Telugu News

ముత్యాలగూడెంలో ఇంటింటికి తాగునీరు సరఫరా

పంచాయతీ సర్పంచ్ ముందుచూపుతో తప్పిన నీటి ఎద్దటి

0

ముత్యాలగూడెంలో ఇంటింటికి తాగునీరు

== పంచాయతీ సర్పంచ్ ముందుచూపుతో తప్పిన నీటి ఎద్దటి

== ఒక వైపు ఊరంతా పండుగ.. మరో వైపు నీటిఎద్దటి

(కూసుమంచి-విజయంన్యూస్)

ఒక వైపు ఊరంతా పండుగ జరుపుకుంటున్నారు.. ఎస్సీ కాలనీలో బంగారు మైసమ్మ ఆలయ ప్రారంభం సందర్భంగా గ్రామంలో సగం ఊరు పండుగ చేసుకుంటుండా మిషన్ భగీరథ  నీటి సరఫరాకు అంతరాయం కల్గింది.. దీంతో గ్రామంలో నీటి ఎద్దటి రావడంతో సర్పంచ్ ముందుచూపుతో ఆ సమస్యకు పరిష్కారం లభించింది. దీంతో ప్రజలందరు సర్పంచ్ కు అభినందనలు, ధన్యవాదాలు తెలిపారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే కూసుమంచి మండలం ముత్యాలగూడెం గ్రామంలో దళితలు బంగారు మైసమ్మ పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. బంగారు మైసమ్మ ఆలయంను ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి ప్రారంభించారు. అయితే అంత పండుగ జరుపుకుంటున్న సందర్భంలో ముత్యాలగూడెం గ్రామానికి తాగునీటి సరఫరా చేసే మిషన్ భగీరథ పైప్ లైన్ మరమ్మత్తులకు గురైంది. దీంతో గ్రామంలోకి నీటి సరఫరా నిలిచిపోవడంతో పండుగ వాతావరణంలో మునిగిపోయిన జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో వెంటనే స్పందించిన ముత్యాలగూడెం సర్పంచ్ బొల్లికొండ శ్రీనివాస్ పంచాయతీ ట్యాంకర్ తో పాటు చేగొమ్మ గ్రామానికి చెందిన కొన్ని ట్యాంకర్లను తెప్పించి ఇంటింటికి తాగునీటిని సరఫరా చేశారు. పండుగ రోజున ఎక్కువ నీటి సౌలభ్యం అవసరం ఉండగా, ప్రతి ఇంటికి వరలలో నీటిని సరఫరా చేశారు. ఉదయం నుంచి సాయంత్రం 6గంటల వరకు పంచాయతీ సర్పంచ్, తమ సిబ్బంది నీటి సరఫరా చేస్తూ శభాష్ అనిపించుకున్నారు. దీంతో గ్రామస్థులు సర్పంచ్ చేసిన సహాయానికి ధన్యవాదాలు తెలిపారు.