనాలు సీజ్ చేసినట్లు తెలిపారు.

నిరుడు వానాకాలంలో రూ.66.81 కోట్లు సబ్సిడీతో 1.27 లక్షల క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాన్ని పంపిణీ చేశారని, ఈ తేదీ నాటికి కేవలం 24.898 క్వింటాళ్లు మాత్రమే రైతులకు పంపిణీ చేశారని, ఈ వానాకాలం సీజన్ కు రూ. 109.15 కోట్ల సబ్సిడీ విలువతో 1. 95 లక్షల క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఇప్పటికే 79,261 క్వింటాళ్లు పంపిణీ చేశామని, అందులో 54,162 క్వింటాళ్లు రైతులు కొనుగోలు చేశానని, నిరుటితో పోలిస్తే 29వేల క్వింటాళ్లు ఎక్కువగా పంపిణీ చేసినట్లు మంత్రి తెలిపారు.

ఇది కూడా చదవండి:+ తిరుమలాయపాలెం మండలంలో రేపు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటన

ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నప్పటికి ఈసీ నుంచి అనుమతులు తీసుకొని టెండర్ల ప్రక్రియ పూర్తిచేయాడమే కాకుండా, గత ప్రభుత్వ హయాంలో పంపిణీదారులకు చెల్లించకుండా ఉన్న బకాయిలను ఈ ప్రభుత్వం విడుదల చేసినట్లు తెలిపారు. విత్తనాల సరఫరాలో ఎలాంటి ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని, సొసైటీల పరిదిలోని రైతులకు విత్తనాలపై వచ్చిన సమాచారంతో కొంత గందరగోళమైన పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. రైతుల్లో గందరగోళ పరిస్థితులు సృష్టించేవారిని ఇకమీదట ఉపేక్షించేది లేదని మంత్రి తుమ్మల హెచ్చరించారు. ఎరువుల కొరత కూడా రాష్ట్రంలో లేదని, అన్ని ఎరువులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. నిరుడు వానా కాలం సీజన్లో ఈ సమయానికి 4,24,160 టన్నుల యూరియా ఉంటే ఈసారి 6,88,382 టన్నులు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. డిఏపీ అప్పుడు 1,19,888 లక్షల టన్నులు, ఈఏడాది 79,376 టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు నిరుడు 3,76,897 లక్షల టన్నులు అందుదుబాటులో ఉంచితే ఈ సీజన్ లో 4,21,718 టన్నులు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.

ఇది కూడా చదవండి:- తెలంగాణ ప్రజలకు సర్కార్ గుడ్ న్యూస్

ఎంవోపీ నిరుడు 8,720 టన్నులు ఉంచితే, ఇప్పుడు 24,984 టన్నులు, SSP నిరుడు 17, 993 టన్నులు అందుబాటులో ఉంచితే.. ఇప్పుడు 13,997 టన్నులు, మొత్తం కలిపి నిరుడు 9,47,667టన్నుల ఎరువులు అందుబాటులో ఉంచితే ఈ ఏ ఏడాది ప్రభుత్వం 12.28,457 ఉన్నులు అందుబాబులో ఉంచినట్లు తేలిపారు. విత్తనాలు, ఎరువులను సమృద్ధిగా అందుబాటులో ఉంచిన ఈ ప్రభుత్వానికి ప్రణాళిక లేదని, ఎరువులు,విత్తనాలను తగినంతగా సరఫరా చేయటం లేదని విపక్ష నేతలు ఆరోపణలు చేయటం హాస్యాస్పదమని అన్నారు. కాగా అన్ని జిల్లాల్లో అవసరమైన పత్తి, పచ్చి రొట్ట విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, వాటిని రైతులకు అందించేందుకు చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి జిల్లా కలెక్టర్ లను కోరారు. ఈ మేరకు ఏఏ జిల్లాలో ఏఏ విత్తనాలు ఎంత స్టాక్ ఉన్నాయో తెలియుజేస్తూ కలెక్టర్లకు బుధవారం లేఖ రాశారు. ఈ సీజన్ కోసం. 41 లక్షల క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలను, 1.26 కోట్ల పత్తి విత్తనాలను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఎక్కడ కూడా విత్తనాలకు ఎలాంటి కొరత లేదన్నారు.