Telugu News

ఇచ్చోడలో మత్తుమందు ఇంజక్షన్ కలకాలం

గుర్తుతెలియని వ్యక్తులు ఇంజక్షన్ ఇచ్చి పరారీలో

0

ఇచ్చోడలో మత్తుమందు ఇంజక్షన్ కలకాలం
♦ గుర్తుతెలియని వ్యక్తులు ఇంజక్షన్ ఇచ్చి పరారీలో

ఇచ్చోడ అక్టోబర్ 20 (విజయం న్యూస్) :

ఇచ్చోడ మండలం లోని నర్సాపూర్ (హరి నాయక్ తండా) కు చెందిన యువకునికి ఉదయం 8:00 గంటల సమయంలో వారి గ్రామ ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు ఇద్దరు ద్విచక్ర వాహనంపై వచ్చి యువకునికి మత్తు ఇంజక్షన్ ఇచ్చి పరారైయ్యారు. యువకుని పరిస్థితి విషమించడంతో ఆదిలాబాద్ రిమ్స్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. యువకుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్ లు తెలిపారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

హరినాయక్ తాండా గ్రామంలో బస్టాండ్ లో నిల్చోని ఉన్న శ్రీకాంత్ (22) అనే యువకుడికి గుర్తు తెలియని ఇంజెక్షన్ పొడిచి పరారైన గుర్తుతెలియని వ్యక్తి…

ద్విచక్ర వాహనంపై వచ్చి ఇంజెక్షన్ పొడిచి వెల్లిపోయినా ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు…

ఇంజెక్షన్ ప్రభావంతో తీవ్ర అస్వస్థతకు గురైన యువకుడు…

అచేతనంగా పడి ఉన్న యువకుడిని చూసి 108 కు సమాచారమిచ్చిన స్థానికులు..

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నట్లు గుర్తించిన 108 సిబ్బంది… రిమ్స్ కు తరలింపు..

రిమ్స్ లో కోలుకుంటున్న యువకుడు…

గుర్తుతెలియని వ్యక్తులు మత్తు ఇంజెక్షన్ ఇస్తున్నారనే వార్త ఆనోట ఈ నోట ప్రచారం కావడంతో భయాందోళనలో స్థానికులు…

Allso read-జిల్లాలో బాణాసంచా అక్రమ నిల్వలు