ఆందోళన వద్దు.. కరోనా ని ధైర్యంగా ఎదుర్కొందాం
కరోనా నివారణకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం
స్వీయ నియంత్రణ, సామాజిక దూరం, మాస్కులు ధరిస్తే మంచిది
కరోనా బాధితులు, వారి కుటుంబ సభ్యులు,ఆధికారులతో టెలీ కాన్ఫరెన్స్ లో మాట్లాడిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
ఆందోళన పడొద్దు.. కొంచెం ధైర్యంగా ఉందాం. మీకు అన్ని విధాలుగా అండగా నేను ఉంటాను. మరీ ఇబ్బందులు అనిపిస్తే, నాకు గానీ, నా వద్ద పని చేసే సిబ్బందికి గానీ ఫోన్ చేయండి. అంటూ ఒకవైపు కరోనా బాధితుల స్థితిగతులను తెలుసుకుంటూ… మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కరోనా బాధితులకు ధైర్యాన్ని నూరి పోశారు. బాధితులకు భరోసాని, ధైర్యాన్నినింపుతూ మంత్రి మాట్లాడారు.
also read :-సమ్మక్క సారలక్క గద్దెను సందర్శించిన పొంగులేటి
పాలకుర్తి నియోజకవర్గంలోని పాలకుర్తి, కొడకండ్ల, దేవరుప్పుల, పెద్దవంగర, తొర్రూరు, రాయపర్తి మండలాల్లోని కరోనా బాధితులు, వారి కుటుంబ సభ్యులు, ప్రజా ప్రతినిధులు, అధికారులతో మంత్రి శుక్రవారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో నియోజకవర్గ వ్యాప్తంగా ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఆర్డీవోలు, ఎమ్మార్వో లు, సీఐ లు, ఎస్సైలు, డీఎం& హెచ్ఓ, డాక్టర్లను టెలీకాన్ఫరెన్సులోకి తీసుకుని మంత్రి వారితో మాట్లాడారు. కాగా, వారిలో అనేక మంది మంత్రి తోనూ మాట్లాడారు. వారి యోగ క్షేమాలను, అందుతున్న వైద్యాన్ని, తీసుకుంటున్న జాగ్రత్తలను మంత్రి ఎర్రబెల్లితో పంచుకున్నారు.