Telugu News

డోర్నకల్ లో పట్టాలు తప్పిన రైలు

నిండు వర్షంలో పట్టాలను సరిచేసిన రైల్వే ఉద్యోగులు

0

డోర్నకల్లో పట్టాలు తప్పిన రైలు ..

(మహబూబాబాద్-విజయం న్యూస్) :

జిల్లాలోని డోర్నకల్ వద్ద గూడ్సు రైలు పట్టాలు తప్పింది. విజయవాడ నుంచి భద్రాచలం వైపు వెళ్తున్న గూడ్సు రైలు డోర్నకల్ వద్ద పట్టాలు తప్పింది . దీంతో రైలులోని రెండు వ్యాగన్లు పట్టాలపై నుంచి పక్కకు జరిగాయి . దీంతో సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు . వర్షం కురుస్తున్నప్పటికీ వ్యాగన్ల పునరుద్ధరణకు చర్యలు చేపట్టారు . మహబూబాద్ జిల్లా వ్యాప్తంగా ఆదివారం రాత్రి నుంచి వర్షం కురుస్తున్నది . దీంతో పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి .

Also read :- వణికిస్తున్న “గులాబ్”