Telugu News

డ్రంక్ అండ్ డ్రైవ్ లో నలుగురికి జైలు శిక్ష

ట్రాఫిక్ సీఐ నరేష్ కుమార్

0

డ్రంక్ అండ్ డ్రైవ్ లో నలుగురికి జైలు శిక్ష
ట్రాఫిక్ సీఐ నరేష్ కుమార్
(వరంగల్- విజయంన్యూస్);-
వరంగల్ నగరంలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో 4 గురుకి డ్రంక్ అండ్ డ్రైవ్ కేస్ లో వరంగల్, సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ ఫాతిమా జైలు శిక్ష విధించారు. అడిషనల్ డీసీపీ చిన్నప్ప సాయి చైతన్య, పర్యవేక్షణలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో నలుగుర్ని బుధవారం కోర్టులో హాజరుపరచగా విచారణ చేసిన న్యాయమూర్తి జైలు శిక్ష విధించారు. అజ్మీరా. రాజశేఖర్, మచ్చ. శివ కుమార్ , దాసి. శోభన్ రాజు , మైసా. రమేష్ లకు ప్రతి ఒక్కరికి 2 రోజుల జైలు శిక్ష విధించగా వారిని పరకాల సబ్ జైలుకు పంపించినట్లు ట్రాఫిక్ సీఐ నరేష్ కుమార్ తెలిపారు. వారితో పాటు మరో 21 మందికి రూ.27,700 జరిమాన విధించినట్లు తెలిపారు.

also read:-పాతపాల్వంచలో మరో విషాదం.. రామకృష్ణ చిన్న కూతురు మృతి