Telugu News

మంత్రిగారు దమ్ముంటే నాపై అవిశ్వాసం పెట్టు: కనకయ్య

విలేకరుల సమావేశంలో కోరం కనకయ్య ఫైర్

0

మంత్రిగారు దమ్ముంటే నాపై అవిశ్వాసం పెట్టు: కనకయ్య

== నా బలం చూసే పదవి ఇచ్చారు

== పది పార్టీలు మారినా చరిత్ర నీది కాదా..?

== నీదో పార్టీ.. నీ తండ్రిదో పార్టీ

== శ్రీనివాస్ రెడ్డి దృతరాష్ట్రుడు కాదు..ధర్మరాజు

== ఇంత దరిద్రమైన రాజకీయ చరిత్ర మీది

== ఎవరిని తరిమి కొడతారో చూద్దాం!

==  మెడికల్ కాలేజ్ పేరుతో పేదలను పిప్పి చేశావు
== శ్రీనివాస్ రెడ్డి కేవలం కాంట్రాక్టర్ మాత్రమే

== మరో మూడు నెలల్లో ఎవరు బలమేంటో తెలుసుకుందాం
== విలేకరుల సమావేశంలో కోరం కనకయ్య ఫైర్

(ఇల్లెందు-విజయం న్యూస్)

జడ్పీ చైర్మన్ పదవి నా కష్టానికి ఫలితం..పది పార్టీలు మారితే పదవి ఇవ్వలేదు..నా సత్తా చూసి పదవి ఇచ్చారు.. మీకు దమ్ముంటే నాపై అవిశ్వాసం పెట్టండి అంటూ మాజీ ఎమ్మెల్యే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య సవాల్ విసిరారు.

ఇది కూడా చదవండి:- అజయ్ నీ వైఖరి మార్చుకో: పొంగులేటి అనుచరులు

ఇల్లెందులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నేను పుట్టుకతోటి పది పార్టీలు మారలేదు. తండ్రి ఒక పార్టీలో, నేను ఒక పార్టీలో లేను.. కాంగ్రెస్ నుండి గెలిచి బిఆర్ఎస్ లోకి వెళితే నాకు మంత్రి పదవి ఇవ్వలేదు. కృతజ్ఞతగా జడ్పీ చైర్మన్ ఇచ్చారు. అది నా వ్యక్తిగత బలంతోటే అంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా . చైర్మన్ కోరం కనకయ్య ధ్వజమెత్తారు.

ఇది కూడా చదవండి:- సీఎంను వదలని పొంగులేటి

తండ్రి ఒక పార్టీ,కొడుకుకు ఒక పార్టీలో ఉన్న చరిత్ర మంత్రి పువ్వాడదని మాజీ ఎమ్మెల్యే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య ఆరోపించారు. మొదట కమ్యూనిస్టు పార్టీ, ఆ తర్వాత వైసిపి ఆ తర్వాత కాంగ్రెస్, ప్రస్తుతం బి ఆర్ ఎస్ ఉన్నారని పేర్కొన్నారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కి తీవ్రమైన అన్యాయం జరిగిందని తెలిపారు. నాడు వైఎస్ఆర్సిపి నుండి ముగ్గురు ఎమ్మెల్యేలు ఒక ఎంపీ గెలిపించుకున్న ధీరుడు శ్రీనివాసరెడ్డిని కొనియాడారు. అప్పటి కెసిఆర్ పిలుపు మేరకు వైయస్సార్సీపి బీఆర్ఎస్ లో విలీనం చేశాడని గుర్తు చేశారు. కనీసం ఆయనకి ఎంపీ పదవి ఇవ్వకుండా పార్టీకి దూరంగా పెట్టారన్నారు. అందుకు ఆయన వెంట నిలచాల్సి వచ్చిందని తెలిపారు.  శ్రీనివాసరెడ్డి అక్రమంగా సంపాదించారని మంత్రి చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. అక్రమం, సక్రమం గురించి మంత్రి మాట్లాడుతుంటే నవ్వుకునే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ఎప్పుడైనా మీ చరిత్ర లో మమత ఆసుపత్రిలో ఎవరికైనా ఉచిత వైద్యం అందించిన దాఖలాలు ఉన్నాయో చెప్పాలన్నారు. మెడికల్ కాలేజ్ పేరిట పేదల సొమ్మును దోచుకున్న నాయకుడు పువ్వాడన్నారు. భూ కబ్జాలు, దందాలు చేస్తున్నడని ఆరోపించారు.

ఇది కూడా చదవండి:- సీఎం కేసీఆర్ పై పోటీకి నేను సిద్దం: పొంగులేటి 

ఖమ్మంలో మంత్రి వసూళ్ళ దందా చేస్తే,ఇల్లెందులో శాసన సభ్యురాలు ఇసుక దందా నిర్వహిస్తున్నారని కుండ బద్దలు కొట్టారు. శ్రీనివాస్ రెడ్డి కాంట్రాక్టర్ చేస్తూ కష్టపడి సంపాదించిన చరిత్ర అన్నారు. అదేవిధంగా పేదలకు ఉచిత వైద్య సేవలందిస్తున్న గొప్ప వ్యక్తి అని కొనియాడారు. తండ్రి కొడుకులు వేర్వేరు పార్టీల్లో ఉంటూ దరిద్రమైన రాజకీయ చరిత్ర ఆయనకు లేదన్నారు. జడ్పీ చైర్మన్ ఎవరి బిక్ష కాదని తన సొంత బలంతో వచ్చిందన్నారు. శాసనసభ్యురాలు పదేపదే పార్టీకి అన్యాయం చేశాడని పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి బిఆర్ఎస్ లో చేరడం గురించి అందరికీ తెలుసు అన్నారు. మరో. మూడు నెలల్లో ఎన్నికలు వస్తాయని చెప్తున్నారు. ఎవరు బలమేంటో చూసుకుందామని సవాల్ విసిరారు. ఈ సమావేశంలో పలువురు బి ఆర్ ఎస్ నాయకులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి:-  పొంగులేటి లక్ష్యం కేసీఆర్ ను దించుడే: ఈటెల