Telugu News

దొర బిడ్డ కావాలా..? గడి దొర కావాలా..?: నామా 

నేను జిల్లా రైతు బిడ్డను.. రైతులు ఘోస నాకు తెలుసు

0
దొర బిడ్డ కావాలా..? గడి దొర కావాలా..?: నామా 
== నేను రైతు బిడ్డను.. కాపాడుకోవాలి
==  నేను జిల్లా రైతు బిడ్డను.. రైతులు ఘోస నాకు తెలుసు
== బీఆర్ఎస్ కూసుమంచి మండల ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, తాతా మధు
పాలేరు, ఏప్రిల్ 25(విజయం న్యూస్)
కన్నతల్లి అంటే నాకు ఎంత ఇష్టమో ఖమ్మం జిల్లా ప్రజలు కూడా  అంతే  ఇష్టము..ఈ  జిల్లాలో పుట్టిన రైతు బిడ్డను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్తపైనా ఉందని  బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి నామ నాగేశ్వరరావు  పేర్కొన్నారు. కూసుమంచి మండలం పాలేరు బీవి రెడ్డి ఫంక్షన్ హాల్ లో గురువారం జరిగిన కూసుమంచి మండల పార్టీ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో నామ మాట్లాడారు.
ప్రతి ఒక్క కార్యకర్త ఇంటికి తిరిగి ఓటర్లను  కలిసి కాంగ్రెస్ మోసాన్ని ఎండగట్టి , తన విజయానికి కృషి  చేయాలని పేర్కొన్నారు.కాంగ్రెస్ పార్టీ పేదలను, బడుగు బలహీన వర్గాలకు వర్గాల వారిని  తమ ఓటు బ్యాంకుగా  వాడుకుంటోందని , ఈ ఎన్నికల్లో ఆ పార్టీకి తగిన గుణపాఠం నేర్పాలని చెప్పారు .
తెలంగాణ ప్రయోజనాలను, ప్రాజెక్టులు, నిధులు , హక్కులను  కాపాడాలంటే బీఆర్ ఎస్ ఎంపీ లను గెలిపించి  పార్లమెంట్ కు పంపాలన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో నష్టం జరిగిందని,  ఈసారి అటువంటి పరిస్థితి లేకుండా అందరు సమైక్యంగా ముందుకు కదిలి తన విజయానికి కష్టపడాలని చెప్పారు .
కార్యకర్తల పైన కేసులు పెడితే ఖబర్దార్  అన్నారు.
ఎన్ని కష్టాలైనా కార్యకర్తలకు అండగా ఉండి కాపాడుకుంటాం.. భయపడాల్సిన పని లేదని స్పష్టం చేశారు. నియోజవర్గంలో సాగునీరు అందక   ఎండిపోయిన పంటలను పరిశీలించి, రైతుకు భరోసా కల్పించామన్నారు.రైతు , పేదల వ్యతిరేక కాంగ్రెస్  ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని అన్నారు .
      పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ  తాతా మధు మాట్లాడుతూ
ఖమ్మం జిల్లాలో  కాంగ్రెస్ పార్టీకి పోటీ చేయడానికి స్థానిక నాయకులే  కరువయ్యారని అన్నారు.  ముగ్గురు మంత్రులు ఉన్నా హైదరాబాద్ లో కూర్చున్న వ్యక్తి ని గడి నుంచి  ఖమ్మం తీసుకువచ్చి పోటీ చేయిస్తున్నారని  తెలిపారు .
ప్రజల్లో ఉంటూ ప్రజలకు అండగా ఉంటూ రాజకీయాలు చేస్తున్న రైతు బిడ్డ నామా నాగేశ్వరరావు  కావాలో , గడి దొర కావాలో ప్రజలు తేల్చుకోవాలన్నారు. 1996లోనే తన తండ్రి పేరుతో ట్రస్ట్ పెట్టి  ప్రజల దాహార్తిని తీర్చారని చెప్పారు .తెలంగాణ బిల్లు పార్లమెంటులో పెట్టినప్పుడు మొదటి ఓటు వేసిన నాయకుడు నామ అన్నారు.  తెలంగాణ సాధన ఉద్యమంలో పాలుపంచుకున్నారని చెప్పారు .నిధులు,  ప్రాజెక్టులు ఇతర సమస్యలపై పార్లమెంట్ సాక్షిగా ఎన్నోసార్లు తన గళాన్ని న్ని వినిపించారని తెలిపారు. తెలంగాణ హక్కులు కాపాడాలంటే నామ లాంటి నాయకుడు పార్లమెంటులో ఉండాలని చెప్పారు.అత్యధిక  హాజరు శాతం ఉన్న ఎంపీగా నామ గుర్తింపు పొందటం ఖమ్మం జిల్లాకు గర్వకారణమని అన్నారు. గత 30 ఏళ్లుగా మీలో ఒకడిగా ఉంటూ మీతో కలిసి ఉండే నామ కావాలా ఎక్కడో ఉన్న తెచ్చుకున్న గడియ దొర కావాలో తేల్చుకోవాలని చెప్పారు .రైతు బిడ్డ కావాలో గడియ దొరకావాలో పల్లె ప్రజలు నిర్ణయించుకొని నామాకు ఓటేయాలని పిలుపునిచ్చారు.
   రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ
నామా నాగేశ్వరరావు తెలంగాణ బాహుబలిని అన్నారు. నామ లాంటి నాయకుడు  పార్లమెంట్ లోనే ఉండాలని తెలిపారు .
రైతు బిడ్డ కావడం వల్లనే రైతు  వ్యతిరేక నల్ల చట్టాలపై కొట్లాడి వాటిని వెనక్కు తీసుకునేలా చేశారని గుర్తు చేశారు .
నామ రెండు లక్షల మెజారిటీతో గెలవ బోతున్నారని అన్నారు.
కందాల ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ సీరియస్ గా పని చేయకపోవడం, మరికొన్ని కారణాల వల్ల  గత అసెంబ్లీ ఎన్నికల్లో నష్టం జరిగిందని తెలిపారు. ఈ సారి అలా కాకుండా ప్రతి ఒక్క కార్యకర్త
సీరియస్ గా దృష్టి పెట్టి ఇంటింటికి తిరిగి నామ  విజయానికి కృషి చేయాలని కోరారు .నామా ను గెలిపిస్తేనే మరింత బలంగా ఉండ గలుగుతాం అని తెలిపారు .ఇప్పుడు ఏర్పడిన దోషం పోవాలంటే నామను గెలిపించడం ద్వారానే అది సాధ్యం అవుతుందని అన్నారు.  ఏ ఊరు కా ఊరు ఖచ్చితంగా  ఇంటికి వెళ్లి పని చేసి ,  జరిగిన నష్టం పూడ్చాలని పేర్కొన్నారు.
వేముల వీరయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో డీసీసీబీ డైరెక్టర్ ఇంటూరి శేఖర్, ఎంపిపి బాణోత్ శ్రీనివాస్ నాయక్ , బెల్లం వేణుగోపాల్, మండల పార్టీ కార్యదర్శి ఆసీఫ్ పాషా,రామిరెడ్డి, చంద్రారెడ్డి, చాట్ల పరుశురాం, మలీదు వెంకన్న, రామచంద్రనాయక్, ఉన్నం బ్రహ్మయ్య, సైదులు, తదితరులు పాల్గొన్నారు.