మురుగు నీరును తొలగించిన అధికారులు
ఇచ్చోడ, జూన్ 25(విజయం న్యూస్)
ఇచ్చోడ మండలం కేంద్రంలో శుక్రవారం మధ్యాహ్నం ఉరుములు మెరుపులతో కూడిన అతి భారీ వర్షాం కురిసింది. పలు కాలనీలలోని ఇళ్లల్లో వరద నీరు చేరింది. దీంతో జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్డు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మండల కేంద్రంలోని ప్రధాని మురుగు కాలువల్లో చెత్త చెదారం పేరుకుని వర్షం నీటి ప్రవాహానికి తీవ్ర ఆటంకాలు ఏర్పడ్డాయి.
Allso read:- తమ్ముడు చేతిలో అన్న దారుణ హత్య…!
దీంతో శనివారం అధికారులు జెసిబి చెత చెత్తాచెదారం తొలగించి కాలువలు శుభ్రం చేసి వర్షపు నీటి ప్రవాహనికి ఆటంకాలు తొలగించారు. ఇంకా ఏ ఏ ప్రాంతంలో వర్షం వల్ల పారిశుద్ధ్యం దెబ్బతిన్నదో ఆ ప్రాంతాలలో చర్యలు చేపడతామని అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నిమ్మల ప్రీతం రెడ్డి, ఎంపీడీవో రాంప్రసాద్, ఎంపీవో రమేష్, ఎం పి టి సి నిమ్మల శివ కుమార్ రెడ్డి, ఉప సర్పంచ్ లోక శిరిష్ రెడ్డి,పంచాయితీ ఈవో సూర్యప్రకాష్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.