Telugu News

ఇంటింటికి పువ్వాడ

ప్రజలతో కలిసిపోతూ.. ప్రజా సమస్యలను తెలుసుకుంటూ

0

ఇంటింటికి పువ్వాడ

== ప్రజలతో కలిసిపోతూ.. ప్రజా సమస్యలను తెలుసుకుంటూ

== వాడ వాడ పువ్వాడ కార్యక్రమంలో పలు సమస్యలు పరిష్కారం..

== పలు సమస్యలు తక్షణమే పరిష్కారం అవడం పట్ల హర్షం వ్యక్తం చేసిన ప్రజలు.

== తొలి ప్రాధాన్యత లో ఉన్న సైడ్ డ్రెయిన్లకు ప్రతిపాదనలు సిద్దం చేయలని మంత్రి ఆదేశం.

== విద్యుత్ దీపాలు లేని చోట ఏర్పాట్లకు ఆదేశం.

== వాడ వాడ పువ్వాడ కార్యక్రమంలో మంత్రి పువ్వాడ అజయ్

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఇంటింటికి తిరిగుతూ, కనిపించిన వారితో మాట్లాడుతూ అప్యాయతగా పలకరిస్తూ అందరి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. అందరిలో కలిసిపోతున్న మంత్రి పువ్వాడ తక్షణమే ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. డ్రైనేజీ, విద్యుత్ స్థంబాలు, విద్యుత్ సమస్యలను తక్షణమే పరిష్కరిస్తున్నారు. పింఛన్లు, ఇతర సమస్యలపై ఆరా తీస్తున్నారు. రోడ్లు లేని ప్రాంతాలకు రోడ్లను మంజూరు చేస్తానని, ఆశీర్వదిస్తే మరింత అభివద్ది చేస్తానని హామినిస్తున్నారు.

allso read- ఖమ్మం నగరం రాష్ట్రానికే ఆదర్శం..మంత్రి పువ్వాడ.

వాడ వాడ పువ్వాడ కార్యక్రమంలో ఖమ్మం నగరంలోని 6వ డివిజన్ నందు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఉదయాన్నే పర్యటించారు.ప్రజలు హారతులతో డివిజన్ లోకి స్వాగతం పలికారు. తమ సమస్యలు విన్నవించెందుకు డివిజన్ ప్రజలు మంత్రి పువ్వాడ కొరకు ఎదురు చూసి తమ బాధలు, స్థానిక ఇబ్బందులు చెప్పుకుంటే తీరిపోతాయి ధీమాగా తమ సమస్యలు చెప్పుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ డివిజన్ లోని ఇంటింటికి నేరుగా వెళ్లి ప్రజలను నేరుగా కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అత్యధిక సంఖ్యలో స్ధానిక ప్రజలు తమకు రోడ్లు, సైడ్ డ్రెయిన్లు కావాలని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉందని, రాత్రి సమయాల్లో ఇంటికి వెళ్లేందుకు రోడ్డు సరిగా లేకపోవడం కాకుండా వీధి దీపాలు కూడా వెలగట్లేదు అని, మరి కొన్ని చోట్ల అసలు దీపాలే లేవని వివరించారు.స్ధానిక చర్చ్ వద్ద కాల్వ నీరు రోడ్డు పైకి వస్తుందని ప్రజల ఫిర్యాదు మేరకు తక్షణమే ఇక్కడ కల్వర్టు నిర్మాణంకై ప్రతిపాదనలు చేసి నిర్మించాలని అదేశించారు. తక్షణమే వీధి దీపాలుఎర్పాటు చేసి దీపాలు లేని చోట దీపాలు ఎర్పాటు చేయలని మంత్రి అధికారులను అదేశించారు.  ఈ సందర్భంగా విద్యుత్, త్రాగునీరు, పారిశుధ్యం, గుంతల పూడిక, వృద్ధుల పెన్షన్లు, డ్రెయిన్లు తదితర సమస్యల పరిష్కారించలని మంత్రి పువ్వాడ ఆదేశించారు.. అర్హులై ఉండి, చిన్న చిన్న సమస్యలు ఉండి ఆసరా పెన్షన్ పొందలేని వారికి తగు సూచనలు చేసి వారికి పెన్షన్ వచ్చేలా చేయలని మంత్రి అదేశించారు.

allso read- ఖమ్మం నగర అభివృద్ధి దేశానికే ఆదర్శం: మంత్రి పువ్వాడ

ప్రభుత్వం ఎంతో చిత్త శుద్ధితో పేదలకు ఆసరాగా ఉండేందుకు ఆసరా పెన్షన్ ను ఇస్తుంటే ఆయా ఫలాలను అధికారులు అందేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.తొలుత డివిజన్ లో ప్రధాన డ్రెయిన్ల అవసరతను గుర్తించి వాటికి ప్రతిపాదనలు సిద్దం చేయలని, శిధిలమైన కొన్ని చోట్ల సైడ్ కాల్వల మరమ్మతులు చేపట్టాలని, అవసరం అయ్యే చోట కొత్త సైడ్ కాల్వలకు ప్రతిపాదనలు సిద్దం చేయాలని మున్సిపల్ అధికారులను మంత్రి అదేశించారు.ఈ కార్యక్రమంలో మంత్రి వెంట నగర్ మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, కార్పొరేటర్ నాగండ్ల కొటి, మున్సిపల్  కమిషనర్ ఆదర్శ్ సురభి, అసిస్టెంట్ కమీషనర్ మల్లీశ్వరి, పబ్లిక్ హెల్త్ ఇఇ రంజిత్, విద్యుత్ డిఇ రమేష్, మున్సిపల్ డీఈ లు,ఏఈ లు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు .